• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఘనంగా శ్రీ పెద్దమ్మ తల్లి దేవర పండుగా..!

KDP: జమ్మలమడుగుల శ్రీ పెద్దమ్మ తల్లి దేవర 17 ఏళ్ల తర్వాత మళ్లీ ఆదివారం వైభవంగా నిర్వహించారు. 1050 కలశాలతో ముద్దనూరు రోడ్డులోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం నుంచి ప్రారంభమైంది. ఈ దేవరను వీక్షించడానికి జమ్మలమడుగు చుట్టుపక్కల ప్రజలు ఉదయాన్నే భారీగా తరలివచ్చారు. పోలీసులు ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

February 22, 2026 / 02:18 PM IST

మల్లిపూడిలో అభివృద్ధి పనులకు శ్రీకారం..!

 W.G: పెనుమంట్ర మండలం మల్లిపూడిలో రూ.47.50 లక్షలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులను MLA పితాని సత్యనారాయణ ఆదివారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని ఆయన తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతోనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 02:18 PM IST

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి

పార్వతీపురం పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని నిర్వహించారు. డీఎస్పీ థామస్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి, భారతీయులకు అండగా నిలిచిన మహనీయుడిగా ఆయనను స్మరించారు.

February 22, 2026 / 02:17 PM IST

‘మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ముందుంటుంది’

PLD: మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మద్దినగర్‌లో రూ. 30 లక్షలతో నిర్మించనున్న ముస్లిం కమ్యూనిటీ హాల్‌కు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మైనారిటీల ప్రయోజనాల కోసం ఈ భవన నిర్మాణాన్ని చేపట్టామన్నారు. గత పాలకులు ముస్లింలకు ఏమీ చేయలేదని అన్నారు.

February 22, 2026 / 02:17 PM IST

జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

VZM: రేపటి నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్న జామి శ్రీ ఎల్లారమ్మ తల్లి అమ్మవారి జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్ల వద్ద పక్కా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

February 22, 2026 / 02:17 PM IST

‘తిరుమల పవిత్రతపై రాజకీయం ఆపాలి’

SKLM: పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల పవిత్రతను వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసే విధంగా రాజకీయాలు చేయడం అనర్థకమని అన్నారు. తిరుమలలో జరిగిన ఘటనలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ విశ్వాసాలు ,సంప్రదాయాలు వైసీపీ ప్రభుత్వంలో దెబ్బతిన్నాయని ఆరోపించారు.

February 22, 2026 / 02:17 PM IST

‘రైతు సంఘర్షణ సమావేశం విజయవంతం చేయండి’

GWDL: నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు ధరూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయానికి గురి చేసిందన్నారు. అలాగే జిల్లాలో రైతుల సమస్య పరిష్కారానికై ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సమావేశంను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశానికి మహిళలు, రైతులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

February 22, 2026 / 02:17 PM IST

కరెంట్ షార్ట్ సర్క్యూట్‌తో పెంకుటిల్లు దగ్ధం

MHBD: గూడూరు మండలం గండసోములుతండాలో ఆదివారం కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. స్థానికుడు బోడ ధన్యకు చెందిన పెంకుటిల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమై బూడిదైపోయింది. ఈ ఘటనలో సుమారు రూ. 2 లక్షల విలువైన ఆస్తి నష్టపోయింది. ప్రభుత్వం బాధితుల ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

February 22, 2026 / 02:17 PM IST

భోజనం తర్వాత సోంపు తింటున్నారా?

ప్రతిరోజూ భోజనం తర్వాత కొద్దిగా సోంపు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. సోంపులో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. సోంపు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు నోటి దుర్వాసనను పోగొడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఔషధం.

February 22, 2026 / 02:16 PM IST

విస్తృతంగా వాహనాలు తనిఖీ

AKP: ఎస్.రాయవరం మండలం జేవీపాలెం వద్ద ఆదివారం పోలీసులు విస్తృతంగా వాహనాలు తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. రహదారి నిబంధనలు పాటించని వారికి అపరాధ రుసుం విధించారు. ప్రమాదాల జరగకుండా చూసేందుకు వాహనాల తనిఖీలు చేపడుతున్నామని ఎస్సై విభీషణరావు తెలిపారు. పరిమిత వేగంతో వాహనాలు నడపాలన్నారు. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించాలని సూచించారు.

February 22, 2026 / 02:15 PM IST

‘రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

ATP: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయాలని, పాత దరఖాస్తుదారులు రసీదులు తీసుకురావాలని సూచించారు. పరిష్కారం కాని ఫిర్యాదుల కోసం 1100 కాల్ సెంటర్ లేదా ఆన్‌లైన్ వెబ్‌సైట్ సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

February 22, 2026 / 02:15 PM IST

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ATP: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయాలని, పాత దరఖాస్తుదారులు రసీదులు తీసుకురావాలని సూచించారు. పరిష్కారం కాని ఫిర్యాదుల కోసం 1100 కాల్ సెంటర్ లేదా ఆన్‌లైన్ వెబ్‌సైట్ సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

February 22, 2026 / 02:15 PM IST

కోడిపందాల స్థావరంపై దాడి… ఏడుగురు అరెస్ట్

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామ శివారులో కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీస్ సిబ్బందితో కలిసి కోడిపందాల స్థావరంపై ఎస్సై సత్యనారాయణ ఈరోజు దాడి చేశారు. కోడి పందాలు నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 3,150 నగదు, 6 సెల్ ఫోన్లు, ఒక కోడిపుంజు, 5 కోడి కత్తులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

February 22, 2026 / 02:15 PM IST

బస్సాపూర్లో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ

NZB: బస్సాపూర్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్ఆర్ఆజీఎస్ కింద మంజూరు చేసిన రూ.10 లక్షల నిధులతో ఈ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, ఉపసర్పంచ్ వంశీ పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి నిధులు వెచ్చించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

February 22, 2026 / 02:14 PM IST

మహేశ్వరంలో పర్యటించిన కేఎల్ఆర్

RR: మహేశ్వరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో నియోజకవర్గ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న లక్ష్మారెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమీర్పేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ పర్యటనలో సర్పంచ్‌లు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 22, 2026 / 02:14 PM IST