• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఏడుపాయల అమ్మవారి దివ్య దర్శనం

MDK: ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయలవలదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

February 23, 2026 / 07:01 AM IST

నేడు తోటపల్లి గూడూరులో పర్యటించనున్న ఎంపీ

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోమవారం తోటపల్లి గూడూరు మండలంలో పర్యటించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు మండలంలోని ఇసుక పాలెంలో శాంత బయోటెక్నిక్స్ ఆధ్వర్యంలో శాంత – వసంత ట్రస్టు, శంకర నేత్రాలయ సహకారంతో నిర్వహిస్తున్న మెగా కంటి వైద్య శిబిరం కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

February 23, 2026 / 07:01 AM IST

నిజాయితీ చాటుకున్న బస్ కండక్టర్

ADB: ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మహారాష్ట్రలోని పాండ్రకవడ నుంచి ఆదిలాబాద్ తిరిగి వస్తున్న క్రమంలో బస్సులో ప్రయాణించిన ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోన్ బస్సులోనే మర్చిపోయాడు. బస్సులో కండక్టర్‌గా విధుల నిర్వర్తించిన సి. సతీశ్ ఆ సెల్ ఫోన్‌ను స్టేషన్ మేనేజర్ శ్రీరాములు సమక్షంలో సదరు ప్రయాణికుడికి అప్పగించి ఉదరాత చాటుకున్నారు. అతన్ని పలువురు అభినందించారు.

February 23, 2026 / 07:01 AM IST

ప్రశాంతి నిలయంలో చైనీస్ నూతన సంవత్సర వేడుకలు

సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో చైనీస్ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. చైనీస్ సంప్రదాయం ఉట్టిపడేలా విద్యుత్తు లాంతర్లు, దీపాలతో మందిరాన్ని అందంగా అలంకరించారు. వివిధ దేశాల నుంచి భక్తులు తరలివచ్చారు.

February 23, 2026 / 07:00 AM IST

నాగాయలంకలో అవగాహన కార్యక్రమం

కృష్ణా: నాగాయలంకలోని బీసీ గర్ల్స్ హాస్టల్‌లో శక్తి టీం-4 ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినులకు మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, గుడ్ టచ్-బ్యాడ్ టచ్ అంశాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112, 181 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు.

February 23, 2026 / 07:00 AM IST

అమ్మవారికి రూ. 30 లక్షల విలువ గల వెండి బహూకరణ

కోనసీమ: అమలాపురం మండలం పాలగుమ్మి గ్రామదేవత తోటలమ్మ అమ్మవారికి 6 కేజీల వెండితో తొడుగు, మకరతోరణం, 111 కేజీల పంచలోహాలతో మరో మకరతోరణం ఆదివారం బహూకరించారు. పాలగుమ్మి చెందిన బొక్కా సత్యనారాయణ, రవికుమార్ కుటుంబ సభ్యులు అమ్మవారికి మకర తోరణాలు చేయించారు. రూ.30 లక్షల ఖర్చుతో వెండి వస్తువులను తయారు చేయించి అమ్మవారికి అలంకరించారు.

February 23, 2026 / 07:00 AM IST

నేడు ఎచ్చెర్లలో మెగా జాబ్ మేళా

SKLM: ఎచ్చెర్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఇవాళ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాధికారి యూ. సాయికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 13 ప్రముఖ ప్రైవేట్ సంస్థలు పాల్గొని సుమారు 400 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. 18–30 ఏళ్లు మధ్య వయస్సు గల నిరుద్యోగ యువతీ యువకులు అర్హులు అని ఆయన పేర్కొన్నారు.

