• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అందుకే భారీ స్కోర్లు రావడం లేదు: సూర్య

పవర్‌ప్లేలో మా ఆట తీరు బాగుందని కెప్టెన్ సూర్య అన్నాడు. ‘మేము 40-50 పరుగులు చేస్తున్నాం. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో చాలా బాగా ఆడాం. మాపై ఇతరులకు అంచనాలు ఉండటం సహజం. ప్రతి మ్యాచ్‌లోనూ 220 – 250 పరుగులు చేయాలని ఆశిస్తుంటారు. కానీ ఇక్కడి పిచ్‌లు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటివరకు మేము ఆడిన నాలుగు పిచ్‌లు సవాలుతో కూడుకున్నవిగా ఉన్నాయి’ అని పేర్కొన్నాడు.

February 22, 2026 / 05:48 PM IST

‘ప్రజా సేవే లక్ష్యంగా పని చేస్తాను’

ఆసిఫాబాద్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికైన డాక్టర్ అనిత రాజకీయాలకు అతీతంగా మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆదివారం తెలిపారు. శ్రామిక ప్రాంతంలో వైద్య సేవలు అందిస్తున్న అనిత బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. 28వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందిన అనిత ప్రజా సేవే లక్ష్యంగా పని చేస్తానన్నారు.

February 22, 2026 / 05:47 PM IST

బూర్గుల తండా సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి

SRPT: నేరేడుచర్ల మండలం బూరుగుల తండా గ్రామంలో గిరిజన ఆరాధ్యదైవం శ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సంత్ సేవాలాల్ మహారాజ్ గారి ఆదర్శాలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ కొనతం చిన్న వెంకటరెడ్డి సర్పంచ్ నాగు ,ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు.

February 22, 2026 / 05:47 PM IST

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి

KMM: పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఏదులాపురం సత్య నారాయణపురంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడి గృహప్రవేశ వేడుకకు ఆదివారం మంత్రి హాజరయ్యారు. నూతన గృహంలోకి అడుగుపెట్టిన కుటుంబ సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

February 22, 2026 / 05:46 PM IST

తీవ్రంగా నిధుల కొరత ఉంది: రేవంత్ రెడ్డి

TG: ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీదే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఒక్క ప్రాజెక్టు మీదే లక్షల కోట్లు ఖర్చు చేసి మిగతా వాటిని పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు మిగతా ప్రాజెక్టులకు, భూసేకరణకు తీవ్రంగా నిధుల కొరత ఉందన్నారు. వచ్చే రెండు, మూడేళ్లలో ప్రాజెక్టలన్నింటినీ పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నామన్నారు.

February 22, 2026 / 05:44 PM IST

రేపు యధావిధిగా PGRS : కలెక్టర్

W.G: భీమవరం కలెక్టరేట్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం PGRSను యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ నాగరాణి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్, వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు.

February 22, 2026 / 05:44 PM IST

పెళ్లి రోజే విషాదం.. అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ జిల్లాలో విషాదం నెలకొంది. వివాహం జరగాల్సిన రోజే అక్కాచెల్లెళ్లు శోభ(25), విమల(23) విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబీకులు వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. బాబాయ్‌ల ఒత్తిడితో జరిగిన బలవంతపు పెళ్లి ఇష్టం లేకనే వారు మరణించినట్లు మేనమామ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

February 22, 2026 / 05:44 PM IST

నూతన గంగమ్మ దేవస్థానం ప్రతిష్టా మహోత్సవం

NDL: డోన్ బట్టీల సెంటర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ గంగమ్మ దేవస్థానం అమ్మ వారి విగ్రహ, ధ్వజ ప్రతిష్ట మహోత్సవంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు బుగ్గన అర్జున్ అమర్నాథ్ రెడ్డి ప్రత్యేక పూజలు ఇవాళ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మీట్ కార్పొరేషన్ ఛైర్మన్,మున్సిపల్ ఛైర్మన్, ఎంపీపీ,జడ్పిటీసీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అభిమానులు పాల్గొన్నారు.

