సత్యసాయి: లేపాక్షి మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన రజిని (19) కనిపించడం లేదని తల్లి నాగమ్మ, తండ్రి ఆదినారాయణలు తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. బంధువులు, గ్రామస్తులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ సమాచారం లభించలేదు. ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే 9676852213 నంబర్‌కు తెలపాలని కోరారు.
వేసవి రాకముందే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిన్న నందిగామ, కర్నూలులో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. విశాఖ, తుని, నరసాపురం, బాపట్ల తదితర ప్రాంతాల్లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3.5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
HNK: ఐనవోలు మండలం కేంద్రంలోని ఐనవోలు గ్రామ సర్పంచ్ గడ్డం వంశీ కృష్ణా ఆదివారం గ్రామంలో వచ్చే వేసవి కాలంలో నీటి సమస్యలు రాకుండా చూసే విధంగా వార్డు సభ్యులతో కలిసి గ్రామంలోని నిరూపయోగంగా ఉన్న నీటి ట్యాంక్‌లను పరిశీలించారు. ఈ సందర్భంలో ట్యాంక్‌ల పరిస్థితి, పరికరాలు, అవసరమైతే మరమ్మతులు, శుభ్రత వంటి అంశాలను గమనించారు. సర్పంచ్ వంశీకృష్ణా తెలిపారు.
CTR: బంగారుపాళ్యం మండలం గౌరీ నారాయణపురంకు చెందిన పండు (42) ప్రమాదవశాత్తు మొగిలి కోనేరులో పడి మృతి చెందాడు. శనివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈనెల 19 లేదా 20న కోనేరులో పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు. బాధితుడి భార్య ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసినట్లు బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.
TG: భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి అడవుల్లో పెద్దపులి సంచరించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పులి పాదముద్రలను గుర్తించారు. అనంతోగు నుంచి పాల్వంచ అడవుల్లోకి వెళ్లే అవకాశం ఉందన్నారు. పులి సంచారంతో గుత్తికోయ గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
VSP: మునగపాక మండలం తోటాడలో నూతనంగా నిర్మించిన మరిడిమాంబ అమ్మవారి ఆలయాన్ని ఆదివారం ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. భక్తుల విరాళాలతో ఆలయాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు. ఆలయం ప్రారంభం సందర్భంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించనున్నట్లు తెలిపారు.
పల్నాడు: నరసరావుపేటలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ.230 నుంచి రూ.260, స్కిన్‌తో రూ.220 నుంచి రూ. 240 వరకు అమ్ముతున్నారు. లైవ్ కోడి రూ.115. మటన్ కేజీ రూ. 900 నుంచి 1000 వరకు ఉంది. 100 కోడి గుడ్లు రూ. 530కి విక్రయిస్తున్నారు. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.
కృష్ణా: విశాఖపట్నం నుండి మచిలీపట్నం వెళ్లే రైలులో మహాలక్ష్మి అనే ప్రయాణికురాలు తన హ్యాండ్ బ్యాగ్‌ను భీమవరం రైల్వే స్టేషన్‌లో నిన్న మర్చిపోయారు. అనంతరం ఆమె పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై మహబూబ్ షరీఫ వెంటనే అప్రమత్తమై హ్యాండ్ బ్యాగులో ఉన్న 110 బంగారు ఆభరణాలు, ఒక మొబైల్ ఫోన్, రూ.5000 నగదు బాధితురాలికి ఎస్సై నిన్న అందజేశారు.
TG: యాదగిరిగుట్టపై శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం శ్రీకృష్ణాలంకారంలో నరసింహస్వామి మురళీకృష్ణుడిగా దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా రాత్రికి స్వామివారికి పొన్న వాహనసేవ నిర్వహించనున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
శ్రీకాకుళం: నేటి స్థానిక మార్కెట్‌లో చికెన్ ధరలు సుమారు స్థిరంగానే ఉన్నట్లు మార్కెట్ డేటా ప్రకటిస్తోంది. వ్యాపారుల సమాచారాల ప్రకారం కేజీ స్కిన్ చికెన్ సుమారు ₹265కు, స్కిన్‌లెస్ సుమారు ₹270కు, బోన్‌లెస్ చికెన్ సుమారు ₹275 కు విక్రయింపబడుతున్నాయి, మరియు షాపులివ్వే రేట్లు కొంచెం తేడాలతో మారవచ్చని సూచనలున్నాయి.
TG: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి, సజీవ దహనం చేశారు. మృతుడు టోలిచౌకి ప్రాంతానికి చెందిన అమీర్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
CTR: పలమనేరు ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగిందని ప్రాథమికంగా గుర్తించిన అధికారులు APO రవికుమార్‌ను సస్పెండ్ చేశారు. అసిస్టెంట్లకు షోకాస్ నోటీసులను జారీ చేశారు. ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసి, FIR నమోదు చేసినట్లు సమాచారం. సమగ్ర విచారణ అనంతరం.. ఈ అంశంలో ఎంత మేర ప్రభుత్వ నిధులు ప్రజలకు అందకుండా స్వాహా చేశారో తేలనుంది.
MDK: చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన తూప్రాన్ మండలం ఇమాంపూర్‌లో చోటుచేసుకుంది. స్థనికుల వివరాలు.. గ్రామానికి చెందిన రైతు అల్లాడి శంకర్ (40) నిన్న సాయంత్రం పొలానికి మందులు చల్లి స్నానం చేసేందుకు చెరువులో దిగి గల్లంతయ్యాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చెరువు వద్ద గాలించారు. ఆదివారం ఉదయం చెరువులో శవమై తేలాడు. భార్య లావణ్య, ఇద్దరు సంతానం ఉన్నట్లు తెలిపారు.
WGL: జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిన్న సాయంత్రం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. వేసవికాలం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి100, నుంచి 150 లీ, మంచినీరు సరఫరా చేయాలని అధికారులకు ఆదేశించారు.
TG: కామారెడ్డి జిల్లా బాన్సువాడ వెళ్లకుండా తనను హౌస్ అరెస్ట్ చేశారని బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అన్నారు. ‘బాన్సువాడలో మా MLAపై దాడి జరిగింది. మా MLA తప్పు చేస్తే నిరూపించండి. మేమే యాక్షన్ తీసుకుంటాం. కాంగ్రెస్ నేతలే కారు ధ్వంసం చేసి.. BJP నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. మా కార్యకర్తలు మా కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బాన్సువాడ వెళ్లి తీరుతాం’ అని పేర్కొన్నారు.