• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఐఈడీ పేలుడు.. జవానుకు తీవ్రగాయాలు

TG: ములుగు జిల్లా కర్రెగుట్టల్లో ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో జవానుకు తీవ్రగాయాలయ్యాయి. వెంకటాపురం మండలం పామునూరు సమీప కర్రెగుట్టల్లో పేలుడు జరిగింది. హెలికాప్టర్‌లో జవానును పోలీసులు వెంకటాపురం తరలించారు. వెంకటాపురం నుంచి వరంగల్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

February 20, 2026 / 06:27 PM IST

‘సాగర సంగ్రామ దీక్షను జయప్రదం చేయాలి’

AKP: ఈనెల 22న విశాఖలో జరిగే సాగర సంగ్రామ దీక్షను జయప్రదం చేయాలని పీఆర్డీయూ జిల్లా అధ్యక్షులు డీ. గోపినాధ్ తెలిపారు. శుక్రవారం ఈ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. సీపీఎస్ ఉద్యోగుల హక్కుల సాధన కొరకు ఏపీసీపీఎస్ఈఏ ఈ సాగర సంగ్రామ దీక్ష కార్యక్రమాన్ని తలపెట్టిందన్నారు. ఈ దీక్షలో పీఆర్డీయూ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

February 20, 2026 / 06:27 PM IST

వైద్య సేవలపై డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సమీక్ష

KMR: ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని బస్తీ దవాఖానలు, రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం అమలుపై జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నర్సింగ్ శుక్రవారం సమీక్షించారు. బస్తీ దవాఖానల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న వైద్య సేవల రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు.

February 20, 2026 / 06:27 PM IST

యువతిపై హత్యాయత్నం.. నిందితుడు అరెస్ట్

SRPT: చివ్వెంల మండలం కూడకుడకు చెందిన పట్టేటి స్పందనపై హత్యాయత్నం చేసిన కేసులో నిందితుడు బోయిండ్ల మహేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి బావ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్స మహేశ్వర్ గురువారం సాయంత్రం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం నిందితుడిని విచారించి రిమాండ్‌కు తరలించారు.

February 20, 2026 / 06:26 PM IST

విద్యుత్ షాక్‌తో గిరిజన మహిళా రైతు మృతి

మహబూబాబాద్ మండలం సండ్రాలగూడెం శివారు పూరి తండాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు విద్యుత్ మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి బానోత్ లక్ష్మి (55) అనే గిరిజన మహిళా రైతు అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 20, 2026 / 06:25 PM IST

అమ్మవారి నిత్యా అన్నదానానికి భారీ విరాళం

NTR: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నిత్య అన్నదాన పథకం కోసం గుంటూరు జిల్లా రాజేంద్రనగర్ వాస్తవ్యులు శ్రీ ముప్పవరపు రమేష్ కుమార్, శ్రీమతి మాధవి లత దంపతులు విరాళం అందజేశారు. ఈ మేరకు వారు తమ కుమారుడు UASలో నివసిస్తున్న శ్రీ మెగా హర్ష ముప్పవరపు పేరిట రూ.5,01,116 చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు దాతలను అభినందించారు.

February 20, 2026 / 06:24 PM IST

చంద్రునిపై పగుళ్లు.. ఆందోళనలో శాస్త్రవేత్తలు

చంద్రుని ఉపరితలంపై శాస్త్రవేత్తలు తాజాగా 1,114 కొత్త పగుళ్లను గుర్తించారు. దీంతో మొత్తం పగుళ్ల సంఖ్య 2,634కి చేరింది. చంద్రుని అంతర్భాగం చల్లబడుతుండటంతో అది కుచించుకుపోతోందని, ఆ ఒత్తిడి వల్లే పగుళ్లు ఏర్పడుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ మార్పుల వల్ల భవిష్యత్తులో చంద్రునిపై కంపనలు(Moonquakes) వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

February 20, 2026 / 06:22 PM IST

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం ఎంతంటే..?

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శుక్రవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ. 2,56,497 లక్షల ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 323 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 15 ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించారు అని, 2875 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.

February 20, 2026 / 06:21 PM IST

భారత వాయుసేనలో ఉద్యోగాలు

ATP: భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు నియామకాలకు యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ప్రతాప్ రెడ్డి కోరారు. ఇంటర్మీడియట్ గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులలో 50 శాతం మార్కులు సాధించిన వారు అర్హులన్నారు. మార్చి 9- 12 వరకు agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

February 20, 2026 / 06:20 PM IST

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బాధ్యతలు చేపట్టిన ఛైర్ పర్సన్

GDWL: గద్వాల మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ నూతన మున్సిపల్ ఛైర్‌పర్సన్ తుమ్మల జయలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పట్టణ సమగ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తానన్నారు. ఎమ్మెల్యే సహకారం, కౌన్సిలర్ల సమన్వయంతో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తన వంతు కృషి చేస్తానన్నారు.

February 20, 2026 / 06:18 PM IST

ఘనంగా వేంకటేశ్వరస్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

BHNG: బీబీనగర్‌ మండలం రహీంఖాన్‌గూడెంలో శ్రీ పద్మావతి అలివేల్‌ మంగ సమేత వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున స్వామి వారు దివ్య విమాన రథోత్సవం ద్వారా గ్రామ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు హారతులు, భక్తిశ్రద్ధలతో స్వాగతించారు.

February 20, 2026 / 06:18 PM IST

ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

VZM: మెరకముడిదాం(మం) సోమలింగాపురంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 23 నుంచి మార్చి 8 వరకు జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఈ పరీక్షలకు ప్రథమ, ద్వితీయ 604 విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు.

February 20, 2026 / 06:17 PM IST

2026 సంవత్సర కాలమాణిని విడుదల

NZB: జిల్లా న్యాయవాదుల సహకార పరపతి సంఘం సంయుక్త కార్యదర్శి గంట విప్లవ్ కిరణ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్మూర్ బార్ అసోసియేషన్ హాలులో 2026 సంవత్సర కాలమాణిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు.

February 20, 2026 / 06:17 PM IST

వైసీపీ తీరును జనసేన ఖండిస్తోంది: మంత్రి దుర్గేష్

AP: మండలి ఛైర్మన్ ఛాంబర్ వద్ద మంత్రి లోకేష్ నేతృత్వంలో కూటమి పార్టీల సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ తీరును జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. జగన్ ఆదేశాలతోనే జరిగిందని స్పష్టంగా కనబుతోందని చెప్పారు. హిందువులకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

February 20, 2026 / 06:16 PM IST

జనతా వారధిలో వినతులు స్వీకరించిన పీవీఎన్ మాధవ్

VSP: బీజేపీ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర కార్యాలయం(విశాఖ)లో రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రజల వినతులు స్వీకరించారు. ఎస్‌వీఎస్ ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి శుక్రవారం ఒక ఎమ్మెల్యే అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు.

February 20, 2026 / 06:15 PM IST