• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పిచ్చికుక్క దాడిలో పలువురికి గాయాలు

CTR: పలమనేరులో శనివారం ఓ పిచ్చి కుక్క పలువురిని కరిచి గాయపరిచింది. RK వీధిలో మనుషులపై దాడి చేసింది. ఏడుగురుకు పైగా గాయపడటంతో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పిచ్చి కుక్కను మున్సిపల్ సిబ్బంది బందించే ప్రయత్నం చేయగా వారిపై సైతం దాడి చేయడంతో కొట్టి చంపేశారు.

February 21, 2026 / 12:35 PM IST

నందిగామ ఇంచార్జ్ ఏసీపీగా లలిత కుమారి నియామకం

NTR: నందిగామ ఏసీపీ బాలగంగాధర తిలక్ కొద్ది రోజులపాటు బదిలీ అయ్యారు. గత ఏడాదిన్నరగా నందిగామ సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా పనిచేసిన ఆయనను డీజీపీ కార్యాలయంలో సీఐడీ విభాగానికి అటాచ్ చేస్తు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విజయవాడ టాస్క్ ఫోర్స్ ఏసీపీ లలిత కుమారిని నందిగామ ఇంచార్జ్ ఏసీపీగా నియమించారు. అనంతరం సిబ్బంది ఆమెకు ఘన స్వాగతం పలికారు.

February 21, 2026 / 12:35 PM IST

అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా

NRML: లక్ష్మణచందా మండలంలోని బోరిగాం-కంజర్ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది. ట్రాక్టర్ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే కిందకు దూకేయడంతో త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో క్షతగాత్రునికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వాహనాన్ని మైనర్ నడుపుతున్నట్లు సమాచారం. ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

February 21, 2026 / 12:35 PM IST

ప్యాపిలి బస్టాండ్‌లో సౌకర్యాలపై ఎమ్మెల్యే సమీక్ష

NDL: ప్యాపిలి బస్టాండ్‌లో పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై డిపో మేనేజర్‌తో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి చర్చించారు. వాహనాల నిలుపుదలకు తగిన స్థలం కేటాయించాలని, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. బస్టాండ్ పరిసరాల్లోని సీసీ కెమెరాల పనితీరును స్వయంగా పరిశీలించారు. భద్రత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు.

February 21, 2026 / 12:33 PM IST

ఉగ్రకుట్ర కేసు.. NIA అనుబంధ ఛార్జిషీట్

AP: విజయనగరం ఉగ్రకుట్ర కేసులో ఎన్ఐఏ (NIA) కీలక అడుగు వేసింది. ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబు తాలిబ్, పరారీలో ఉన్న ఇమ్రాన్ అక్రమ్‌లపై అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. వీరిపై బీఎన్ఎస్, పేలుడు పదార్థాల చట్టం, మరియు UAPA లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఉగ్ర కార్యకలాపాల నిరోధమే లక్ష్యంగా దర్యాప్తు కొనసాగుతోంది.

February 21, 2026 / 12:32 PM IST

పోలీస్ స్టేషన్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్

ELR: భీమడోలు పోలీస్ స్టేషన్‌లో శనివారం సిబ్బంది స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమమును నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణాలను పరిశుభ్రం చేశారు. పనిచేసే వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం సిబ్బంది ఆరోగ్యానికి మేలు చేస్తుంది సిబ్బంది ఆరోగ్యపరంగా మానసికపరంగా దృఢంగా ఉంటే ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి ఆస్కారం ఉంటుందని సిబ్బంది వివరించారు.

February 21, 2026 / 12:32 PM IST

కల్వకుర్తి మున్సిపాలిటీలో పొలిటికల్ వార్

NGKL: జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు విమర్శలకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. ముఖ్యంగా ‘ఏఐ’ (Al) సాంకేతికతతో ప్రత్యర్థుల పాత వీడియోలను సృష్టించి ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. ఈ ‘డిజిటల్ వార్’ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

February 21, 2026 / 12:31 PM IST

కార్యకర్తకు సొంత నిధులతో ఇల్లు కట్టించిన ఎమ్మెల్యే

ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మానవత్వాన్ని చాటుకున్నారు. కుందుర్పి మండలం మలయనూరు పర్యటనలో తన నివాసానికి పక్కా ఇల్లు లేదని కంటతడి పెట్టిన దళిత కార్యకర్త కెంచన్నకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రభుత్వం నుంచి నిధుల కోసం వేచి చూడకుండా, తన సొంత నిధులు రూ. 2 లక్షలు వెచ్చించి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయించారు.

