• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరిస్తుంది’

ప్రకాశం: భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడానికి ఎవరికీ హక్కు లేదని, ప్రజల భావోద్వేగాలతో రాజకీయ లాభం పొందాలని ప్రయత్నించడం తగదని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఆదివారం ఒంగోలు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం సిగ్గుచేటని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

February 22, 2026 / 05:34 PM IST

పెళ్లి ఫిక్స్ అయింది.. కానీ అనుమానం!

TG: జోగులాంబ గద్వాల జిల్లా చింతలకుంటలో విషాదం చోటు చేసుకుంది. కాబోయే వరుడి వేధింపులు తాళలేక స్నేహ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. కొంతకాలంగా యువతి క్యారెక్టర్‌పై కాబోయే వరుడు తరుచూ ఫోన్‌లో వేధించేవాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడు హరికృష్ణను అదుపులోకి తీసుకున్నారు.

February 22, 2026 / 05:33 PM IST

అప్పుల‌కు లెక్కలు చెప్పే దమ్ముందా..?

VSP: కూటమి ప్రభుత్వం 20 నెలల్లో చేసిన రూ.3.28 లక్షల కోట్ల అప్పులకు లెక్కలు చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు సవాల్ చేశారు. ఆదివారం విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆదాయ వృద్ధి కేవలం 1.97% ఉండగా 11.09% జీఎస్డీపీ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. వైసీపీ ఐదేళ్లలో చేసిన అప్పు రూ.3.39 లక్షల కోట్లు మాత్రమేనని గుర్తుచేశారు.

February 22, 2026 / 05:33 PM IST

ప్రశాంతంగా ముగిసిన ప్రవేశ పరీక్ష

KMM: ఉమ్మడి ఖమ్మంలో గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఆరో తరగతి బ్యాక్లాగ్ పోస్టుల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ప్రిన్సిపల్ కనకదుర్గ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 480 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 453 మంది పరీక్షకు హాజరైనట్లు మొత్తంగా 94.3 శాతం హాజరు నమోదైనట్లు ఆమె వివరించారు.

February 22, 2026 / 05:33 PM IST

‘గ్రామీణ డాక్ సేవక్‌లకు శిరసు వంచి ప్రణామం చేస్తున్నా’

AP: గ్రామీణ డాక్ సేవక్‌లకు మౌలిక వసతులు కల్పించాలని కోరానని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. గ్రామీణ డాక్ సేవక్‌ల పిల్లలకు కేంద్రీయ విద్యాలయాల్లో సీట్లు వచ్చేలా చూశానని చెప్పారు. గ్రామీణ డాక్ సేవక్‌లకు శిరసు వంచి ప్రణామం చేస్తున్నానని పేర్కొన్నారు. తపాలాశాఖలో పార్సిల్ వ్యవస్థ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

February 22, 2026 / 05:33 PM IST

సంగంబండ కాలువపై వంతెన కోరుతూ ఆందోళన

NRPT: మక్తల్ మండలం మంథన్‌గోడ్ సంగంబండ కాలువపై వంతెన లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలో నీరు పారుతున్న సమయంలో పొలాలకు వెళ్లేందుకు కిలోమీటరు దూరం చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. రవాణా, వ్యవసాయ పనులు అంతరాయం కలుగుతున్నాయని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి కాలువపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

February 22, 2026 / 05:32 PM IST

చంద్రగిరిలో పశువుల పండుగ సంబరాలు

TPT: చంద్రగిరి పట్నంలో పశువుల పండుగ సంబరాలకు ఎమ్మెల్యే తనయుడు పులివర్తి వినిల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం మిట్టమీద గంగమ్మ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొని పశువుల పండుగను తిలకించారు. ఈ సందర్భంగా పండుగను వీక్షించడానికి తరలివచ్చిన ప్రజలకు త్రాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. ప్రజలను, కార్యకర్తలను అభిమానంగా పలకరించారు.

February 22, 2026 / 05:32 PM IST

‘కులాల మధ్య చిచ్చు పెడితే సహించేది లేదు’

WNP: రాజకీయ స్వార్థం కోసం కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకోబోమని బీసీ పొలిటికల్ జేఏసీ పట్టణ అధ్యక్షుడు శివ హెచ్చరించారు. చీర్ల చందర్ ని అవమానించేలా మాట్లాడటంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.ఆధారాలు లేకుండా బురదజల్లడం మానుకోవాలని, బీసీల ఐక్యతకు భంగం కలిగిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా బీసీ నాయకులు పలువురు నిరసన వ్యక్తం చేశారు.

February 22, 2026 / 05:32 PM IST

రేపు కామారెడ్డి జిల్లాలో ప్రజావాణి కార్యక్రమం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10:30 నుంచి 1:00 వరకు నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజావాణి కి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రజావాణి ప్రజలు సద్వినియోగం పట్టుకోవాలని కోరారు.

February 22, 2026 / 05:31 PM IST

నిబంధనలకు విరుద్ధంగా చెట్ల నరికివేత

NLG: పెద్దవూర మండలం కోమటికుంట తండాలో ప్రభుత్వ భూమిలోని విలువైన చెట్లను అక్రమార్కులు యథేచ్ఛగా నరికివేస్తున్నారు. వాటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వాల్టా చట్టం నిబంధనలు తుంగలో తొక్కిన వీరిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల ప్రమేయంతోనే చెట్లు నరుకుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

February 22, 2026 / 05:31 PM IST

కేంద్ర మంత్రికి స్వాగతం పలికిన కలెక్టర్

KRNL: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దేవాలయం దర్శనం నిమిత్తం కర్నూలుకు విచ్చేసిన కేంద్ర భారీ పరిశ్రమల, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి కర్నూలు ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఆయనకు ఘనంగా స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అధికారులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 05:30 PM IST

చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్ఫూర్తితో ముందుకు: వరుణ్

ATP: శ్రీవారి చిత్రపటాన్ని రాజకీయ స్వార్థానికి వాడుతూ భక్తుల మనోభావాలతో ఆడుకోవడం వైసీపీ పతనానికి నాంది అని కూటమి నేతలు మండిపడ్డారు. జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్, ఇతర నేతలు మీడియా సమావేశంలో జగన్ తీరును తూర్పారబట్టారు. విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలను చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్ఫూర్తితో తిప్పికొడతామని హెచ్చరించారు.

February 22, 2026 / 05:30 PM IST

గూడూరు: గుప్తనిధుల కోసం తవ్వకాలు.!

MHBD: గూడూరు మండలంలోని రాళ్లవాగు బ్రిడ్జి సమీపంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు స్థానికులు గుర్తించారు. ఆదివారం తెల్లవారుజామున స్థానికులు అటువైపు వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. JCB సహాయంతో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేసి ఉన్న ప్రదేశం కనిపించడంతో వారు అవాక్కయ్యారు.

February 22, 2026 / 05:30 PM IST

వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి: MLA

ADB: తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమంలో బోథ్ MLA అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు ప్రసాదాలు స్వీకరించారు. ఆలయాభివృద్ధికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

February 22, 2026 / 05:30 PM IST

క్లీన్ సిటీ మనందరి బాధ్యత: ఛైర్‌పర్సన్

SRPT: ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని 29వ వార్డులో స్వచ్ఛ సర్వేక్షన్, సంత్ నిరంకారి మిషన్ వారు చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. పర్యావరణ, ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా ఇళ్లలోనే వేరుచేసి అందజేయాలన్నారు. 

February 22, 2026 / 05:30 PM IST