KRNL: RU పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో నిర్వహిస్తున్న ఫస్ట్ సెమిస్టర్ పరీక్షకు గురువారం 85 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 99 మంది విద్యార్థుల్లో 84 మం ది హాజరయ్యారు. కర్నూలు రవీంద్ర డిగ్రీ కాలేజీలో ఒక్కరు డీబార్ అయ్యారు. అలాగే బీటెక్ పరీక్షలకు 99 శాతం, లా పరీక్షకు 92 శాతం మంది విద్యార్థులు హాజరయినట్లు అధికారులు తెలిపారు.
కృష్ణా: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడమే లక్ష్యంగా పోలీసులు గురువారం ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్ని వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.సి (RC), పొల్యూషన్, ఇన్షూరెన్స్ వంటి కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై చలాన్లు విధించారు.
KMR: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మల నుంచి కాపర్, ఆయిల్ చోరికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బాన్సువాడ DSP విఠల్ రెడ్డి వివరాల ప్రకారం పలు గ్రామాల్లో దుండగులు ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్, ఆయిల్ చోరికి పాల్పడుతున్నారు. దర్యాప్తు చేపట్టి నిందితులు సుభాష్, కరీం, సురేఖఅర్జున్ తాంబే, సునీల్ శ్యామ్ రావు వాగ్మారేను గురువారం సాయంత్రం అరెస్ట్ చేశారు.
PLD: ఈపూరు మండలం బొగ్గరం గ్రామానికి చెందిన పిట్టల నాగమణి (24), ఆమె కుమార్తె త్రివేణి అదృశ్యమయ్యారని ఎస్సై వేణుగోపాల్ తెలిపారు. ఈ నెల 24న ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో, నాగమణి తల్లి వెంకటరమణ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త శ్రీనుతో ఉన్న మనస్పర్ధలే వీరి అదృశ్యానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ప్రకాశం: PRC కమిషన్ ఏర్పాటు, CPS రద్దు, IR ప్రకటన తదితర ఉపాధ్యాయుల సమస్యలపై దర్శిలో శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాకు తాళ్లూరు మండల ఉపాధ్యాయ సంఘాలు (APTF) పిలుపునిచ్చాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వాపోతున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ధర్నాలో పాల్గొనాలని కోరారు.
PDPL: మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన ఉదారి సాహిత్య సీఎం కప్ టోర్నీలో గురువారం రెండు పథకాలతో మెరిసింది. సిద్దిపేటలో నిర్వహించిన 2025- 26, రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-15, 10 కి.మీ సైక్లింగ్ పోటీల్లో సిల్వర్, 20 కి.మీ సైక్లింగ్ పోటీల్లో సిల్వర్ పథకాలతో రాణించిందని కోచ్ మ్యాక్స్ వెల్ ట్రావర్ పేర్కొన్నారు. ఆమెని పలువురు అభినందించారు.
WNP: అమరచింత మండలంలోని చిన్న కడ్మూర్లో లబ్ధిదారుడు శ్రీను నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుక గురువారం ఘనంగా నిర్వహించారు. మంత్రి వాకిటి శ్రీహరి, ఆయన సతీమణి లలిత హాజరై ఇంటిని ప్రారంభించారు. లబ్ధిదారులకు ‘సారె’ అందించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల సొంతింటి కల నెరవేరుస్తోందని తెలిపారు.
NLR: యువతను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడమే లక్ష్యంగా రాపూరు పట్టణంలో వజ్ర ప్రహర్ కార్యక్రమాన్ని గురువారం రాత్రి నిర్వహించారు. స్థానిక ఎస్సై వెంకట రాజేష్ నేతృత్వంలో సిబ్బందితో కలిసి అవగాహన సదస్సును చేపట్టారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, మాదక ద్రవ్యాల వాడకం చట్టరీత్యా నేరమని ఆయన హెచ్చరించారు.
MNCL: మందమర్రిలోని తవక్కల్ హైస్కూల్లో నర్సరీ బాలుడిని పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ చితకబాదారు. అందుగుల పేట గ్రామానికి చెందిన పృద్విక్ తవక్కల్ లో నర్సరీ చదువుతున్నాడు. పృద్విక్ ఒంటిపై ఉన్న దెబ్బలను చూసి విద్యార్థి తల్లిదండ్రులు కరస్పాండెంట్ అజీజ్‌కు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ద్వారా వివరాలు సేకరిస్తున్నట్లు కరస్పాండెంట్ తెలిపారు.
ASF: జిల్లాలోని జనకాపూర్ బ్రెయిన్ డెడ్ అయిన ఈస్త సృజన(34) అవయవాలను దానం చేసి నలుగురికి జీవితం ప్రసాదించారు బాధిత కుటుంబీకులు. ఇంట్లో అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన సృజన ICUలో చికిత్స పొందినా ప్రాణం దక్కలేదు. భర్త అంగీకరించడంతో కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు సేకరించి అవసరంలో ఉన్నవారికి అందించారు. సృజన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
JGL: గొల్లపల్లి మండలంలో తన కుటుంబానికి చెందిన భూమిని ఇతరులకు పట్టా మార్పిడి చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ MRO కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసింది. రెవెన్యూ అధికారులు తనకు న్యాయం చేయడం లేదని పేర్కొంది. తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకుండా వెళ్లిపోయారని ఆరోపించింది. ప్రజా ప్రభుత్వంలో తనకు న్యాయం జరిగేలా ఉన్నతాధికారులు న్యాయం చేయాలన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా జైనూర్, సిర్పూర్ యూ మండలం పాములవాడ, నెట్నూర్ గ్రామాలకు చెందిన పలువురు BRS నాయకులు అనారోగ్యానికి గురై ఇటీవలే మరణించారు. ఈ విషయం తెలుసుకున్న MLA కోవ లక్ష్మి వారి నివాసాలకు వెళ్లి చిత్ర పటాలకు పూలు వేసి నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధించారు. BRS నాయకుల మరణం పార్టీకి తీరని లోటు అన్నారు.
KRNL: మున్సిపల్ కార్పొరేషన్ నూతన అకౌంట్స్ ఆఫీసర్‌గా ఎం.కె. రఘునందన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మిగనూరు ట్రెజరీ కార్యాలయంలో సబ్ ట్రెజరీ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న ఆయన కర్నూలు నగరపాలక సంస్థ అకౌంట్స్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.
KRNL: మున్సిపల్ కార్పొరేషన్ నూతన అకౌంట్స్ ఆఫీసర్‌గా ఎం.కె. రఘునందన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మిగనూరు ట్రెజరీ కార్యాలయంలో సబ్ ట్రెజరీ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న ఆయన కర్నూలు నగరపాలక సంస్థ అకౌంట్స్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.
W.G: విద్యార్థుల పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల నమోదు, గ్రేడ్ నిర్వహణ, అధ్యాపక షెడ్యూలింగ్, విద్య కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి రూపొందించబడిన కేంద్రీకృత, డిజిటల్ ప్లాట్ ఫామ్… అకడమిక్ మేనేజ్మెంట్ సిస్టం అని ఉదయ యూనివర్సిటీ వీసీ డాక్టర్ ధనంజయరావు తెలిపారు. గురువారం తాడేపల్లిగూడెం (M) వెంకటరామన్న గూడెం ఉద్యాన యూనివర్సిటీలో సమావేశం నిర్వహించారు.