• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘లడ్డూ వ్యవహారంపై విషం చిమ్మాలని చూస్తున్నారు’

AP: లడ్డూ వ్యవహారంపై టీడీపీ నేతలు విషం చిమ్మాలని చూస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుమల లడ్డూపై చేసిన వ్యాఖ్యలకు.. సీఎం చంద్రబాబును సుప్రీం మందలించిందన్నారు. దేవాలయం లాంటి శాసనసభ, మండలిలోకి.. దేవుళ్ల చిత్రపటాలను ఎందుకు తీసుకెళ్లకూడదని ప్రశ్నించారు. చంద్రబాబు బూట్లు వేసుకునే శ్రీవారి విగ్రహాలు పలువురికి కానుకగా ఇచ్చారని విమర్శించారు.

February 22, 2026 / 12:05 PM IST

ముగిసిన మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం

TG: మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం ముగిసింది. అగ్రనేతలు దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి సరెండర్ కావడం, వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఉనికి కోల్పోయింది. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సాయుధ పోరాటానికి ముగింపు పలికింది. ఆపరేషన్ కగార్‌లో వందలమంది మావోయిస్టులు హతమయ్యారు. మార్చి 31కల్లా ఆపరేషన్ కగార్‌కు కేంద్రం గడువు ఇచ్చింది.

February 22, 2026 / 12:05 PM IST

కోతుల పెరుగుదలపై గ్రామస్తుల ఆందోళన

VKB: దోమలో కోతులు స్వేచ్ఛగా తిరుగుతూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. స్కూల్‌కు వెళ్తున్న పిల్లలు, రోడ్లపై నడిచే వాహనదారులు కోతుల దాడులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుంపులుగా తిరిగే కోతులు ఇళ్లలోకి చొరబడి నిత్యవసర సరుకులు తీసుకెళ్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. స్థానికులు అధికారులు వెంటనే స్వైర విహారాన్ని నియంత్రించాలని కోరుతున్నారు.

February 22, 2026 / 12:03 PM IST

‘రైతు సంక్షేమానికి పెద్దపీట’

HNK: రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. ఆయిల్ ఫామ్ సాగుచేస్తున్న రైతులతో రాఘవరెడ్డి సమావేశమయ్యారు. రైతులు అధిక దిగుబడులు సాధించడానికి శాస్త్రీయ పద్ధతులు, సమయానుకూల ఎరువుల వినియోగం, నీటి నిర్వహణపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. అనంతరం క్యాలెండర్ ఆవిష్కరించారు.

February 22, 2026 / 12:03 PM IST

స్వచ్ఛత దిశగా అట్టేపల్లి రామప్రభు ముందడుగు

RR: మియాపూర్‌లోని 240వ డివిజన్ పెబుల్స్ బే నుంచి ప్రశాంత్ నగర్ రోడ్డు వరకు ఆదివారం ఉదయం అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, ప్రజల్లో తడి-పొడి చెత్త వేర్పాటుపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అట్టేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ రామప్రభు తెలిపారు.

February 22, 2026 / 12:01 PM IST

జిల్లాలో డిజిటల్ సర్వేకు వాలంటీర్ల నియామకం

BHPL: భూపాలపల్లి జిల్లాలో రైతుల సాగు భూముల వివరాలు డిజిటల్ సర్వే చేసేందుకు ప్రభుత్వం వాలంటీర్లను నియమిస్తోంది. రెవెన్యూ గ్రామానికి ఒకరు చొప్పున 12 మండలాల్లో 186 మందిని నియమించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా వ్యవసాయ అధికారి (DAO) బాబురావు తెలిపారు. భవిష్యత్తులో పంటల నమోదు డిజిటల్ విధానంలో జరుగుతుందని DAO బాబురావు వెల్లడించారు

February 22, 2026 / 12:01 PM IST

‘ఝాన్సీ రెడ్డిపై తిరుపతి రెడ్డి వ్యాఖ్యలు మానుకోవాలి’

MHBD: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిపై ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని కాంగ్రెస్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అమీజ్ పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డిలు నిస్వార్ధంగా పని చేస్తున్నారని అన్నారు.

