• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రేపు మేడికొండూరులో మెగా జాబ్ మేళా

GNTR: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో రేపు మేడికొండూరులో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా అధికారి సంజీవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 8వ తరగతి నుంచి పీజీ (MBA, M.Com) వరకు చదువుకున్న వారు, అలాగే ఐటీఐ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ మేళాకు హాజరుకావచ్చు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులన్నారు.

February 23, 2026 / 11:18 AM IST

పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

VSP: చింతలగ్రహారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. 2000-2001 బ్యాచ్ చదువుకున్న విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్య నేర్పిన గురువులను సత్కరించారు. ఒకరికి ఒకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. సాయంత్రం వరకు ఆటపాటల్లో మునిగి తేలారు.

February 23, 2026 / 11:18 AM IST

వైసీపీ లిఫ్టుల మెయింటనెన్స్ పట్టించుకోలేదు: నిమ్మల

AP: గత పాలకులు రాష్ట్రంలోని లిఫ్టుల మెయింటనెన్స్ పట్టించుకోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో 1008 లిఫ్టుల్లో 355 అస్సలు పనిచేయడం లేదని తెలిపారు. 489 పాక్షికంగా, 158 లిఫ్టులు వందశాతం పనిచేస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో లిఫ్టులతో 8 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. లిఫ్టులు పనిచేయకపోవడంతో సగానికి సాగు పడిపోయిందన్నారు.

February 23, 2026 / 11:16 AM IST

అమ్మాయిలూ.. జాగ్రత్త: సీపీ సజ్జనార్‌

TG: HYDలో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలపై సీపీ సజ్జనార్‌ స్పందించారు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ‘పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా అని గుడ్డిగా నమ్మొద్దు. అబ్బాయి ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లపై ఆరా తీయండి. పెళ్లికి ముందే కలవడానికి, శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే అనుమానించండి. డబ్బు డిమాండ్, బ్లాక్ మెయిల్ చేసినా భయపడవద్దు. ఫిర్యాదు చేయండి’ అని చెప్పుకొచ్చారు.

February 23, 2026 / 11:16 AM IST

నగరిగుట్ట మసీదు వద్ద చెత్త సమస్య

KDP: పులివెందుల నగరిగుట్ట మసీదు సమీపంలో చెత్తను వేయడంతో గాలికి అది రోడ్డుపైకి ఎగిరివస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోంది. ముఖ్యంగా ఆ మార్గం ద్వారా వెళ్లే పిల్లలు చెత్తాచెదారాల కారణంగా అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. చెత్తాచెదారాలు రోడ్డుపై వ్యాపించడంతో దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అధికారులు స్పందించాలని స్థానికులు కోరారు.

February 23, 2026 / 11:15 AM IST

పారిశుద్ధ్య కార్మికులకు సూచనలు సలహాలు

VKB: వికారాబాద్ మున్సిపల్ ఛైర్మన్ గడ్డం అనన్య వికారాబాద్ పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను తెల్లవారుజామున పరిశీలించారు. పట్టణంలోని ప్రధాన క్రీడలలో జరుగుతున్న పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం ఉపేక్షించేది లేదని పట్టణంలోని అన్ని ప్రాంతాలను శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు సలహాలు చేశారు.

February 23, 2026 / 11:12 AM IST

MPTC, ZPTC .. ఎన్నికలు ఎప్పుడంటే…?

BDK: ఇంటర్, టెన్త్ పరీక్షల తర్వాతే MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ DCCలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. తర్వాత మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, అనంతరం ఇంటర్, టెన్త్ పరీక్షలు ఉన్నాయి. దీంతో అధికారులు ఆయా పనుల్లో ఉండనున్నారు. పరీక్షల తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

February 23, 2026 / 11:10 AM IST

ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘స్టాప్ వాష్ అండ్ గో’ కార్యక్రమం

కోనసీమ: ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘స్టాప్ వాష్ అండ్ గో’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులపై నిద్రమత్తు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. దీనిపై దృష్టి సారించి అమలాపురంలో సోమవారం తెల్లవారుజామున డ్రైవర్లను ఆపి, ముఖం కడుక్కునేలా చేసి ప్రయాణానికి అనుమతిస్తున్నారు.

February 23, 2026 / 11:10 AM IST

గచ్చిబౌలి మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్

HYD: గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనదారులు భారీగా ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నానక్‌రామ్‌గూడ నుంచి గచ్చిబౌలి సర్కిల్ వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. లేన్ క్రమశిక్షణ పాటించాలని కోరారు.

February 23, 2026 / 11:10 AM IST

స్నేహితుడి కుటుంబానికి సాయం

PDPL: సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన ముక్కెర రాజ్ కుమార్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఇవాళ ఆయన కుటుంబానికి 2018 డిగ్రీ బ్యాచ్ స్నేహితులు చేయూతనందించారు. మానవత్వాన్ని చాటుతూ రూ.30 వేలు ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా రాజ్కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో స్నేహితుల మద్దతు ఎంతో బలాన్నిస్తుందన్నారు.

February 23, 2026 / 11:10 AM IST

సోషల్ మీడియాపై సర్కార్ ఫోకస్

AP: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై త్వరలోనే మరోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని హోంమంత్రి అనిత అన్నారు. విద్వేష, అసభ్య పోస్టుల కట్టడికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్కూల్ విద్యార్థులు సోషల్ మీడియా వినియోగించకుండా కొత్త చట్టం తెచ్చే ఆలోచన ఉందన్నారు.

February 23, 2026 / 11:10 AM IST

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో హైఅలర్ట్

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మరోసారి తుపాకులు, బాంబు పేలుళ్లతో దద్ధరిల్లుతోంంది. మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. డ్రోన్ల సాయంతో మావోయిస్టుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు. సరిహద్దు దాటి చొరబడకుండా ఛత్తీస్‌గఢ్ పోలీసులు, ఇటు తెలంగాణ గ్రేహౌండ్స్ దళాలు సమన్వయంతో జాయింట్ కూంబింగ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి.

February 23, 2026 / 11:10 AM IST

‘ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు అన్యాయం’

SDPT: తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న ఆశా వర్కర్లను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని BJP నాయకులు మండిపడ్డారు. నియోజకవర్గంలో అరెస్టైన ఆశా వర్కర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో ఉంచిన వారికి కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు.

February 23, 2026 / 11:09 AM IST

శ్రీకాకుళంలో కవి రచయితల సమ్మేళనం

SKLM: యువ రచయితలను ప్రోత్సాహించటం ఆనందదాయకమని, డా.బీ ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా గ్రంథాలయంలో యువ రచయితల వేదిక అధ్యక్షులు తంగి ఎర్రమ్మ, కార్యదర్శి పొట్నూరి మాలతిల ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. కవి సమ్మేళనంలో పలువురు కవులు తమ కవితలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో గేదెల, వాసవి, తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 11:08 AM IST

అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి పరామర్శ

NDL: చిన్నదేవలాపురం గ్రామంలో నిన్న రాత్రి జరిగిన ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో షేక్ మాభూసా కుటుంబానికి చెందిన పశువుల పాక పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న బండి ఆత్మకూరు టీడీపీ మండల అధ్యక్షులు ముమ్మడి నాగ కృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని సోమవారం పరామర్శించారు.

February 23, 2026 / 11:06 AM IST