• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఎమ్మార్వోకు వినతిపత్రం

KRNL: వెల్దుర్తిలో AITUC ఆధ్వర్యంలో, ఏపీఅంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ మహా ధర్నాకు బయలుదేరుతున్న కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఇవాళ ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. నాయకులు నాగమద్దయ్య మాట్లాడుతూ, శాంతియుతంగా తమ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడి కార్యకర్తలను పోలీసులు నిర్బంధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.

March 2, 2026 / 02:30 PM IST

మధ్యాహ్న భోజనంను పరిశీలించిన సర్పంచ్

KMM: కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం పథకాన్ని గ్రామపంచాయతీ సర్పంచ్ ఐతగాని వెంకటరమణ నాగేశ్వరరావు, వార్డు సభ్యులు పెండ్ర అంజయ్య, ఐతగాని నవీన్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌తో కలిసి మెనూ ప్రకారం భోజనం, కూరలు ఉన్నాయా అని వాటిని పరిశీలించారు.

March 2, 2026 / 02:30 PM IST

‘హోలీని సంతోషకర వాతావరణంలో జరుపుకోవాలి’

JGL: జిల్లాలో హోలీ పండుగను ప్రజలు సంతోషకర వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. ఇతర మతాల వారిని గౌరవిస్తూ, మతసామరస్యంతో హోలీ పండుగ జరుపుకోవాలన్నారు. హోలీ పండుగ వేళ ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామన్నారు.

March 2, 2026 / 02:29 PM IST

బీజేపీ సీనియర్ నేత మధుసూదన్ రావు మృతి

KMM: బీజేపీ సీనియర్ నాయకులు, సత్తుపల్లి వాజ్ పేయిగా ప్రజల్లో ప్రసిద్ధి చెందిన చెక్క మధుసూదన్ రావు సోమవారం సత్తుపల్లిలో అకాల మరణం చెందారు. ఆయన మృతి పట్ల బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావుతో సహా పార్టీ శ్రేణులు సంతాపం ప్రకటించారు. మధుసూదన్ రావు మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.

March 2, 2026 / 02:25 PM IST

IND vs ENG: వరుసగా మూడో సెమీస్

T20 WCలో భాగంగా 5న భారత్-ఇంగ్లండ్ సెమీస్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. సెమీస్ పోరులో ఇరుజట్లు ఢీకొనడం ఇది వరుసగా మూడోసారి. 2022లో తొలిసారిగా జరిగిన పోరులో ఇంగ్లండ్ 10 వికెట్లతో భారత్‌ను చిత్తుచేయగా.. గత టోర్నీలో ప్రత్యర్థిని టీమిండియా 68 పరుగుల తేడాతో ఓడించింది. నాటి 2 టోర్నీల్లోనూ జట్లను రోహిత్-బట్లర్ నడిపించగా.. ఈ సారి సూర్య-బ్రూక్ బరిలోకి దిగారు.

March 2, 2026 / 02:24 PM IST

పీజీఆర్ఎస్‌లో అర్జీలను స్వీకరించిన కలెక్టర్

AKP: అనకాపల్లి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ సమస్యలపై అర్జీలను తీసుకొని వాటిని పరిశీలించి అర్జీదారులతో మాట్లాడుతున్నారు. ప్రజల సమర్పించిన అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించారు.

March 2, 2026 / 02:21 PM IST

50 మంది చిన్నారులకు ఉచితంగా సర్జరీలు

అనంతపురం కిమ్స్ సవేరా ఆసుపత్రిలో ప్రభుత్వ సహకారంతో 50 మందికి పైగా మూగ, బధిర చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రపంచ శ్రవణ దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ చిన్నారులకు ప్రత్యేక కిట్లను పంపిణీ చేశారు. ఖరీదైన ఈ సర్జరీలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.

March 2, 2026 / 02:20 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సొసైటీ ఛైర్మన్

NLR: అల్లూరు మండలం పురిణి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ ఛైర్మన్ మర్రిబోయిన సురేంద్ర ప్రారంభించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ-పంట నమోదు చేసుకుని, ఈకేవైసీ పూర్తయిన రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవచ్చని సూచించారు.

March 2, 2026 / 02:20 PM IST

‘కాలేజీలో ‘నో హెల్మెట్ – నో ఎంట్రీ’ విధానాన్ని అమలు చేయాలి’

కోనసీమ: 18 ఏళ్లు నిండిన విద్యార్థులకు డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ఉంటేనే కాలేజీలోకి అనుమతించాలని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సోమవారం సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో 60% మంది యువతే ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు బైక్ ఇచ్చే విషయంలో కఠినంగా ఉండాలన్నారు. కాలేజీలు ‘నో హెల్మెట్ – నో ఎంట్రీ’ విధానాన్ని అమలు చేయాలన్నారు.

March 2, 2026 / 02:20 PM IST

ప్రజలను వైసీపీ మభ్యపెడుతోంది: మంత్రి

AP: రాయలసీమ హక్కుల పేరుతో ప్రజలను వైసీపీ మభ్యపెడుతోందని మంత్రి మండిపల్లి మండిపడ్డారు. జగన్ హయాంలో 102 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ చేశారని విమర్శించారు. 2014-19లో టీడీపీ రూ.12,441 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. వైసీపీ కేవలం రూ.2,011 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. చంద్రబాబు దృఢ సంకల్పంతో సాగునీటి ప్రాజెక్టులు వేగవంతం చేసినట్లు వెల్లడించారు.

March 2, 2026 / 02:19 PM IST

పార్టీ నాయకున్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

NLG: చింతపల్లి మండలం గొడుకొండ్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాదేపల్లి పులిరాజ్ గౌడ్ ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం పులిరాజ్ గౌడ్‌ను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

March 2, 2026 / 02:18 PM IST

వివిధ పథకాల చెక్కులు అందజేత

SRD: ఆయా పథకాల కింద లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఖేడ్‌లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి సోమవారం అందజేశారు. మండల పరిధిలోని అనంతసాగర్ లక్ష్మీకి కళ్యాణ లక్ష్మి చెక్కు అందజేశారు. అదే విధంగా అరె మారుతి రావుకు మంజూరైన CMRF రూ.60 వేల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మనోహర్ పాటిల్, నాగిరెడ్డి, శివరెడ్డి, లోకేష్ రెడ్డి ఉన్నారు.

March 2, 2026 / 02:18 PM IST

ఇంటర్మీడియట్ పరీక్షకు 97% హాజరు

PDPL: జిల్లాలో ఇవాళ నిర్వహించిన మొదటి సంవత్సరం గణితం/బాటని/ పొలిటికల్ సైన్స్ పరీక్షకు 97% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్ విద్యాధికారి కల్పన ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 5780 మంది పరీక్షకు హాజరు కావలసి ఉండగా, 5613 మంది హాజరయ్యారు. మొత్తం 167 మంది గైర్హాజరయ్యారు.

March 2, 2026 / 02:13 PM IST

మార్చి 10న మెగా జాబ్ మేళా.. పోస్టర్ ఆవిష్కరణ

ఆదిలాబాద్: జిల్లాలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా సందర్భంగా వన్ టౌన్ సీఐ బి. సునీల్ కుమార్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. మార్చి 10న ఏఆర్ హెడ్ క్వార్టర్స్ జరగనున్న ఈ జాబ్ మేళాలో 50కిపైగా కంపెనీలు పాల్గొని 2000కుపైగా ఉద్యోగాలు కల్పించనున్నాయి. నిరుద్యోగులు గూగుల్ ఫారమ్QR Code లింక్ ద్వారారిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

March 2, 2026 / 02:12 PM IST

సూలాల పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి

E.G: రాజమండ్రిలోని బర్మా కాలనీ వద్ద శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పుష్కరాల రేవు వద్ద సూలాల పండుగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరై పూజలు నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు.

March 2, 2026 / 02:08 PM IST