• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కీలక ఒప్పందం.. పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ

AP: పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందించేలా కేంద్రంతో ప్రభుత్వం సహకార ఒప్పందం చేసుకుంది. 13,426 పంచాయతీల్లో ప్రాజెక్టు అమలు చేసేలా ప్రణాళికలు చేపట్టనుంది. తొలిదశలో 1,692 పంచాయతీల్లో నెట్‌వర్క్ అప్‌గ్రేడ్, రెండోదశలో 11,254 గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీని పూర్తి చేయనుంది. కొత్తగా ఏర్పడిన 480 పంచాయతీలకు కనెక్టివిటీ ఇచ్చేలా చర్యలు తీసుకోనుంది.

February 22, 2026 / 07:14 PM IST

“మహోత్సవాలకు రావాలని మంత్రికి ఆహ్వానం”

MLG: మంగపేట మండలం లక్ష్మీనర్సాపురం గ్రామంలో వైభవంగా జరిగే శ్రీ నాగులమ్మ జాతర మహోత్సవాలకు రావాలని మంత్రి సీతక్కకు ఆలయ ధర్మకర్త, ప్రధాన అర్చకులు రామకృష్ణ స్వామి ఆదివారం ఆహ్వానపత్రం అందజేశారు. వనదేవతలుగా ప్రసిద్ధి చెందిన నాగులమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ మంత్రికి తెలిపారు. మంత్రి జాతరకు వస్తానని ఆలయ కమిటీకి హామీ ఇచ్చారు.

February 22, 2026 / 07:13 PM IST

రాయచోటిలో MYTDP యాప్ పోస్టర్ ఆవిష్కరణ

అన్నమయ్య: రాయచోటి పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధికార యాప్ MYTDP పోస్టర్‌ను రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి మేనల్లుడు మౌర్యా రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మౌర్యా రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలందరూ MYTDP యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ కావాలని పిలుపునిచ్చారు.పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 22, 2026 / 07:12 PM IST

అధికారుల నిర్లక్ష్యంతో కెనాల్ పనులు నిలిపివేత

WGL: నర్సంపేట (M) నర్సింగాపురం–ఇటుకలపల్లి GP రైతుల ఆధ్వర్యంలో DC–33 ఎల్‌ఎంసీ కెనాల్ కాలువను ఇవాళ రైతులు పరిశీలించారు. ఈ సందర్భంగా TG రైతు కూలి సంఘం (D) కార్యదర్శి పైడి మాట్లాడుతూ.. దేవాదుల ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్యాకేజీలో భాగమైన డీసీ–33 ఎల్‌ఎంసీ కెనాల్ కాల్వ పనులు అధికారుల నిర్లక్ష్యం వలన ఆగిపోయినట్లు పేర్కొన్నారు. అధికారులు స్పందించాలి.

February 22, 2026 / 07:11 PM IST

‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం’

HYD: తార్నాకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావును అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీజేపీ మేడ్చల్ అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ ఖండించారు. ఉప్పల్ నియోజకవర్గం నాచారంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని గృహ నిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

February 22, 2026 / 07:11 PM IST

‘దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’

NGKL: కుమ్మెర గ్రామంలో మహిళపై దాడికి పాల్పడిన దుండగులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు డిమాండ్ చేశారు. స్థానిక నాయకులతో కలిసి కుమ్మెర గ్రామంలో ఆదివారం పర్యటించారు. బాధిత కుటుంబాన్ని కలిసి వివరాలు సేకరించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళ అని కూడా చూడకుండా దుర్మార్గంగా దాడి చేసి గాయపరిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

February 22, 2026 / 07:11 PM IST

CPI సీనియర్ నేత మృతి

KNR: CPI సీనియర్ నాయకుడు, మాజీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు శ్రీరాముల రామచంద్రం ప్రమాదవశాత్తు మృతిచెందడం పార్టీకి తీరని లోటని ఆ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ కార్యదర్శి మర్రి వెంకట స్వామి అన్నారు. ఆదివారం కొండపల్కల గ్రామంలోని రామచంద్రం నివాసానికి చేరుకున్న ఆయన రామచంద్రం మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