February 21, 2026 / 12:31 PM IST

YCP నేతలకు TTD లీగల్ నోటీసులు!

నిన్న శాసనమండలిలో YCP ఎమ్మెల్సీలు అవలంభించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు TTD బోర్డ్ మెంబర్ భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. శ్రీవారిని అవమానించేలా ప్రవర్తించిన నేతలకు TTD నుంచి లీగల్ నోటీసులు పంపుతామని హెచ్చరించారు. జగన్ కోసం YCP సభ్యుల దైవద్రోహానికి పాల్పడ్డారని మండిపడ్డారు. చెప్పులు వేసుకుని స్వామివారి చిత్రపటాలను ప్రదర్శించడమేంటంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

February 21, 2026 / 12:30 PM IST

‘ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి’

KMM: ప్రభుత్వ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రాగమయి తెలిపారు. తల్లాడ మండల పరిధిలోని అంజనాపురం గ్రామంలో నూతన నిర్మించిన ఇందిరమ్మ గృహాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ దయానంద్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాహసీల్దార్ టి. కర్ణాకర్ రెడ్డి, ఎంపీడీవో శ్రీధర్ రాజు, ఎంపీవో ఏనుగు సురేష్ బాబు, హౌసింగ్ ఏఈ పాల్గొన్నారు.

February 21, 2026 / 12:30 PM IST

బాన్సువాడలో ప్రశాంతత.. పుకార్లను నమ్మవద్దు: SP

KMR: బాన్సువాడలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని SP రాజేశ్ చంద్ర స్పష్టం చేశారు. నిన్న జరిగిన సంఘటనపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేసి, లోతైన దర్యాప్తు జరుపుతున్నారన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని SP పేర్కొన్నారు.

February 21, 2026 / 12:28 PM IST

‘గ్రంథాలయంలో వసతులు కల్పించాలి’

SRPT: నడిగూడెం మండలం కేశవపురంలో ఇంటి పన్నుతో పాటు గ్రంథాలయ పన్ను వసూలు చేస్తున్న అధికారులు వసతుల కల్పనలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని బీజేపీ నాయకులు, నిరుద్యోగులు ఆరోపించారు. కనీసం దినపత్రికలు కూడా లేకపోవడంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. వెంటనే గ్రంథాలయంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు.

February 21, 2026 / 12:27 PM IST

ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

రచ్చమల్లపాడు ఉన్నత పాఠశాలలో శనివారం అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అరుణకుమారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భాష అనేది కేవలం సంభాషణ సాధనం మాత్రమే కాకుండా ఒక జాతి సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను సంరక్షించే అత్యంత కీలకమైన ఆధారం అని తెలిపారు. మాతృభాషను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు

February 21, 2026 / 12:27 PM IST

‘మొదటి ప్రయత్నంలోనే సాధించడం అభినందనీయం’

ప్రకాశం: ఇటీవల గ్రూప్ -1కు ఎంపికైన విజేతలకు APUWJ ఆధ్వర్యంలో మార్కాపురం ప్రెస్ క్లబ్లో శనివారం అభినందన సభ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, అధ్యక్షులు ఐ వి సుబ్బారావు హాజరై, వారిని అభినందించారు. మొదటి ప్రయత్నంలోనే అత్యంత ఉన్నత ఉద్యోగాన్ని సాధించడం అభినందనీయమనీ కొనియాడారు. కార్యక్రమంలో జేసీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

February 21, 2026 / 12:26 PM IST

రాములబండ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

NLG: నల్గొండ మండలంలోని రాములబండ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి మార్చి మూడవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఇవాళ తోరణం, 22న అధ్యయన ఉత్సవాలు, 23న పరమపదోత్సవం, మార్చి 1న రథయాత్ర జరుగుతుందని ఆలయ కమిటీ వివరించింది. భక్తులు పాల్గొని ఆ స్వామి వారిని దర్శించుకోవాలని కోరారు.

February 21, 2026 / 12:25 PM IST