• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రామాలయ నిర్మాణానికి రూ.27,000 విరాళం

VZM: మెరకముడిదాం మండలం సిరియాల పేట గ్రామంలో రామాలయం నిర్మాణ చేపడుతున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి చీపురుపల్లి టీడీపీ మాజీ ఇంఛార్జ్ త్రిమూర్తులు రాజు రూ. 27,000 అందించారు. మోటర్ బోరు నిమిత్తం గ్రామస్థులు ఆయనను సంప్రదించగా ఈ సాహాయం అందించారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ పనులు ముగింపు దశకు వచ్చాయని తెలిపారు.

February 21, 2026 / 10:54 AM IST

ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

ప్రకాశం: కనిగిరి మోడల్ స్కూల్‌లో ఆరో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ప్రిన్సిపల్ డాక్టర్ ఎద్మావతి తులసి తెలిపారు. మార్చి 31వ తేదీ ఫీజు చెల్లింపుకు చివరి తేదీగా నిర్ణయించారు. ఏప్రిల్ 27న ప్రవేశ పరీక్ష నిర్వహించి అదే రోజు ఫలితాలు విడుదల చేస్తామన్నారు.

February 21, 2026 / 10:49 AM IST

నీలాయపల్లి గ్రామపంచాయతీలో ట్రాన్స్ ఫార్మర్ దొంగతనం

MNCL: తాండూర్ మండలం నీలాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మాదారం పోచమ్మ ఆలయం ముందు ఉన్న ట్రాన్స్ఫార్మర్‌ని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. దొంగలు ట్రాన్స్ ఫార్మర్ పగలగొట్టి దానిలోని రాగి తీగలు దొంగలించుకుపోయారు. ఈ విషయమై విద్యుత్ AE కి,SI కి ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్ పొలవేణి తిరుపతి స్పష్టం చేశారు.

February 21, 2026 / 10:49 AM IST

పాఠశాలలను పరిశీలించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ

ELR: జిలుగుమిల్లీ మండల పరిధిలో ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలలను శనివారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా.గోపి మూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వద్ద నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరిస్తానని వారికి తెలిపారు.

February 21, 2026 / 10:47 AM IST

బకాయి పన్నులను సకాలంలో చెల్లించాలి: గ్రామ కార్యదర్శి

WGL: నల్లబెల్లి మండలంలోని ముచింపుల గ్రామపంచాయతీలో శనివారం గ్రామ కార్యదర్శి తొగరు అనిత ఆధ్వర్యంలో ఇంటి పన్ను వసూలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామస్థులు తమ బకాయి పన్నులను సకాలంలో చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోనే గ్రామంలో మౌలిక వసతుల కల్పన సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.

February 21, 2026 / 10:46 AM IST

ఆళ్లపల్లి మండలంలో పెద్దపులి కలకలం

BDK: ఆళ్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం. రేగళ్ల రేంజ్ నుంచి ఆళ్లపల్లి రేంజ్‌లోకి ప్రవేశించిన పులి అడుగుజాడలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. రైతులు, కూలీలు ఎవరూ వ్యవసాయం చేనులకు వెళ్ళొద్దని అటవీ అధికారులు హెచ్చరించారు. గ్రామస్తులు ఒంటరిగా తిరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.

February 21, 2026 / 10:45 AM IST

రేపు రూ. 42 లక్షల విలువైన చెక్కుల పంపిణీ

ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అనారోగ్యం, ప్రమాదాల బారిన పడిన బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు చొరవతో మంజూరైన రూ. 42 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆదివారం పంపిణీ చేయనున్నారు. ఉదయం 9:30 గంటలకు ప్రజావేదిక కార్యాలయంలో 29 మంది లబ్ధిదారులకు ఈ చెక్కులను ఎమ్మెల్యే అందజేస్తారు.