February 22, 2026 / 07:10 PM IST

మల్లన్న స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే పూజలు

KMR: గాంధారిలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మల్లన్న స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

February 22, 2026 / 07:10 PM IST

17 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్కూల్ మిత్రులు

MBNR: మిడ్జిల్ మండలం వస్పుల హైస్కూల్ 2001-2002 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 24 ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా గురువులు సుధాకర్, నర్సోజీ, వెంకటయ్యలను ఘనంగా సన్మానించారు. చెన్నకేశవులు, రాజు, నందం తదితర విద్యార్థులు పాల్గొని సందడి చేశారు.

February 22, 2026 / 07:09 PM IST

అష్టలక్ష్మీ దేవాలయంలో రష్యా పర్యాటకులు

విశాఖ అన్నంరాజునగర్‌లోని శ్రీ అష్టలక్ష్మీ దేవాలయాన్ని ఆదివారం రష్యా దేశస్తులు సందర్శించారు. భారతదేశంలోని ప్రముఖ ఆలయాలపై అధ్యయనం చేస్తున్న భాగంగా ఈ దేవాలయాన్ని దర్శించుకున్నట్లు తెలిపారు. ఆలయంలో శివకేశవుల విగ్రహాల నిర్మాణం అద్భుతంగా ఉందని, ముఖ్యంగా వీణ ధరించిన అమ్మవారి రూపం తమను ఆకట్టుకుందని పేర్కొన్నారు.

February 22, 2026 / 07:07 PM IST

రేపు చిత్తూరు కలెక్టరేట్‌లో PGRS

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం ‘PGRS’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉ.10 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆయన ఆదేశించారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

February 22, 2026 / 07:05 PM IST

ఏపీకి రూ.2,432 కోట్లను ఇవ్వనున్న కేంద్రం

AP: గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెంచేలా కేంద్రంతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో ఏబీపీ అమలుకు రూ.2,432 కోట్ల విడుదలకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఏబీపీ కోసం ఏపీబీఐఎల్ పేరుతో ఎస్‌పీవీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిజిటల్ భారత్ నిధి-ఏపీ అంగీకారంతో నిధులిచ్చి ప్రాజెక్టు అమలు చేసేలా చర్యలు చేపట్టనుంది.

February 22, 2026 / 07:04 PM IST

ఎమ్మిగనూరు ఎమ్మెల్యేను కలిసిన బార్ సంఘం

KRNL: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డిని బార్ అసోసియేషన్ అధ్యక్షులు రషిదుల్లా బృందం మర్యాదపూర్వకంగా ఇవాళ కలిశారు. అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ గా ఎన్నికైన సందర్భంగా రషీదుల్లా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా సబ్ కోర్టు భవన నిర్మాణానికి నిధుల అనుమతి,గోనెగండ్లను ఎమ్మిగనూరు కోర్టు పరిధిలోకి తీసుకురావాలని కోరారు.

February 22, 2026 / 07:04 PM IST

వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే సునీత

ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె స్వయంగా అర్జీలు స్వీకరించారు. సాగునీరు, మౌలిక వసతులు, ఇతర వ్యక్తిగత సమస్యలపై విన్నపాలు అందాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా న్యాయం జరిగేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు.

February 22, 2026 / 07:00 PM IST

క్రీడలతోనే ఆరోగ్య భారత్ సాధ్యం: మంత్రి

కోనసీమ: క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్య భారత్ సాకారమవుతుందని, కరాటే నేర్చుకోవడం ద్వారా ఆరోగ్యంతో పాటు, ఆత్మ రక్షణ కూడా సాధ్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురం RCM చర్చ్‌లో ఆదివారం జరిగిన ఫస్ట్ ఇంటర్ స్టేట్ ఇన్విటేషనల్ కరాటే ఛాంపియన్షిప్ -2026 పోటీలను మంత్రి ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు రక్షణ కోసం కరాటే నేర్చుకోవాలన్నారు.

February 22, 2026 / 07:00 PM IST