తూ.గో: ప్రజా సేవలోనే కాదు, క్రీడా మైదానం లోనూ తనదైన శైలిలో క్రికెట్ ఆడి తన ప్రతిభను చాటిచెప్పారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. గురువారం విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఇందుకు వేదికయ్యింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పాల్గొన్న ఆటవిడుపు ఆటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీల్లో మంత్రి సుభాష్ ప్రొఫెషనల్ క్రికెటర్‌లా అలరించారు.
KRNL: ఆదోని పురపాలక సంఘం బడ్జెట్‌ను ఎట్టకేలకు YCP సభ్యులు ఆమోదం తెలిపారు. గురువారం ఛైర్ పర్సన్ లోకేశ్వరి అధ్యక్షతన 2026-27 రూ.96 కోట్లతో అంచనా బడ్జెట్‌ను రూపొందించారు. మూడుసార్లు బడ్జెట్ సమావేశాలు నిర్వహించగా.. ఈ ఏడాది మార్చ్ 17తో YCP కౌన్సిల్ పదవీకాలం ముగియనుండటంతో సభ్యులు ఎట్టకేలకు బడ్జెట్‌ను ఆమోదించారు.
కామారెడ్డి జిల్లాలో సేవా కార్యక్రమాల్లో ముందున్న ఎస్ఆర్ ఫౌండేషన్ సేవలను కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ ప్రశంసించారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్‌లో ‘సీఎం-కప్’ రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో విజేతలైన బీబీపేట్ మండల విద్యార్థులను ఆయన అభినందించారు. కాగా, డాకూరి రోహిత్, చిట్టబోయిన వంశీ రాష్ట్రస్థాయిలో మెరిసి పతకాలు సాధించారు.
SKLM: పదవ తరగతి పరీక్షలు దగ్గర అవుతున్న సందర్భంగా తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని హెచ్ఎం ఒకలా రత్నమాల తెలిపారు. నరసన్నపేట మండలం సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సాయంత్రం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఇంటి వద్ద చదువుతోపాటు వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలన్నారు.
WGL: నేర పరిశోధనలో పోలీస్ జాగిలాలు కీలకంగా నిలుస్తాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. నూతనంగా విధుల్లోకి చేరిన పోలీస్ జాగిలాలను CP పరిశీలించారు. ఈ నూతన జాగిలాలు ప్రేలుడు పదార్థాలను సులభంగా పసిగడతాయని CP అన్నారు. అదనపు డిసిపిలు శ్రీనివాస్, రవి, తదితరులు ఉన్నారు.
KNR: కరీంనగర్ బస్టాండ్ పోలీస్ అవుట్ పోస్ట్ పరిధిలో పది రోజుల క్రితం ఒక సూట్ కేసు లభ్యమైంది. అందులో విలువైన దుస్తులు, పుస్తకాలు, సర్టిఫికెట్లు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆధార్ కార్డు ఉన్నాయి. కార్డులోని ఫోన్ నంబర్‌కు పోలీసులు ప్రయత్నించగా సిగ్నల్ అందడం లేదు. బాధితులు 9440469543, 8712580332ను సంప్రదించి ఆధారాలు చూపి బ్యాగును తీసుకెళ్లాలని పోలీసులు కోరారు.
HYD: హోలీ పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు వివిధ జోన్లలో 1,244 ప్రత్యేక ట్రిప్పులు నడపాలని నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 16 ప్రత్యేక రైళ్లు నడవనున్నారు. 40 ట్రిప్పులతో రైల్వే ప్రణాళిక సిద్ధం చేసింది. చర్లపల్లి, తిరుపతి, సికింద్రాబాద్ రాష్టలకు సర్వీస్‌లు ఉన్నాయి.
WGL: చెన్నారావుపేట (M) కేంద్రంలోని కోనాపురం గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న కళ్యాణ మహోత్సవం సందర్భంగా కార్యక్రమ గోడ పత్రికను ఇవాళ గ్రామ పెద్దలు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ.. భక్తులకు మెరుగైన వసతులు కల్పించినట్లు తెలిపారు. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు.
CTR: చౌడేపల్లి మండలంలో ఆపరేషన్ వజ్రప్రహార్‌లో భాగంగా రూ.20.70లక్షల విలువ గల నిషేధిత ‘కూల్ లిప్’ పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు అన్నమయ్య ఎస్పీ ధీరజ్ తెలిపారు. మత్తు పదార్థాల సరఫరా వెనక ఉన్న నెట్‌వర్క్‌ను ఛేదించడంలో ఇది కీలక ముందడుగు అన్నారు.
‘హే బల్‌వంత్’ మూవీ ‘థాంక్స్ మీట్’లో నిర్మాత వంశీ నందిపాటి.. సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. గతంలో అవార్డులపై తాను చేసిన వ్యాఖ్యలు పొరపాటని, అవి తన సొంత అభిప్రాయాలు కావని స్పష్టం చేశాడు. అవార్డులు, దేవుడిపై తనకు అపారమైన గౌరవం ఉందని తెలిపాడు. తన మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరాడు.
RR: మూసీ నది సుందరీకరణ పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఇళ్లు కోల్పోతున్న బాధితులకు అండగా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు బాపూఘాట్ వద్ద ‘పరామర్శ యాత్ర’ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీతో పాటు జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, తదితర నేతలు పాల్గొన్నారు.
W.G. ఆకివీడు తాళ్లకోడు కాలనీలో సమస్యలను పరిశీలించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర ప్రారంభించారు. కాలనీలో రోడ్లు సక్రమంగా లేవని, తాగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ లేదని కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కాలనీని ఆకివీడు నగర పంచాయతీలో చేర్చ అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
WGL: 37వ డివిజన్ తూర్పు కోటలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, స్థానిక కార్పొరేటర్ సువర్ణ సురేష్ ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసుకోవాలని, లబ్ధిదారులకు వెనువెంటనే బిల్లులను ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ స్పష్టం చేశారు.
JN: జనగాం జిల్లా కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆయన జిల్లాకు నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
PDPL: పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిలో ఇవాళ 103 కిలోల 45 సంవత్సరాల మహిళకు గర్భకోశానికి సంబంధించిన శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు DCHS డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ముత్తారం మండలానికి చెందిన మహిళ తీవ్రమైన కడుపు నొప్పి, రక్తస్రావంతో ఆసుపత్రిలో చేరగా పరీక్షలు నిర్వహించి సర్జరీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వాసుపత్రి సేవలను ఉపయోగించుకోవాలన్నారు.