VKB: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటెలెక్ట్యువల్ డిసెబిలిటీస్ ఆధ్వర్యంలో యూత్4జాబ్స్ సాకారం కోసం దివ్యాంగుల ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించబడుతోంది. ఫిబ్రవరి 27, 2026న సికింద్రాబాద్‌లోని NIEPID క్యాంపస్‌లో ఈ మేళా జరుగనుంది. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్, దివ్యాంగ ధృవీకరణ లేదా UDID కార్డు, విద్యార్హత సర్టిఫికేట్లు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకురావాలి.
GNTR: ఎమ్మెల్యే ధూళిపాళ్ల చొరవతో మంజూరైన రూ. 36 లక్షల నిధులతో చేబ్రోలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. మండల టీడీపీ అధ్యక్షుడు మైలా వెంకట రామ రాజు, ఎంపీటీసీ పఠాన్ ఇర్ఫాన్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఆర్ డీఈ ఉమా శ్రీనివాసరావు, డాక్టర్ ప్రియాంక, కూటమి నాయకులు పాల్గొన్నారు.
కృష్ణా: న్యూఢిల్లీ నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ రాకేష్ లఖన్ నీట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ బాలాజీ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మే నెల 3వ తేదీన జరగనున్న నీట్ పరీక్షకు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
RR: చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని, చేవెళ్ల మున్సిపల్ బీజేపీ వార్డ్ కౌన్సిలర్ పెద్దోళ్ల దయాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ పుట్టినరోజు సందర్భంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన దయాకర్‌ను ఎంపీ అభినందించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
BPT: ఇసుకపల్లిలో వెలసిన శ్రీ భ్రమరాంబ సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధికి దేవాదాయ శాఖ నుంచి రూ. 40 లక్షలు మంజూరయ్యాయి. మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రత్యేక చొరవతో ఈ నిధులు కేటాయించినట్లు టీడీపీ నేత శివప్రసాద్ తెలిపారు. ఈ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన గురువారం భూమి పూజ నిర్వహించారు.
SDPT: గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి లేఖ రాశారు. గండిపల్లి పనులు కేవలం 40 శాతమే పూర్తయ్యాయని వెంటనే రూ.100 కోట్లు మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గ రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలని అన్నారు.
SRPT: కోదాడ పట్టణానికి తాగునీటిని అందించే మిషన్ భగీరథ మేజర్ పైపులైన్లకు జరుగుతున్న మరమ్మతు పనులను మున్సిపల్ ఛైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పైపులైన్ పనుల్లో జాప్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
బాపట్ల జిల్లా రిజిస్ట్రార్‌గా పదోన్నతి పొందిన పంగులూరి శ్రీనివాసరావు గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు మంచి పేరు వచ్చేలా నిబద్ధతతో పనిచేయాలని ఈ సందర్భంగా శ్రీనివాసరావుకు కలెక్టర్ సూచించారు.
T20 క్రికెట్‌లో భారత్, జింబాబ్వే జట్లు ఇప్పటివరకు 13 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా 10 విజయాలతో జింబాబ్వేపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. జింబాబ్వే కేవలం 3 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో, ఈరోజు జరిగే మ్యాచ్‌లోనూ భారత్ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. అయితే, సంచలన ప్రదర్శనతో S-8కు చేరుకున్న జింబాబ్వేను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.
NDL: చాగలమర్రి మండలంలో పెద్దవంగలిలో శ్రీ హజరత్ సయ్యద్ షా దస్తగిరి స్వామి ఉరుసు ఉత్సవాలు మార్చి 1, 2న నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గురువారం తెలిపారు. మార్చి 1న గంధం, 2న ఉరుసు నిర్వహించనున్నట్లు మత పెద్దలు పేర్కొన్నారు. ఉత్సవాల నిమిత్తం దర్గాను నిర్వాహకులు సుందరంగా అలంకరిస్తున్నారు.
KNR: కరీంనగర్‌లో ప్రజా కలెక్టర్‌గా గుర్తింపు పొందారు. మహిళల కోసం ‘శుక్రవారం సభ’, ఆడపిల్లల రక్షణకు ‘ఓ చిన్ని పిచ్చుక’, ఇటుక బట్టీల పిల్లలకు ‘బ్రిక్ బుక్స్’ చేపట్టారు. దివ్యాంగుల కోసం సైన్ లాంగ్వేజ్ నేర్చుకుని, ప్రభుత్వ దవాఖానలోనే సర్జరీ చేయించుకుని ప్రజలకు నమ్మకం కల్పించారు. కాగా, తాజా బదిలీల్లో ఆమె బదిలీ అయిన విషయం తెలిసిందే.
W.G: వీరంపాలెం, పట్టింపాలెం ఎంపీటీసీ సభ్యురాలు జంపల్లి సత్యవతి గురువారం వైసీపీలో చేరారు. నియోజకవర్గ ఇంఛార్జ్ వడ్డే రఘురామ్ సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రఘురామ్ మాట్లాడుతూ.. గతంలో పార్టీని వీడిన వారు తిరిగి వస్తున్నారని, రానున్న రోజుల్లో కూటమి పార్టీల నుంచి భారీగా చేరికలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.
KRNL: ఆదోని ఐసీడీఎస్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు నాలుగో రోజు సామూహిక దీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వేతనం పెంచి, గ్రాచుటీ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ నాయకులు గురువారం డిమాండ్ చేశారు. జీతాలు పెరుగేవరకు దశలవారీగా నిరసనలు, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు కొనసాగిస్తామని సీఐటీయూ నాయకులు తెలిపారు.
SRD: గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లి గ్రామంలో పటాన్‌చెరు డివిజన్ విద్యుత్ ఇంజినీరింగ్ అధికారి భాస్కరరావు రైతులతో సమావేశమై పొలాల్లో పర్యటించారు. వేసవి లోడును దృష్టిలో పెట్టుకుని బొంతపల్లి, గుమ్మడిదల సబ్ స్టేషన్లలో రూ.4 కోట్లతో రెండు 8 ఎంవిఎ ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటు చేశారు. కనుకుంట పరిధిలో రూ.15 లక్షలతో సమస్యలు పరిష్కరించారు.
అన్నమయ్య: రైల్వే కోడూరులో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వినేందుకు టీడీపీ ప్రజా దర్బార్ కార్యక్రమం రేపు నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 09:00 గంటల నుంచి మధ్యాహ్నం 01:00 గంటల వరకు రాఘవరాజుపురం టీడీపీ పార్టీ కార్యాలయంలో కార్యక్రమం జరుగుతుంది. టీడీపీ పార్టీ ఇంఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి ప్రజలను స్వయంగా కలుసుకుని వినతి పత్రాలను స్వీకరించనున్నారు.