MDCL: ఆశా కార్యకర్తల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ CITU జిల్లా నాయకులు ఫిబ్రవరి 23న నిర్వహించే “ఛలో హైదరాబాద్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి ఎం. రేవతి కళ్యాణి, ఉపాధ్యక్షురాలు కె. కోమలత అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెమోరాండం సమర్పించారు.
PPM: మహిళా సంఘాలు సభ్యులు వివిధ పథకాల్లో తీసుకున్న రుణాలు ఏ ఏ రంగాలలో పెట్టుబడులు పెట్టారో అనే వాస్తవిక సమాచారం సేకరించాలని మన్యం జిల్లా డీఆర్డీఏ పీడీ ఏం.సుధారాణి పేర్కున్నారు. శుక్రవారం సాలూరు మండలం బాగువలసలో ఈ నారిలు ద్వారా నిర్వహిస్తున్న జీవనోపాధులు సర్వేను ఆకస్మికంగా పరిశీలించారు. సిబ్బంది ఈ నారీలు చేస్తున్న సర్వే పరిశీలించి సూచనలు చేయాలన్నారు.
BDK: హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన పాఠశాల స్థాయి క్రీడా పోటీలలో పరుగు పందెంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న కే. నాగరంజిత్ తన ప్రతిభను చాటిచెప్పాడు. పాక్షికంగా వికలాంగుడు అయినప్పటికీ చదువుల్లోను ఆటల్లోను ముందంజలో ఉండడం అతని ధైర్యసాహసాలకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ అభినందించారు.
Yoodesk Office Solutions సంస్థలో వీడియో కంటెంట్ క్రియేటర్&ఎడిటర్ ఇంటర్న్‌షిప్ అవకాశం అందుబాటులో ఉంది. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.21,000 వరకు స్టైఫండ్ ఉంటుంది. మార్చి 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
భారతమండపంలో కాంగ్రెస్ నేతల చర్యలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. ప్రజలు కాంగ్రెస్‌ను అసహ్యించుకుంటున్నారని, ఆ పార్టీ కార్యకర్తల తీరు అత్యంత సిగ్గుమాలిన చర్య అని ఆయన విమర్శించారు. ప్రపంచ దేశాల ముందు భారత దేశ గౌరవాన్ని మంటగలిపారని, రాహుల్ విపక్ష నేతగా ఉండడం దేశ దురదృష్టకరమని ఆయన ధ్వజమెత్తారు.
KKD: అన్నవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుండి తుని వెళ్తున్న బస్సు, స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో దేవస్థాన వ్రత విభాగ అదనపు పురోహితుడు రఘునాథ శర్మ (20) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విధి నిర్వహణకు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TPT: శనివారం ఉదయం 10:30 గంటలకు పిచ్చాటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా స్వర్ణరథం ప్రారంభోత్సవం జరుగనుంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఎంసీ మాజీ ఛైర్మన్ డి. ఇలంగోవన్ రెడ్డి కోరారు. మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ఆహ్వానం అందించారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా మూడో రోజు శుక్రవారం సాయంత్రం స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. జగత్ రక్షకుడైన శ్రీవారు ఆదిశేషులుపై తిరువీధి సేవలో మంగళ వాయిద్యాలతో, శాస్త్రీయ నృత్యాలతో, కనుల పండగగా ఊరేగించారు. భక్తులు స్వామి వారిని దర్శించి తరించారు.
MBNR: దేవరకద్ర మున్సిపాలిటీ నూతన ఛైర్‌పర్సన్‌గా దమయంతి గోవర్ధన్ రెడ్డి, వైస్ ఛైర్మన్ యుగంధర్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హాజరై, నూతన పాలకవర్గాన్ని వారి కుర్చీలలో కూర్చోబెట్టి ప్రత్యేక అభినందనలు తెలిపారు. పట్టణ సమగ్ర అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
తిరుపతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కరకంబాడి రోడ్డు సుబ్బారెడ్డి నగర్‌లోని వెంకీ జిమ్ ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలు రుయా ఆసుపత్రిలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న దీప్తి చరిష్మా (39)గా గుర్తించారు. ఆమె కరకంబాడి నుంచి విధులకు స్కూటీపై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
PDPL: కమాన్పూర్ PSలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మట్ట రమేష్ తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో ప్రతిభ చాటారు. సైబరాబాద్ కమిషనరేట్లో జరుగుతున్న 4వ తెలంగాణ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ అర్చరీ వ్యక్తిగత విభాగంలో సిల్వర్ మెడల్, టీం విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించారు. ఆయన విజయంపై ఎస్సై కొట్టే ప్రసాద్, ఏఎస్సై బాలాజీ నాయక్ అభినందించారు.
ASF: రెబ్బెన మండలంలో అక్రమ ఇసుక రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. నంబాల నుంచి తక్కలపల్లికి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను శుక్రవారం పట్టుకున్నారు. ఎస్సై వెంకట కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం తనిఖీల్లో అనుమతి పత్రాలు లేకపోవడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశామన్నారు.
VZM: నెల్లిమర్ల MLA లోకం నాగ మాధవి శనివారం ఉదయం 09:30 గంటలకు కొండవెలగాడ-నెల్లిమర్ల R&B రోడ్ రిసర్ఫేసింగ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10:30 గంటలకు భోగాపురం మండలం, ముంజేరు గ్రామం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం వారు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
TG: జిల్లాస్థాయి అక్రెడిటేషన్ కమిటీలను వారం రోజులలో పూర్తి చేయాలని DPROలను సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ CH ప్రియాంక ఆదేశించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా, ఫ్రిలాన్స్, వెటరన్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల నమోదు, దరఖాస్తుల పరిశీలన, రిపోర్టులు, రిజిస్ట్రేషన్ నెంబర్ అలాట్ మెంట్ వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
CTR: పుంగనూరు నియోజకవర్గానికి చెందిన సి. హేమచంద్రను పార్టీ స్టేట్ పబ్లిసిటీ వింగ్స్ సెక్రటరీగా నియమించారు. ఈ నియామకంపై హేమచంద్ర మాట్లాడుతూ.. పార్టీ ఆశయాలను, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, సూచనలతో ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు. కార్యకర్తలు, ముఖ్య నాయకులతో కలసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు.