• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అమలాపురం వెంకన్న కోనేరుపై పాలకుల నిర్లక్ష్యం

కోనసీమ: భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ కోనేరు (పుష్కరిణి) ప్రస్తుతం దుస్థితికి చేరుకుంది. గత రెండేళ్లుగా నీటిని మార్చకపోవడంతో కోనేరు పాచిపట్టి, మురికి కూపంగా దర్శనమిస్తోంది. మరో నెల రోజుల్లో స్వామి వారి కళ్యాణోత్సవం రానుంది.ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు

March 2, 2026 / 02:40 PM IST

పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

TPT: దొరవారిసత్రం మండలం మీజూరు సచివాలయం పరిధిలోని మల్లెపాలెం గ్రామంలో 94 మంది రైతులకు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ప్రభుత్వ రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతుల భూమి హక్కులను శాశ్వతంగా రక్షించేందుకు క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ టెక్నాలజీతో కూడిన ఆధునిక పాస్ పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు.

March 2, 2026 / 02:39 PM IST

వారిని ఇరాన్‌కు పంపాలి: నటి

యాంకర్, నటి రష్మీ తన సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీకి కీలక విజ్ఞప్తి చేసింది. ‘మన దేశం ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వాన్ని, అన్ని మతాలను గౌరవించింది. కానీ రాడికల్ (అతివాద) మనస్తత్వాన్ని మేము సహించము. ఈ వ్యాధిని ఇక్కడ వ్యాప్తి చెందనివ్వం. రాడికల్ ఆలోచనలతో ఉండి, యుద్ధాన్ని సమర్థించే వారిని దయచేసి ఇరాన్‌కు పంపాలి’ అని కోరింది.

March 2, 2026 / 02:39 PM IST

ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరుకావాలని కలెక్టర్, ఎమ్మెల్యేకు ఆహ్వానం

HNK: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించబోయే ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరు కావాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు ఆహ్వానం అందజేశారు. మార్చి 29వ తేదీన ప్లాటినం జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని పూర్వ విద్యార్థుల సంఘం నేతలు తెలిపారు.

March 2, 2026 / 02:39 PM IST

బేతంచర్లలో కౌన్సిల్ సమావేశం కోరుతూ విజ్ఞప్తి

NDL: బేతంచర్ల నగర పంచాయతీలో జనవరి, ఫిబ్రవరి నెలల కౌన్సిల్ సమావేశం జరగకపోవడంతో సమస్యలు పేరుకుపోయాయి. వార్డుల అభివృద్ధిపై చర్చించలేక కౌన్సిలర్లు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మార్చిలోనైనా సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించాలని ఇవాళ ప్రజా సంఘాల నాయకులు కోరారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

March 2, 2026 / 02:38 PM IST

‘కాంప్లెక్స్‌ను నిర్ణీత సమయానికి ప్రారంభించాలి’

BDK: ఇల్లందులోని రద్దీ ప్రాంతమైన జగదంబ సెంటర్లో గల సులభ్ కాంప్లెక్స్ సకాలంలో తెరవకపోవడంపై మున్సిపల్ ఛైర్పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంప్లెక్స్ మూసి ఉండటంతో మహిళలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆమె తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి నిర్ణీత సమయానికి ప్రారంభించాలని ఆదేశించారు.

March 2, 2026 / 02:37 PM IST

MBNR: ‘ప్రజాసేవలో శ్రీపాదరావు సేవలు స్ఫూర్తిదాయకం’

MBNR: మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డి.జానకి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు సమర్పించారు. ఆమె మాట్లాడుతూ.. శ్రీపాదరావు ప్రజాస్వామ్య పరిరక్షణకు, శాసన వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టేందుకు కృషి చేసిన విశిష్ట నాయకుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ కృష్ణయ్య, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

March 2, 2026 / 02:37 PM IST

‘వైద్య సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలి’

BHPL: రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా ఎపిడెమిక్ బృందం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. భక్తుల భారీ రద్దీ నేపథ్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తున్నారు. జాతరకు తరలివచ్చిన భక్తులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్య బృందం సూచించారు.

