• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ప్రతి యువకుడు రక్తదానానికి ముందుకు రావాలి’

SKLM: ఆమదాలవలసలోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో శనివారం NSS ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సాంకేతిక విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.ఏ.వి. రామకృష్ణ ఈ శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం మహాదానం అని, ప్రతి యువకుడు సమాజానికి అవసరమైనప్పుడు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన అన్నారు.

February 21, 2026 / 02:01 PM IST

అంబేడ్కర్ సర్కిల్లో స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర

KRNL: ఆలూరు అంబేడ్కర్ సర్కిల్లో శనివారం స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జరిగింది. టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి పాల్గొని పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. స్వచ్ఛమైన గ్రామాలు, పట్టణాలే ఆరోగ్యకర సమాజానికి పునాది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పారిశుధ్య కార్మికులు, ప్రజలు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు.

February 21, 2026 / 02:01 PM IST

పరిశుభ్రతే ప్రగతికి సోపానం: ఏఆర్ అదనపు ఎస్పీ

KDP: శనివారం కడప పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య మాట్లాడుతూ.. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమే ఆరోగ్యకర సమాజానికి పునాది అని నొక్కి చెప్పారు. అనంతరం పోలీసు సిబ్బందితో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎ, ఆర్ఎస్ఐ, ఇతర ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

February 21, 2026 / 02:01 PM IST

ఎల్లారమ్మ జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు: DM

VZM: జామి ఎల్లారమ్మ తీర్ధ యాత్రి నేపథ్యంలో ఈనెల 24 నుంచి 8 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఎస్‌.కోట RTC DM కే.సుదర్శనరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈ బస్సులను సాధారణ పల్లె వెలుగు ఛార్జీలతో నడపనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సులను కొత్తవలస-జామి, జామి-కొత్తవలసకు ఉదయం 5:30 గంటలు నుంచి నడపనున్నట్లు పేర్కొన్నారు.

February 21, 2026 / 02:00 PM IST

ఒకరోజు ముందుగానే శ్రీవిష్ణు సందడి

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో దర్శకుడు యదునాథ్ మారుతీరావు తెరకెక్కించిన మూవీ ‘విష్ణు విన్యాసం’. ఫిబ్రవరి 28న రిలీజ్ కానున్న ఈ సినిమా ఒకరోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. FEB 27న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇక నయన్ సారిక కథానాయికగా నటించిన ఈ మూవీకి రధన్ మ్యూజిక్ అందించాడు.

February 21, 2026 / 01:58 PM IST

రవితేజ ‘BMW OTT రిలీజ్.. ఆలస్యానికి కారణమిదే..!

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సంక్రాంతి కానుకగా రిలీజై పర్వాలేదనిపించింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా OTTలోకి రాకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ ఆలస్యానికి కారణం ఇతర భాషల డబ్బింగ్ పనులేనని సమాచారం. OTT సంస్థ జీ5 ఈ సినిమాను తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయాలని భావిస్తుందట.

February 21, 2026 / 01:56 PM IST

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

BDK: మణుగూరు శివలింగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ సందర్శించారు. ఆశా వర్కర్లతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే వారి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు.

February 21, 2026 / 01:54 PM IST

దివ్యాంగులకు వాహనాలు పంపిణీ చేసిన సీఎం

AP: సీఎం చంద్రబాబు ప్రజావేదిక వద్ద దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను అందజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లను ఆయన స్వయంగా పరిశీలించి, లబ్ధిదారులతో ముచ్చటించారు. దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

February 21, 2026 / 01:53 PM IST

‘దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి’

వనపర్తి: దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శనివారం వనపర్తి పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వయం ఉపాధి, విద్య, ఉపాధి అవకాశాల కోసం రవాణా సౌకర్యం చాలా అవసరమని తెలిపారు.

February 21, 2026 / 01:52 PM IST

రాజకీయ విబేధాలతో దేశాన్ని కించపరచకూడదు: జగన్

ఢిల్లీ AI సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నేతల తీరును YCP చీఫ్ జగన్ తప్పుబట్టారు.వారి ప్రవర్తన అందరూ తలవంచుకునేలా ఉందని విమర్శించారు. దేశ రాజకీయాలు ఎటు వెళ్తున్నాయో అర్థం కావట్లేదని, ఎన్ని రాజకీయ విబేధాలు ఉన్నా.. ప్రపంచం ముందు అందరూ ఒక్కటిగా ఉండాలని సూచించారు. కాగా నిన్న యూత్ కాంగ్రెస్ నేతలు AI సమ్మిట్‌లో అర్ధనగ్నంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

February 21, 2026 / 01:50 PM IST

నేర సమీక్ష సమావేశం నిర్వహించిన సీఐ

ప్రకాశం: వై.పాలెం సర్కిల్ కార్యాలయంలో సీఐ ఆధ్వర్యంలో శనివారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ప్రగతిని గురించి సీఐ సమీక్షించారు. ముఖ్యంగా సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఎస్సైలు పాల్గొన్నారు.

February 21, 2026 / 01:49 PM IST

కేంద్ర-రాష్ట్రాల సమన్వయ కమిటీ మీటింగ్

TG: HYD ఐటీసీ కాకతీయ హోటల్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ లెవెల్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి శివరాజ్ చౌహన్, రాష్ట్ర మంత్రి సీతక్క హాజరయ్యారు. గ్రామీణాభివృద్ధి పథకాల అమలు, కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయంపై ఈ సదస్సులో కీలక చర్చలు జరిపారు. గ్రామీణ ప్రగతికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు సమాలోచనలు చేశారు.

February 21, 2026 / 01:48 PM IST

‘క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీయడమే సీఎం కప్ ఉద్దేశం’

వనపర్తి: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీయడమే సీఎం కప్ క్రీడల ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శనివారం వనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సీఎం కప్‌ను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

February 21, 2026 / 01:48 PM IST

‘సంఘ కార్యకలాపాలకు సహకరించాలి’

MDK: మున్సిపల్ ఛైర్పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్, వైస్ ఛైర్మన్ దొంతి నరేశ్ గౌడ్లను శనివారం పీఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అధ్యక్షుడు మేడి సతీశ్ రావు నేతృత్వంలో వారిని ఘనంగా సన్మానించి, సంఘం కార్యకలాపాలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు సబ్బాని శ్రీనివాస్, సత్యనారాయణ రెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు

February 21, 2026 / 01:46 PM IST

హిందువులు మనోభావాలను దెబ్బతీయటమే వైసిపి లక్ష్యం

PPM: రాష్ట్రంలో హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఆక్షేపించారు. పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులతో కలసి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకుల వైఖరి పై నిప్పులు చెరిగారు. శుక్రవారం మండలిలో ఆ పార్టీ ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరును రాష్ట్ర ప్రజలందరూ చీత్కరిస్తున్నారని అన్నారు.

February 21, 2026 / 01:42 PM IST