February 22, 2026 / 05:42 PM IST

T20 WC: పీకల్లోతు కష్టాల్లో శ్రీలంక

147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఇంగ్లండ్ బౌలర్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. విల్ జాక్స్ (3), జోఫ్రా ఆర్చర్(2) ధాటికి శ్రీలంక కేవలం 52 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. నిస్సాంక (9), మిషారా (6), మెండిస్ (4), రత్నాయకే (0), వెల్లలాగే (10) తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. ప్రస్తుతం క్రీజులో కమిందు షనక (9), హేమంత(0) పోరాడుతున్నారు.

February 22, 2026 / 05:41 PM IST

ఘనంగా సర్పంచ్‌లకు సన్మానం

VZM: బొండపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం సర్పంచ్‌లను ఘనంగా సన్మానించారు. సర్పంచుల పదవీకాలం మార్చి నెలలో పూర్తికానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సర్పంచ్‌లకు బొండపల్లి ఎంపీపీ చల్ల చల్లంనాయుడు, పలువురు అధికారులు సర్పంచులకు సాలువల కప్పి పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు.

February 22, 2026 / 05:41 PM IST

‘రేపు పుట్టపర్తిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్‌, మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై వినతులు అందజేస్తే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 22, 2026 / 05:40 PM IST

గ్రామీణ డాక్ సేవక్‌లకు కేంద్రమంత్రి శుభవార్త

AP: గ్రామీణ డాక్ సేవక్‌లకు ఈ స్కూటర్లు ఇచ్చేలా చూస్తామని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య హామీ ఇచ్చారు. తపాలాశాఖ.. ABCD ఫార్ములాతో ముందుకెళ్లాలని సూచించారు. బ్యాంకింగ్, లాడ్‌లీ లక్ష్మీ, సుకన్య సమృద్ది ద్వారా తపాలాశాఖ బలోపేతం అయిందన్నారు. ఏక్యూరసీ, బిహేవియర్, కమిట్‌మెంట్ టు డెలివరీ.. ఇవే వారి నినాదం అని అన్నారు. ఇవాళ్టి కార్యక్రమం తపాలాశాఖకు ఉగాది కానుందన్నారు.

February 22, 2026 / 05:40 PM IST

కార్పొరేటర్ ను సన్మానించిన కమిటీ సభ్యుడు

NZB: నిజామాబాద్ గాయత్రినగర్‌లో ఆదివారం శ్రీ గాయత్రి చైతన్య కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ సుమిత్రను ఘనంగా సన్మానించారు. కమిటీ అధ్యక్షుడు ఆడెపు నరేంద్ర స్వామి మాట్లాడుతూ.. కార్పొరేటర్ సుమిత్ర కిషోర్ గతంలో చేసిన అభివృద్ధి పనులు, ఆయన మంచితనం వల్లే నేడు మళ్లీ విజయం చేకూర్చాయని అన్నారు.

February 22, 2026 / 05:39 PM IST

పదేళ్లలో ప్రాజెక్టులు కట్టలేదు: రేవంత్

TG: గోదావరి జలాల వివాదం కొన్నాళ్లుగా రాజకీయరంగు పులుముకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గడిచిన పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు వివాదమే ఉండేది కాదని అన్నారు. 960 TMCలకు సరిపడా ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే సమస్య ఉండేది కాదన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసుకుని రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకోవాలన్నారు.

February 22, 2026 / 05:39 PM IST

మల్లాపూర్‌లో CMRF చెక్కు పంపిణీ

MBNR: మిడ్జిల్ మండలం మల్లాపూర్‌కు చెందిన నందినికి రూ.32 వేల సీఎం సహాయ నిధి (CMRF) చెక్‌ను మాజీ సర్పంచ్ అయ్యన్న గౌడ్ అందజేశారు. సీఎంఆర్ఎఫ్ ఆపద సమయంలో పేదలకు భరోసాగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుకుమార్ రెడ్డి, చందర్, సైదులు, తదితరులు పాల్గొన్నారు.

February 22, 2026 / 05:38 PM IST