• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పాముకాటుతో మహిళ మృతి

ATP: గుత్తి మండలం ఊటకల్లు గ్రామంలో పాముకాటుకు గురై చికిత్స పొందుతూ జయమ్మ అనే మహిళ శుక్రవారం మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. గత రెండు వారాల క్రితం పాముకాటుకు గురైన జయమ్మను మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

February 20, 2026 / 06:40 PM IST

‘ధ్యానం శారీరక, మానసిక ఆహ్లాదానికి తోడ్పాటు’

KMM: ధ్యానం శారీరక, మానసిక ప్రశాంతతకు, ఆనందానికి తోడ్పడుతుందని మధిర మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ సామినేని సుజాత అన్నారు. శుక్రవారం మాటూరుపేట గ్రామంలో నరసింహా పిరమిడ్ కేంద్రం వద్ద వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిరమిడ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ధ్యానాన్ని గ్రామ సర్పంచ్ చిలువేరు పూర్ణమ్మ బుచ్చిరామయ్యతో కలిసి ప్రారంభించి ప్రసంగించారు.

February 20, 2026 / 06:39 PM IST

అన్నా నేహా థామస్‌కు నటరాజ పురస్కారం

VZM: సీతం కళాశాలలో శుక్రవారం నిర్వహించిన సాంస్కృతిక వైభవం కన్నుల పండుగగా సాగింది. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలలో నృత్య ప్రదర్శనలు గావిస్తూ విజయనగరం ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్న అన్నా నేహా అన్నాథామస్‌కు నటరాజ పురస్కారాన్ని ప్రదానం చేసారు. అనంతరం ఆమె నృత్య ప్రదర్శనకు ప్రేక్షకులందరూ పరవశుతులయ్యారు.

February 20, 2026 / 06:38 PM IST

నోడల్ అధికారులకు గ్రీన్ సిగ్నల్.. ఏం చేయాలి?

TG: గురుకుల హాస్టల్‌లో నియామకమయ్యే నోడల్ అధికారులు.. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తనిఖీలు నిర్వహించాలి. విద్యాసంస్థల సరైన పనితీరును నిర్ధారించడానికి ఆకస్మిక సందర్శనలను కూడా నిర్వహించాలి. తనిఖీ నివేదికలను తయారు చేసి వెంటనే అప్‌లోడ్ చేయాలి. తీసుకున్న చర్యల‌ నివేదికను ప్రతినెల అయిదో తేదీలోపు సంబంధిత విభాగాధిపతులు, కార్యదర్శులకు తప్పకుండా సమర్పించాలి.

February 20, 2026 / 06:38 PM IST

సీఎం చంద్రబాబుకు భూమన చురకలు

AP: కల్తీ నెయ్యి విషయంలో సీబీఐ సిఫార్సులను ప్రభుత్వం బయటపెట్టాలని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏకసభ్య కమిషన్ ఛైర్మన్‌గా చంద్రబాబు ఉంటే సరిపోయేదని ఎద్దేవా చేశారు. వైసీపీ వాళ్లను దోషులు చేసిన ఆయనే శిక్షలు వేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి వ్యవహారం హెరిటేజ్‌లోనే ప్రారంభమైందని ఆరోపించారు.

February 20, 2026 / 06:37 PM IST

ఏఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నిరసన సెగ

ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ వద్ద భారత యువ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ నిరసన చేపట్టారు. భారత్-అమెరికా మధ్య కుదురుతున్న వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ యువ కాంగ్రెస్ శ్రేణులు వినూత్న రీతిలో ఆందోళన నిర్వహించారు. తమ చొక్కాలు విప్పి, అర్ధనగ్నంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

February 20, 2026 / 06:37 PM IST

క్రీడలతో ఆత్మస్థైర్యం పెంపొందుతుంది: ఎమ్మెల్యే

MBNR: క్రీడలు శారీరకదృఢత్వంతో పాటు మానసికస్థైర్యాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీఎం కప్ పోటీలను ఎమ్మెల్యే జ్యోతివెలిగించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధ్యాణ్యత ఇస్తుందన్నారు. యువత భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

February 20, 2026 / 06:36 PM IST

‘పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి’

ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి PHC సిబ్బంది మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలలో శుక్రవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ దీపిక ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. హెల్త్ సూపర్వైజర్ సుభాష్, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

February 20, 2026 / 06:35 PM IST

తెలుగు భాషకు సేవ చేస్తున్న కవులకు సత్కారం

ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా భీమవరం JLB స్కూల్లో విద్యార్థినిలు భువన విజయం రూపకం శుక్రవారం ప్రదర్శించారు. మాతృభాష అభ్యున్నతికి పాటుపడుతున్న కలిగొట్ల గోపాలశర్మ, సాగిరాజు సత్యనారాయణరాజు, వేము వెంకటకృష్ణమోహన్, తెలుగు అధ్యాపకులు రోహిణి, మౌనిక భవానిలను సత్కరించినట్టు HM కృష్ణకుమారి, అల్లు శ్రీనివాసులు తెలిపారు. ఇందులో రిటైర్డ్ MEO.సీతారామరాజు పాల్గొన్నారు.

February 20, 2026 / 06:35 PM IST

ఫ్రైడే డ్రైడేలో సూచనలు చేసిన డీఎంహెచ్వో

PPM: వ్యాదుల మూల కారణాలపై దృష్టి సారించి నియంత్రణ చర్యలు చేపట్టాలని DMHO డా ఎస్. భాస్కరరావు స్పష్టం చేశారు. ఉల్లిభద్ర గ్రామంలో శుక్రవారం ఆయన సందర్శించి అక్కడ ఫ్రైడే డ్రైడే నిర్వహణ తీరు పరిశీలించారు. గ్రామంలో గృహ సందర్శనలు చేస్తూ పరిసరాల్లో నీటి తొట్టెలు, కాల్వలు పరిశీలించారు. లార్వా ఉనికి ప్రదేశాలను నియంత్రణ చెయ్యాలి అన్నారు.

February 20, 2026 / 06:35 PM IST

ఈ నెల 21వ తేదీ నుంచి అదనపు కేంద్రాలు ప్రారంభం

ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా జిల్లాలో అదనంగా 15 శనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి కొత్త కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 6 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరల ప్రకారం శనగ క్వింటాల్‌కు రూ. 5,875 చెల్లించబడుతుందని తెలిపారు.

February 20, 2026 / 06:35 PM IST

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

BPT: పిడుగురాళ్ల–వాడరేవు జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్చూరు వైపు వస్తున్న కారు, బైక్ బలంగా ఢీకొనడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పర్చూరు SI పులి గోపి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 20, 2026 / 06:34 PM IST

బీసీ హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీలు

ప్రకాశం: పెద్దారవీడు గ్రామ పంచాయతీలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్‌ను ఎంపీడీవో జాన్ సుందరరావు ఆకస్మికంగా సందర్శించారు. హాస్టల్లో వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

February 20, 2026 / 06:34 PM IST

ఉండిలో పర్యటించిన జేసీ

W.G: ఉండి మండలం చిన్నపులేరు గ్రామంలో జేసీ టీ రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. పట్టాదారు పాస్ పుస్తకాల అమలు తీరును స్వయంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పట్టాదారు పాస్ పుస్తకాల వెరిఫికేషన్ వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఇందులో ఆర్డీఓ కె. ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా సర్వే అధికారి కె. జాషువా, MRO నాగార్జున పాల్గొన్నారు.

February 20, 2026 / 06:33 PM IST

BREAKING: ఐదుగురు పిల్లలు మృతి

రాజస్థాన్‌లోని డీగ్ జిల్లా నియామత్ పూర్‌లో భారీ విషాదం చోటుచేసుకుంది. ఓ పెళ్లి ఊరేగింపులోని డీజే వాహనం ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ లైన్‌కు తగలడంతో విద్యుత్ షాక్ సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు పిల్లలు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 20, 2026 / 06:33 PM IST