AP: కల్తీ నెయ్యిపై విచారణకు వన్ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. టెండర్ ప్రక్రియ.. జరిగిన లోటు పాట్లకు సంబంధించి వన్ మ్యాన్ కమిటీ అధ్యయనం చేయనుంది.
AKP: ఉద్యోగుల సమ్మెతో కోటవురట్ల పీఏసీఎస్ కార్యాలయం మూతపడింది. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మెకు దిగారు.హెచ్ఆర్ పాలసీని, జీవో36ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వేతనాల పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2019 తర్వాత నియమితులైన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. రిటైర్మెంట్ వయసు 62కు పెంచాలని సమ్మెకు దిగారు.
BPT: జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి 7,443 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్, ప్రైవేట్ షాపుల్లో నిల్వలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. 45 కిలోల యూరియా బస్తా ధరను రూ. 266.50గా నిర్ణయించామని, ఎవరైనా అంతకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
HYD: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను నాంపల్లి కోర్టు మూడోసారి వెనక్కి పంపింది. అల్లు అర్జున్‌తో సహా 23 మందిని నిందితులుగా పేర్కొన్న ఈ పత్రాల్లో హార్డ్ డిస్కులు, సీడీలు, పెన్ డ్రైవ్‌లు వంటి కీలక సాంకేతిక ఆధారాలు జతపరచలేదని కోర్టు గుర్తించింది. ఈ సాంకేతిక లోపాలను సరిదిద్దాలని ఆదేశిస్తూ చార్జిషీట్‌ను రిటర్న్ చేసింది.
KMM: మధిర మండలం సిరిపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు దుంప వెంకటేశ్వర్ రెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. వైద్యులు కే. అప్పారావు ఆధ్వర్యంలో రోగులకు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
WGL: దుగ్గొండి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం కలెక్టర్ సత్య శారద సందర్శించి, పీఎంశ్రీ పథకం కింద మంజూరైన నిధుల వినియోగం, మౌలిక సదుపాయాల అభివృద్ధిని పరిశీలించారు. తరగతి గదులు, వంటశాల, భోజనశాల, సైన్స్ ల్యాబ్, ఏటీఎల్ ల్యాబ్, గ్రంథాలయం, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఉత్తమ విద్యా వాతావరణం కల్పించాలన్నారు.
KNR: శుక్రవారం సభల్లో అంగన్వాడి, వైద్య సిబ్బంది ద్వారా నివేదిక తెప్పించుకుని ప్రజారోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. చొప్పదండి మండలం చాకుంట అంగన్వాడి కేంద్రం ఆవరణలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. తల్లీపిల్లల ఆరోగ్యానికి సరైన పోషణ ఎంతో అవసరమన్నారు.
ADB: కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణతో పని చేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆత్మ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సంతోష్ రావును శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. సంతోష్ రావు పనిపట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు.
మానసిక ఒత్తిడి నేడు అందరినీ వేధిస్తున్న సమస్య. నిరంతర ఆలోచనలు రక్తపోటును పెంచి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ 10 నిమిషాలు ధ్యానం చేయండి. మీకు ఇష్టమైన సంగీతం వినడం లేదా పుస్తకాలు చదవడం వల్ల మెదడు రిలాక్స్ అవుతుంది. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందడం మానేసి, ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం అలవాటు చేసుకుంటే మనసు తేలికపడి ఆయుష్షు పెరుగుతుంది.
RR: నందిగామ మండలం తాళ్లగూడ గ్రామంలో హెచ్ఎండీఏ నిధుల ద్వారా రూ.10 లక్షల వ్యయంతో చేపట్టిన అండర్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి మౌలిక వసతులు అత్యంత కీలకమని, సీసీ రోడ్డు, డ్రైనేజ్, రోడ్ల అభివృద్ధి ద్వారా గ్రామ ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందన్నారు.
BDK: మణుగూరు సింగరేణి ఏరియా పీవీ కాలనీలో నిర్వహించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఇవాళ ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, స్వామివారి ఆశీస్సులతో కార్యక్రమం విజయవంతం కావాలని కమిటీ సభ్యులు తెలిపారు.
KMR: కామారెడ్డిలో రాజకీయ వేడి రాజుకుంది. తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి కాంగ్రెస్ నాయకులకు బహిరంగ సవాల్ విసిరారు. కళాశాల ఆస్తుల వ్యవహారంపై నిజానిజాల నిర్ధారణకు శనివారం స్థానిక శిశుమందిర్ పాఠశాల వద్దకు చర్చకు రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత సంస్థల యాజమాన్యాలు కూడా పాల్గొంటాయని పేర్కొన్నారు.
పార్వతీపురం ఐటీడిఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం కొమరాడ మండలంలో ఉన్న పలు గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం పాఠశాలలో అమలవుతున్న వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు.
VSP: పరిశుభ్రతపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు జీవీఎంసీ ఆధ్వర్యంలో కోట నరవ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘ప్రామిస్ ఫర్ క్లీన్ వైజాగ్’ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పీ. నల్లనయ్య పాల్గొని మాట్లాడుతూ.. తడి–పొడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం వంటి అంశాలపై సూచనలు ఇచ్చారు.
బాబర్ పేరుతో మసీదులు, మతపరమైన కట్టడాల నిర్మాణం, నామకరణాన్ని నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో బాబ్రీ మసీదు ప్రతిరూపం నిర్మిస్తామన్న టీఎంసీ MLA వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది. అయితే, ధర్మాసనం విముఖత చూపడంతో పిటిషనర్లు తమ విన్నపాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ అంశంపై జోక్యానికి న్యాయస్థానం నిరాకరించడం గమనార్హం.