PDPL: రామగుండం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శిక్షకులుగా పనిచేయడానికి అర్హత గలవారు మార్చి 3లోగా అప్లై చేసుకోవాలని ప్రిన్సిపల్ సురేందర్ తెలిపారు. సీఎస్‌సి ఆపరేటర్, ఎలక్ట్రికల్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్, త్రీడీ ప్రింటింగ్ ఆపరేటర్, జూనియర్ ప్లంబర్ కోర్సులలో 3 నెలలు నైపుణ్య శిక్షణ ఇచ్చుటకు అర్హులైన అభ్యర్థులు పూర్తి బయోడేటాతో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
MDK: జిల్లాలో ‘స్టాలిన్’ మూవీ సీన్ రిపీట్ అయింది. చేతివేళ్లు విరిగినప్పటికీ ఓ విద్యార్థిని ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు హాజరైంది. రామాయంపేట జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న హర్షితకు ఇటీవల ప్రమాదంలో చేతి వేళ్లు విరగడంతో సర్జరీ జరిగింది. పరీక్ష రాసే వీలు లేకపోవడంతో, అధికారుల అనుమతి తీసుకొని మరో విద్యార్థి సహాయంతో బుధవారం పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది.
NZB: ఇందల్వాయి మండలం గన్నారంలో 9 నెలల నిండు గర్భిణిని కట్టుకున్న భర్తే గొంతు నులిమి హత్య చేశాడు. డిచ్‌పల్లి సీఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. గన్నారం గ్రామానికి చెందిన నాగేశ్ పది సంవత్సరాల క్రితం సుమలత(31)ను పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అనుమానంతో తరచూ నాగేశ్ భార్యతో గొడవ పడేవాడు. ఈ నెల 22న అర్ధరాత్రి భార్యను హత్య చేశాడు.
HYD: గచ్చిబౌలిలోని మనూలో బీఏ, బీఈడీ, బీఎస్సీ బీఈడీ, బీకామ్ బీఈడీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్( NCET)లో వచ్చిన స్కోర్ల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తామని మనూ అడ్మిషన్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ వనజ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు మార్చి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.
SDPT: విద్యార్థులకు అందించే భోజనం నాణ్యంగా ఉండాలని, రాజి పడొద్దని, కాలం చెల్లిన వస్తువులు వాడద్దని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట రూరల్ మండలం కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని మధ్యాహ్నం భోజన సమయంలో సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ వెరిఫై చేసి పొంతన లేకుండా ఉండటంతో ఎసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలన్నారు.
ATP: రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య ‘చీకటి ఒప్పందం’ కుదిరిందని మాజీ ఎంపీ తలారి రంగయ్య విమర్శించారు. బుధవారం నంద్యాల వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సీమ ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నా చంద్రబాబు మౌనంగా ఉండటం దారుణమని మండిపడ్డారు.
KMR: బాన్సువాడలో ఇటీవల చోటుచేసుకున్న సామాజిక ఉద్రిక్తతలకు సంబంధించి నమోదైన కేసులను పునఃసమీక్షించాలని AIMIM జిల్లా కార్యదర్శి సయ్యద్ ఖాన్ కోరారు. SP రాజేష్ చంద్రను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ ఘటనలో అనేక మంది నిరపరాధులు, మైనర్లు కేసుల్లో ఇరుక్నుని అరెస్టు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారిని విడుదల చేయాలన్నారు.
KMM: Dy.CM భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి సీపీపీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 5న హైదరాబాద్‌లో జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి విచ్చేసి ఆశీర్వదించాలని కోరుతూ వివాహ పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.
WNP: ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు 8 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సైదులు తెలిపారు. మండలంలో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 304 మందికి గాను 296 మంది పరీక్షలకు హాజరయ్యారు.
KRNL: జిల్లాలో పక్కా గృహాల లబ్దిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ఫోన్ ఇన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా హౌసింగ్ పీడీ టి. చిరంజీవి తెలిపారు. ఇనుము, సిమెంటు, ఇతర నిర్మాణ సామగ్రి రాకపోయినా, ఇల్లు నిర్మించుకుని బిల్లులు పెండింగ్ ఉన్నా, PMAY 2.0 అర్బన్ గృహాలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా లబ్ధిదారులు 08518- 257481 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
NDL: డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి దంపతులు మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలో తనను కలిసిన ఎమ్మెల్యే కోట్లను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోట్ల సుజాతమ్మకు మంగళగిరి చేనేత చీరను లోకేష్ అందజేశారు.
W.G: ఆకివీడులోని టపాసుల విక్రయశాలలను భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఉండిలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. దుకాణాల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనల మేరకు జాగ్రత్తలు పాటించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో మార్చి 6వ తేదీన పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాల భాగంగా రెండవ రోజు పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. 1వ తేదీ ఆదివారం సాయంత్రం కామదహహనం, ఉంటుందన్నారు.
అనకాపల్లి పట్టణం తాకాశి వారి వీధిలో వేంచేసియున్న నూకంబిక అమ్మవారి ఆలయంలో కొత్త అమావాస్య జాతరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ రాజేష్ తెలిపారు. మార్చి నెలలో జరిగే జాతరకు సంబంధించి బుధవారం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మూహుర్తపు రాట వేసారు. ప్రతి ఏటా అమ్మవారి జాతరను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.