February 22, 2026 / 12:01 PM IST

వైసీపీ నాయకులపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే

ATP: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు. శాసనమండలిలో శ్రీవారి చిత్రపటాలను చెప్పుల కాళ్లతో తాకి అపవిత్రం చేశారని మండిపడ్డారు. ఆదివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. రసాయనాలతో కూడిన నెయ్యిని ఉపయోగించి కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు.

February 22, 2026 / 12:01 PM IST

మసీదుల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య పనులు

NLR: బుచ్చిరెడ్డిపాళెం పట్టణం ఖాజా నగర్‌లో ఉన్న ఉర్దూ పాఠశాల, మసీదుల వద్ద చెత్తా అపరిశుభ్రంగా ఉన్నాయి. దీంతో స్థానిక ప్రజలు నగర కమిషనర్ బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు నాయకులు దగ్గరుండి చెత్తా తొలగించి మసీదు వద్ద శానిటేషన్ పనులు చేశారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

February 22, 2026 / 12:00 PM IST

మహిళలను వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్

సత్యసాయి: కదిరిలో టాటూ షాపు నిర్వహిస్తూ మహిళలను వేధిస్తున్న పవన్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. జల్సాల కోసం నాటు సారా విక్రయిస్తున్నట్లు గుర్తించి అతని నుంచి స్కూటీ, నిషేధిత సారాను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి సబ్ జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించారు. అలాగే అతనిపై రౌడీ షీట్ తెరిచేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

February 22, 2026 / 12:00 PM IST

‘ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే’

ప్రకాశం: ఉగాది ఉత్సవాలను పురస్కరించుకొని మార్కాపురం శివారులో వెలసిన శ్రీ అల్లూరి పోలేరమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఆదివారం కావడంతో భక్తులు రద్దీ అధికంగా ఉండడంతో పోలీసులు పట్టిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

February 22, 2026 / 12:00 PM IST

కామారెడ్డి, బాన్సువాడలో 163 సెక్షన్: SP

KMR: శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడలో 163 BNSS (పాత సెక్షన్ 144) అమలు చేస్తున్నట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం, ఆయుధాలు ధరించడం నిషేధమని హెచ్చరించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, పోలీసు విధి నిర్వహణ, అత్యవసర వైద్య సేవలకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందన్నారు.

February 22, 2026 / 11:57 AM IST

క్యాతనపల్లిలో కొనసాగుతున్న BRS, కాంగ్రెస్‌ల ఆరోపణలు

TG: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆరోపణల పర్వం కొనసాగుతోంది. సింగరేణి అధికారులను తమపై అస్త్రంగా వాడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఇళ్లను కబ్జా పేరుతో స్వాధీనం చేసుకుంటున్నారని, సీపీఐ కౌన్సిలర్లపై ఇదే ప్రయోగం చేస్తున్నారని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. అయితే, తమకు ఆ అవసరం లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

February 22, 2026 / 11:57 AM IST

రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు. అలాగే, GHMC ఎన్నికలతో పాటు MPTC, ZPTC ఎన్నికలపై చర్చిస్తారు. రైతు భరోసా నిధుల విడుదలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెట్రో తొలి దశ టేకోవర్‌పైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

February 22, 2026 / 11:57 AM IST

నో హెల్మెట్-నో పెట్రోల్: కలెక్టర్

భువనగిరి: జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు కలెక్టర్ హనుమంతరావు కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చారు. ఇకపై హెల్మెట్ లేని బైక్‌లకు పెట్రోల్ పోయకూడదని బంక్ యాజమాన్యాలను‌ ఆదేశించారు. ప్రతి బంక్ వద్ద హెల్మెట్ ఆవశ్యకతపై అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

February 22, 2026 / 11:55 AM IST