• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విద్యార్థులకు ఆరోగ్య శిబిరం ఏర్పాటు

SDPT: బెజ్జంకి మోడల్ స్కూల్ హాస్టల్‌లో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై సూచనలు అందించి, చేతులు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేయాలన్నారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. కంజంక్టివైటిస్ వ్యాధి లక్షణాలు, వ్యాప్తి విధానం, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డా. మాధురి, సులోచన, సిస్టర్ అనిత ఉన్నారు.

February 20, 2026 / 02:12 PM IST

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకుడు

NGKL: కల్వకుర్తి పట్టణానికి చెందిన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తలసాని ప్రసాద్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు బృంగి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.

February 20, 2026 / 02:12 PM IST

ఇందిరమ్మ గృహంతో నెరవేరిన కల

BHNG: రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో మమత గణేష్ దంపతుల ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే వేముల వీరేశం ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, నకిరేకల్ నియోజకవర్గానికి తొలి విడతగా 3,500 ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి విడతల వారీగా ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

February 20, 2026 / 02:11 PM IST

‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అవార్డు’కు ఎంపిక

NLG: కనగల్ చెందిన సామాజిక సేవకురాలు డా. కంబాల శివలీల ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అవార్డు-2026’కు ఎంపికయ్యారు. గత 12 ఏళ్లుగా ఆమె చేస్తున్న సామాజిక సేవలను గుర్తిస్తూ వాజ్‌పేయి-అద్వాని సేవా సంస్థ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నెల 22న ఉయ్యాలవాడ వర్ధంతి సందర్భంగా ఆన్‌లైన్ ద్వారా ఈ అవార్డును అందజేయనున్నారు. సంస్థ వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

February 20, 2026 / 02:11 PM IST

‘రాజ్యాంగంపై పౌరులు అవగాహన కల్పించుకోవాలి’

VZM: ప్రతిఒక్కరూ విధిగా తమ విధులు బాధ్యతలను తెలుసుకోవాలని గజపతినగరం జడ్జి ఏ.విజయ రాజ్‌ కుమార్‌ సూచించారు. శుక్రవారం స్దానిక బోడసింగిపేటలో ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా ఆవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా రాజ్యాంగంపై పౌరులు అవగాహన కల్పించుకోవాలని చట్టాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 02:10 PM IST

సైబర్ నేరగాల పట్ల జాగ్రత్తగా ఉండాలి: ఎస్సై

KDP: ఎన్నికల సమయంలో ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ముద్దనూరు ఎస్సై ఎన్. మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాడు ముద్దునూరు మండలం కండ్లోపల్లి గ్రామంలో సైబర్ నేరాలు, మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఎవరైనా అనుమాన వ్యక్తులు కనబడితే 112కి సమాచారం అందించాలని ఎస్సై తెలిపారు.

February 20, 2026 / 02:10 PM IST

ఒవైసీ బ్రదర్స్‌కి రాజాసింగ్ సవాల్

TG: MIM కీలక నేతలు ఓవైసీ బ్రదర్స్‌పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీకి 15 నిమిషాలు ఇస్తే హిందువులు లేకుండా చేస్తాను అన్నారని గుర్తు చేశారు. వారికి 15 గంటలు, 15 రోజులు, 15 నెలలు ఇచ్చినా ఏం చేయలేరని ఎద్దేవా చేశారు. కానీ,  తమకు ఐదు నిమిషాలు ఇచ్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఎక్కడకి రావాలో చెప్పు అని సవాల్ విసిరారు.

February 20, 2026 / 02:10 PM IST

‘అభివృద్ధిపై చర్చకు సిద్ధం’

SRCL: వేములవాడ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని బీఆర్ఎస్ నేతలు నిమ్మశెట్టి విజయ్, కందుల క్రాంతికుమార్, వెంగళ శ్రీకాంత్ గౌడ్ సవాల్ విసిరారు. వేములవాడలో వారు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. వేములవాడలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. BRS పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ లక్ష్మీనరసింహారావుపై ఆరోపణలు చేస్తే ఊరుకోమని అన్నారు.