February 21, 2026 / 10:45 AM IST

‘స్వామి కళ్యాణ మహోత్సవాల మొదటి శుభలేఖ అందుకున్నారు’

E.G: కోరుకొండలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఈనెల 27వ తేదీ నుంచి వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణను ఆలయ అధికారులు శనివారం కలిసి ఉత్సవాలకు సంబంధించి మొదటి శుభలేఖను అందజేశారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

February 21, 2026 / 10:45 AM IST

యాదవ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా జక్కుల కృష్ణ

PLD: జిల్లా యాదవ యువజన సంఘం అధ్యక్షుడిగా మాచవరం మండలం రేగులగడ్డకు చెందిన జక్కుల కృష్ణ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు చింకా నారాయణ ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. జిల్లాలోని యాదవుల హక్కుల కోసం పోరాడుతూ, నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు.

February 21, 2026 / 10:45 AM IST

రేపే గురుకుల ప్రవేశ పరీక్ష.. 68 కేంద్రాలు ఏర్పాటు

KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపు నిర్వహించనున్న అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భద్రాద్రి జోన్-4 అధికారి అలివేలు తెలిపారు. మొత్తం 68 కేంద్రాల్లో 25,140 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులు ఉదయం 9.30 గంటలకే కేంద్రానికి చేరుకోవాలని, గంట ముందే గేట్లు మూసివేస్తారని స్పష్టం చేశారు.

February 21, 2026 / 10:45 AM IST

శివుడికి అభిషేకం.. విదేశీ భక్తుల భజన

TPT: జిల్లా రేణిగుంట శ్రీరాజరాజేశ్వరీ దేవి జ్ఞానపీఠంలో మహా శివలింగ ప్రతిష్ఠాపన శుక్రవారం ఘనంగా జరిగింది. 32 దేశాల నుంచి 140 మంది విదేశీ భక్తులు హాజరయ్యారు. శివనామ స్మరణల మధ్య రుద్రాభిషేకం, మహా చండీ హోమం నిర్వహించారు. జర్మనీ గురూజీ పరమహంస విశ్వనంద స్వామీజీ చేతుల మీదగా పూజా కార్యక్రమాలు జరిగాయి. విదేశీ భక్తులు సైతం శివ నామ స్మరణలతో మైమరిచిపోయారు.

February 21, 2026 / 10:44 AM IST

చేనేత కళాకారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

NLG: రాష్ట్ర ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ’ రాష్ట్ర అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 31.12.2025 నాటికి 30 ఏళ్ల వయస్సు, 10 ఏళ్ల అనుభవం ఉన్న చేనేత కళాకారులు; అలాగే, 25 ఏళ్ల వయస్సు, 5 ఏళ్ల అనుభవం ఉన్న డిజైనర్లు అర్హులు. ఆసక్తిగల వారు మార్చి 31 లోపు జిల్లా చేనేత శాఖ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

February 21, 2026 / 10:44 AM IST

జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సుశాంక్ ఎంపిక

NZB: మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన సుశాంక్ జాతీయ స్థాయి సీనియర్ కబడ్డి పోటీలకు ఎంపికైనట్లు జిల్లా కబడ్డి కోచ్ మీసాల ప్రశాంత్ తెలిపారు. జాతీయ స్థాయి పోటీలకు జిల్లా క్రీడకారుడు ఎంపికవడంపై జిల్లా కబడ్డి అసోసియేషన్ అధ్యక్షుడు లింగయ్య, కార్యదర్శి గంగాధర్, కార్యవర్గ సభ్యులు పలువురు అభినందనలు తెలిపారు.

February 21, 2026 / 10:44 AM IST

వటపత్రశాయిగా యాదగిరీశుడు

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం వటపత్రశాయిగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మహాద్భుత దర్శనభాగ్యం భక్తులకు కలిగింది. ప్రధానాలయంలో స్వామివారిని వంటపత్ర శాయి అలంకారంలో ప్రత్యేక పల్లకిపై అధిష్టించారు. అనంతరం డోలు సన్నాయి, మేళాలతో స్వామివారిని ప్రధాన మాఢ వీధుల్లో ఊరేగించారు.

February 21, 2026 / 10:41 AM IST

పెర్కిట్లో కొత్త బీటీ రోడ్డు పనుల పరిశీలన..!

NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధి 5వ వార్డు పెర్కిట్లో కొత్తగా నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. కౌన్సిలర్ ప్రసాద్, స్థానిక నాయకులతో కలిసి పనుల నాణ్యతను తనిఖీ చేసిన ఆయన, గడువులోగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

February 21, 2026 / 10:40 AM IST