February 23, 2026 / 07:00 AM IST

కల్లూరు సమీపంలో రైలులో గొలుసు చోరీ

ATP: గార్లదిన్నె మండలంలోని కల్లూరు రైల్వేస్టేషన్ సమీపంలో ఆదివారం చైన్ స్నాచింగ్ జరిగింది. ధర్మవరానికి చెందిన శారద తన బంధువులతో కలిసి యాదగిరి వెళ్తుండగా బీదర్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు వేగం తగ్గడంతో గుర్తుతెలియని దొంగ.. ఆమె మెడలోని మూడు తులాల మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడు. బాధితురాలు రైలు చైన్ లాగి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

February 23, 2026 / 06:50 AM IST

నేడు కొవ్వొత్తుల ర్యాలీకి తీన్మార్ మల్లన్న పిలుపు

NGKL: కుమ్మర మల్లన్న జాతరలో కాంగ్రెస్ నాయకుల దాడిలో బీసీ చిన్నారి మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను నిరసిస్తూ, సోమవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని TRP చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. ప్రభుత్వ అరాచకాలను, పోలీసుల పక్షపాత వైఖరిని నిరసిస్తూ గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో ఈ ర్యాలీలు చేపట్టాలని ఆయన కోరారు.

February 23, 2026 / 06:50 AM IST

సూర్యాపేట జిల్లాలో నేటి నుంచి అర్తెవ్ అల్తెవ్ కార్యక్రమం

SRPT: ప్రజల ప్రాణ పత్రిక లక్ష్యంగా నేటి నుంచి వారం రోజులపాటు సూర్యాపేట జిల్లాలో రెండో దశ ‌అర్తెవ్ అల్తెవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నిర్మూలించడం, వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై చైతన్యం కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఎస్పీ పేర్కొన్నారు.

February 23, 2026 / 06:50 AM IST

MPTC, ZPTC ఎన్నికలు.. ఎప్పుడంటే?

TG: ఇంటర్, టెన్త్ పరీక్షల తర్వాతే MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ DCCలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. తర్వాత మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, అనంతరం ఇంటర్, టెన్త్ పరీక్షలు ఉన్నాయి. దీంతో అధికారులు ఆయా పనుల్లో ఉండనున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకొని పరీక్షల తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

February 23, 2026 / 06:50 AM IST

నేడు ఎల్లారెడ్డికి ఎమ్మెల్యే మదన్మోహన్ రాక

KMR: గాంధారి మండల కేంద్రంలో 287 సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా సోమవారం పాల్గొన్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వర్గాలు తెలిపారు. ఈ జయంతి వేడుకలకు ఉదయం 11 గంటలకు MLA హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం లక్ష్మాపూర్ గ్రామంలో మహిళ సంఘ భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

February 23, 2026 / 06:48 AM IST

అమలాపురంలో బీజేపీ నేతల నిరసన

కోనసీమ: కాంగ్రెస్ నేతలు దేశ ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. అమలాపురం పట్టణం గడియార స్తంభం సెంటర్లో ఆదివారం సాయంత్రం బీజేపీ యువమోర్చా అధ్యక్షులు గానాల కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చొరబడి సృష్టించిన అల్లర్లను ఖండిస్తూ నిరసన చేపట్టామన్నారు.

February 23, 2026 / 06:45 AM IST

IDFC ఫస్ట్ బ్యాంకులో భారీ స్కామ్!

చండీగఢ్‌లోని IDFC ఫస్ట్ బ్యాంక్ బ్రాంచ్‌లో రూ.590 కోట్ల భారీ మోసం జరిగింది. హర్యానా ప్రభుత్వ విభాగాలకు చెందిన ఖాతాలో ఈ గోల్‌మాల్ చోటుచేసుకుంది. ఒక శాఖ తన ఖాతా క్లోజ్ చేయాలని కోరగా బ్యాలెన్స్‌లో తేడాలు రావడంతో విషయం బయటపడింది. దీంతో హర్యానా ప్రభుత్వం ఆ బ్యాంకును బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. ఇది కేవలం ప్రభుత్వ ఖాతాలకు మాత్రమే పరిమితమని సమాచారం.

February 23, 2026 / 06:43 AM IST

కళాశాల ఆస్తుల వివాదం.. ఎమ్మెల్యే రాజీనామాస్త్రం

KMR: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత పదేళ్లుగా ఈ అంశం రాజకీయ ఆరోపణలకు అస్త్రంగా మారుతూనే ఉంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ అంశం మరింత జఠిలంగా మారడంతో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆరోపణల వరకు వెళ్లింది. తాజాగా ఈ ఆరోపణలు నిరూపిస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని ఎమ్మెల్యే ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

February 23, 2026 / 06:40 AM IST