February 20, 2026 / 02:07 PM IST

విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న పరిటాల శ్రీరామ్

సత్యసాయి: ధర్మవరం రూరల్ మండలం మల్లాకాల్వ గ్రామంలో నిర్వహించిన లక్ష్మీనరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన స్వామివారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో జరిగిన ప్రతిష్ఠాపన వేడుకలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

February 20, 2026 / 02:07 PM IST

చెన్నై నుంచి ముంబైకి ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టిన ప్రభాస్

‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రబృందంతో ముచ్చటించిన ప్రభాస్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తాను అప్పుడప్పుడు వేరే రాష్ట్రాల నుంచి ఫుడ్ ఆర్డర్ పెడతానని చెప్పాడు. ‘ఆదిపురుష్’ షూటింగ్ ముంబై‌లో జరుగుతున్నప్పుడు చెన్నై నుంచి ఫుడ్ ఆర్డర్ చేశానని, టీం అంతా షాక్ అయిందని అన్నాడు. ఫ్లైట్‌లో ఆర్డర్ తీసుకొచ్చిన వ్యక్తి ‘మీరు మాములు వాళ్లు కాదండి అన్నాడు’ అని చెప్పాడు.

February 20, 2026 / 02:06 PM IST

సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

WGL: లంబాడ బంజారా ఆధ్యాత్మిక గురువైన సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు బంజారా జేఏసీ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ బోధనలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు, నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:06 PM IST

మదనపల్లిలో రూ. 60 లక్షల భూ అగ్రిమెంట్ వివాదం

అన్నమయ్య: మదనపల్లిలో భూ విక్రయ వ్యవహారం వివాదాస్పదమైంది. ఎస్బీఐ కాలనీకి చెందిన శ్రీరాములు, డీకే తేజస్విని పేరుపై ఉన్న రెండు ఎకరాల భూమిని అమ్ముతామని చెప్పి రూ.60 లక్షలకు అగ్రిమెంట్ చేసుకుని మోసం చేశారని శుక్రవారం బాధితుడుఆరోపించారు. కే. అమర్నాథ్ 2022 నుంచి డబ్బు విషయంలో ఇబ్బందులు పెడుతున్నాడని, డబ్బు అడిగితే రౌడీలతో బెదిరిస్తున్నాడని వాపోయారు.

February 20, 2026 / 02:05 PM IST

భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొంది. హిందూ సాంప్రదాయం ప్రకారం.. మంచి రోజులు ప్రారంభం కావడంతో వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు భీమేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని తరించారు. ప్రధానంగా చిన్నారుల పుట్టు వెంట్రుకలు, ఇతర శుభ కార్యాల సందర్భంగా రద్దీ ఏర్పడింది. భీమేశ్వరాలయంలో అభిషేకం, అన్న పూల్లో పాల్గొన్నారు.

February 20, 2026 / 02:05 PM IST

నగరంలో ఈనెల 24న నీటి సరఫరా బంద్

KNR: కరీంనగర్ నగరంలోని ఫిల్టర్ బెడ్ వద్దగల 14 MLD సామర్థ్యంగల నీటి సరఫరా వాల్వ్ మరమ్మతుల కారణంగా ఈనెల 24వ తేదీ (మంగళవారం)న నగరం అంతటా తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అలాగే నీటిని పొదుపుగా వాడుకోవాలని, నగరపాలక సంస్థకు సహకరించాలన్నారు.

February 20, 2026 / 02:05 PM IST

అమరావతికి మణిహారంగా ఇన్నర్ రింగ్ రోడ్డు

GNTR: రాజధానిలో రూ.40,847 కోట్ల భారీ వ్యయంతో ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించింది. 96.2 కిలోమీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పుతో రూపొందుతున్న ఈ రహదారిని 8+4 వరుసలుగా డిజైన్ చేశారు. ఇందులో ప్రధాన ప్రయాణం కోసం 8 వరుసల రహదారి ఉండగా, స్థానిక రవాణా అవసరాల కోసం అదనంగా మరో 4 వరుసల సర్వీస్ రోడ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.

February 20, 2026 / 02:05 PM IST