March 2, 2026 / 02:37 PM IST

దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం

WNP: దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే కీలక నిర్ణయాన్ని ఆమోదం తెలిపినట్లు వనపర్తి మహిళా సంక్షేమ శాఖ అధికారి సుధారాణి తెలిపారు. ప్రస్తుతం 50% రాయితీ ఇస్తున్న ఈ సదుపాయం ఇకపై ఉచితంగా లభించనున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్న బస్సు సర్వీసులో దివ్యాంగులు కూడా ఉచిత ప్రయాణం అనుమతి ఇస్తారన్నారు.

March 2, 2026 / 02:36 PM IST

కాలువల్లో నీరు నిల్వ – రైతులకు ఉపశమనం

KKD: తొండంగి మండలం వలసపాకల గ్రామ పరిసరాల్లోని పంటకాలువల్లో నీరు నిల్వ ఉండటం రైతులకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కాలువలు నిండడంతో పొలాలకు నీటి సరఫరా సులభమైంది. పచ్చదనం పెరగడంతో పంటల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే కాలువల శుభ్రతపై అధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

March 2, 2026 / 02:36 PM IST

ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

అన్నమయ్య: మదనపల్లెలో సోమవారం జరిగిన ప్రజా దర్బార్‌లో స్థానిక ప్రజలు తమ సమస్యలను మదనపల్లి శాసనసభ్యులు యం. షాజహాన్ భాషకు వివరించి, పరిష్కారం కోరారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి, అధికారులతో మాట్లాడి పరిష్కరించగల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల సమస్యలను సానుభూతితో ఆలకించి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

March 2, 2026 / 02:36 PM IST

మానవత్వం చాటుకున్న జనసైనికులు

W.G: ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు భీమవరం మండలం రాయలం జన సైనికులు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. కర్నూల్ జిల్లాకు చెందిన పునర్విక కోసం రాయలం గ్రామానికి చెందిన జన సైనికులు రూ. 2,65,000 లక్షల విరాళాలు సేకరించి ఎమ్మెల్యే చేతుల మీదుగా సోమవారం అందించారు. జన సైనికులు, వీర మహిళలు విరాళాలు సేకరించడం గొప్ప విషయం అన్నారు.

March 2, 2026 / 02:36 PM IST

కాంగ్రెస్ పార్టీలో చేరిన వార్డు మెంబర్

WGL: నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన తొమ్మిదవ వార్డ్ సభ్యుడు బుజ్జి బిచ్య నాయక్ సోమవారం TPCC సభ్యులు రంజిత్ రెడ్డి, నెక్కొండ మార్కెట్ ఛైర్మన్ హరీష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై చేరినట్లు బిచ్య నాయక్ వెల్లడించారు. అనంతరం రంజిత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

March 2, 2026 / 02:35 PM IST

ఎంపీని కలిసిన పోచంపల్లి పాలకవర్గం

BHNG: ఎంపీ చామల కిరణ్ కుమార్‌ను గచ్చిబౌలిలో పోచంపల్లి మున్సిపల్ ఛైర్మన్ తడక వెంకటేశ్వర్లు, వైస్ ఛైర్మన్ కొయ్యడ రజిని శ్రీనివాస్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంటూ అభివృద్ధికి పాటుపడాలని చామల వారికి సూచించారు.

March 2, 2026 / 02:35 PM IST

నెమలి జెడ్పీహెచ్ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో

NTR: గంపలగూడెం మండలం నెమలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంఈవో నరసింహారావు సోమవారం తనిఖీ చేశారు. రిజిస్టర్లు, తదితర రికార్డులు పరిశీలించారు. తదనంతరం 10వ తరగతి విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ.. పక్క ప్రణాళికతో చక్కగా చదువుకుంటూ, పబ్లిక్ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.

March 2, 2026 / 02:35 PM IST