• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘బ్యాండ్ మేళం’ సెకండ్ సింగిల్ డేట్ ఫిక్స్

‘కోర్ట్’ సినిమా జోడీ రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ ‘బ్యాండ్ మేళం’. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాగా.. తాజాగా సెకండ్ సింగిల్ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 28న మాస్ మహారాజా రవితేజ ఈ పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక దర్శకుడు సతీష్ జివ్వాజి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ 2026 మార్చి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

February 26, 2026 / 02:56 PM IST

‘నీటి పిల్లుల సంరక్షణ అందరూ సహకరించాలి’

కాకినాడ: కోరంగి అభయారణ్యంలో పర్యావరణ పరిరక్షణకు కీలకమైన నీటి పిల్లులను కాపాడుకోవాలని ఫారెస్ట్ రేంజర్ ఎస్.ఎస్.ఆర్. వరప్రసాద్ కోరారు. వీటిని వేటాడితే వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వీటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ అరుదైన జీవుల సంతతిని పెంచేందుకు ప్రజలందరూ సహకరించాలన్నారు.

February 26, 2026 / 02:55 PM IST

లైబ్రరీ ఏర్పాటు స్థలం పరిశీలన

NGKL: కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేయనున్న లైబ్రరీ భవన నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ షానవాజ్ ఖాన్ తదితరులు గురువారం పరిశీలించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చొరవ వల్ల లైబ్రరీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు అయినట్లు వారు తెలిపారు.

February 26, 2026 / 02:55 PM IST

పసుపు రైతుల ఆగ్రహం.. ఆందోళన

TG: నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు రైతులు కన్నెర్ర చేశారు. గత కొన్ని రోజులుగా పసుపుకు మద్దతు ధర లేకపోవడం.. ఈనామ్‌ సర్వర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ పనిచేయకపోవడంతో అధికారులు లాట్ నంబర్ కేటాయిండం లేదు. దీంతో నిజామాబాద్ మార్కెట్‍లో పసుపు కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలో మార్కెట్‍లోని కార్యాలయం ఆద్దాలను ధ్వంసం చేసి మరీ నిరసన తెలిపారు.

February 26, 2026 / 02:54 PM IST

విగ్రహ ప్రతిష్ట మహోత్సవం లో శ్రీలంక న్యాయమూర్తి

BDK: పాల్వంచ మండలం, గుడిపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీదేవి, గోదాదేవి సమేత శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టా మహోత్సవం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీలంక దేశానికి సుప్రీమ్ న్యాయమూర్తి ఎస్ తురాయి రాజా పాల్గొన్నారు. వారికి సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ గణేష్ ఆహ్వానం పలికారు.

February 26, 2026 / 02:53 PM IST

అధిక లోడ్‌తో ఇటుక ట్రాక్టర్లు.. స్థానికులు ఆగ్రహం

NTR: విజయవాడలోని లోటస్ ల్యాండ్‌మార్క్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ఇటుక ట్రాక్టర్లు పట్టపగలే అధిక లోడుతో రాకపోకలు సాగిస్తున్నాయి. నగర పరిధిలో ఉదయం వేళ ట్రాక్టర్లకు అనుమతి లేకపోయినా, యథేచ్ఛగా నడుస్తుండటంపై స్థానికులు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిక లోడు కారణంగా ఇటుకలు రోడ్డుపై జారిపడి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని భయాందోళన చెందుతున్నారు.

February 26, 2026 / 02:53 PM IST

‘సీతారాముల కళ్యాణ తలంబ్రాల కోసం బుక్ చేసుకోండి’

MBNR: భద్రాచలం సీతారాముల కళ్యాణ తలంబ్రాల కోసం ఒక ప్యాకెట్ ధర 151 రూపాయలు పెట్టి బుక్ చేసుకోవాలని రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ గురువారం అన్నారు. జిల్లా కార్యాలయంలో అందుకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 25 నుంచి మార్చి 31 వరకు బుక్ చేసుకోవాలని సూచించారు. నేరుగా ఇంటికే తలంబ్రాలు చేరవేస్తారని తెలిపారు. పూర్తి వివరాల కోసం 9154298637 సంప్రదించాలన్నారు.

February 26, 2026 / 02:53 PM IST

విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాల బోధన

SRD: స్వయం పాలన దినోత్సవం సందర్భంగా ZPHS ఏదుల నాగులపల్లిలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. వారి బోధనను ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను విద్యార్థులు సన్మానించారు. ఈ కార్యక్రమం హెచ్‌ఎం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

February 26, 2026 / 02:53 PM IST

జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

AKP: నర్సీపట్నంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నియోజకవర్గ ఇంఛార్జ్ రాజాన వీరసూర్యచంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్స్‌ను ప్రారంభించి సభ్యత్వాన్ని వేగవంతం చేశారు. పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు.

February 26, 2026 / 02:53 PM IST

ప్రత్యేక ఉపకారాగారాన్ని సందర్శించిన మేజిస్ట్రేట్

W.G: భీమవరం ప్రత్యేక ఉపకారాగారాన్ని 2వ అదనపు జుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ N.జ్యోతి గురువారం సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. ముద్దాయిల కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెయిల్ మంజూరై చాలా కాలం నుంచి జైలులోనే ఉండిపోయిన ముద్దాయిల జామీను కోర్టుకు సమర్పిస్తే విడుదలకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. అనంతరం సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు.

February 26, 2026 / 02:51 PM IST

SA vs WI: హెడ్ టు హెడ్ రికార్డు

సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు T20Iల్లో 29 సార్లు తలపడ్డాయి. ఇందులో వెస్టిండీస్ 15 సార్లు, సౌతాఫ్రికా 14 సార్లు విజయం సాధించాయి. ఈ రెండు జట్లు తలపడ్డ గత చివరి 10 T20Iల్లో వెస్టిండీస్ 7 విజయాలతో సౌతాఫ్రికాపై పూర్తి ఆధిపత్యం సాధించింది. అయితే, T20 ప్రపంచకప్‌లో విండీస్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికా 4 విజయాలతో మంచి రికార్డు కలిగి ఉంది.

February 26, 2026 / 02:51 PM IST

‘హాస్టల్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయండి’

WNP: హాస్టల్ నిర్మాణ పనులను వేగంగా నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టలో నూతనంగా నిర్మిస్తున్న ఎస్సీ హాస్టల్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. మార్చి 10వ తేదీ కల్లా భవనాన్ని పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు.

February 26, 2026 / 02:48 PM IST

వెండి శివలింగం బహుకరించిన భక్తుడు

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేట రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో గణపురం మండలానికి చెందిన తంగళ్ళపల్లి చక్రధర చారి–చంద్రికలు 371 గ్రాముల వెండి శివలింగాన్ని గురువారం బహుకరించారు. ఆలయ అర్చకులు హరీష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ క్లర్క్ సంతోష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

February 26, 2026 / 02:48 PM IST

రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ఎంపీ ఆహ్వానం

BHNG: మార్చి 3న మోత్కూరులో శ్రీ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ  సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి దేవాలయ కమిటీ ఛైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండగొని రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

February 26, 2026 / 02:47 PM IST

భూదాన్ భూములను పరిశీలిస్తున్న కేటీఆర్

TG: ఖమ్మం పరిధిలోని వెలుగుమట్లకు మాజీ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. వెలుగుమట్లలో భూదాన్ భూములను పరిశీలిస్తున్నారు. అక్కడ గుడిసెలు తొలగించి పేదలను అధికారులు తరలించిన విషయం తెలిసిందే.

February 26, 2026 / 02:47 PM IST