• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వివాహ వేడుకల్లో దారుణ హత్య

PDPL: రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్ వద్ద శనివారం విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుకకు హాజరైన మొలుగూరి కొమురయ్య (58)ను గేటు ముందే గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 21, 2026 / 08:24 PM IST

కొనసాగుతున్న జలమండలి బస్తీబాట

HYD: నీటిని పొదుపుగా వాడుకోవడం అందరి బాధ్యత అని జలమండలి ఎండి అశోక్ రెడ్డి అన్నారు. జలమండలి బస్తిబాట కార్యక్రమంలో భాగంగా ఉప్పాలగూడలోని సెక్రటేరియట్ కాలనీ, శ్రీనగర్ కాలనీ ప్రాంతంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో కొంతమంది తాగునీటిని వృధా చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు నీటిని కాపాడుకునేందుకు వారి వంతు ప్రయత్నం చేయాలన్నారు.

February 21, 2026 / 08:24 PM IST

రాష్ట్రానికి దిక్సూచి చంద్రబాబు

VSP: సీఎం చంద్రబాబు ఐటీ విప్లవం నుంచి నేటి ఏఐ-క్వాంటం యుగం వరకు రాష్ట్రానికి దిక్సూచిగా నిలిచారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. విశాఖను గ్లోబల్ ఏఐ హబ్ మార్చడంలో గూగుల్ CEO సుందర్ పిచాయ్ ప్రశంసలు, 7 కీలక ఒప్పందాలు రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలు మాట్లాడారు.

February 21, 2026 / 08:23 PM IST

సకాలంలో ఇంటి పన్నులు చెల్లించాలి: కలెక్టర్

E.G: జిల్లాలోని గ్రామపంచాయితీల్లో ఇంటి పన్నులు, పన్నేతర బకాయిలను సకాలంలో చెల్లించి గ్రామాల అభివృద్ధికి ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. జిల్లాలోని 342 గ్రామపంచాయితీల్లో ప్రస్తుతం ఇంటి పన్నులు, పన్నేతరముల బకాయిలు రూ. 125. 11 కోట్లుగా ఉన్నాయని, ఇందులో ఇప్పటివరకు రూ. 54. 00 కోట్లు వసూలైనట్లు వెల్లడించారు.

February 21, 2026 / 08:23 PM IST

విషాదం.. యువకుడు సూసైడ్

NGKL: కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మార్చాలకు చెందిన సాయిప్రసాద్ (23) కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల అతడు స్వగ్రామానికి వచ్చాడు. శనివారం గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

February 21, 2026 / 08:21 PM IST

తిరుపతిలో స్వర్ణోత్సవ వేడుకలు

CTR: కరకంబాడి లోని Amara Raja Group ఆడిటోరియంలో కృష్ణదేవరాయ విద్యా సాంస్కృతిక సంఘం స్వర్ణోత్సవ వేడుకలు శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్తో పాటు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, అమర రాజా గ్రూప్ ఛైర్మన్ జయదేవ్ గల్లా, సినీ నటుడు మాగంటి మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 08:21 PM IST

‘జగన్ హిందుత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు’

AP: లడ్డూ కల్తీ విషయంలో మాజీ సీఎం జగన్ అడ్డంగా వాదిస్తున్నారని మంత్రి భరత్ అన్నారు. హిందుత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. వేంకటేశ్వరస్వామితో పెట్టుకున్నవారు బాగుపడలేదన్నారు. జగన్ స్వామివారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

February 21, 2026 / 08:20 PM IST

‘మధుడిలో ఆధార్‌ సేవలు సద్వినియోగం చేసుకోండి’

సత్యసాయి: అగలి మండలం మధుడిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సమీపంలో ఆధార్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆధార్‌ సంబంధించిన బయోమెట్రిక్‌ అప్టేట్‌, ఐరిస్‌ స్కాన్‌, పేరు మార్పులు, ఫొటో అప్డేట్‌, పుట్టిన తేదీ మార్పు, సెల్‌ నంబరు లింక్‌, కొత్తగా ఆధార్‌ కార్డులు ప్రింట్‌ ఇవ్వనున్నట్లు మీ సేవ నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవ...

February 21, 2026 / 08:20 PM IST

పాలిటెక్నిక్ భవన నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

WGL: నగరంలోని మున్నూరు కాపు భవన్ ప్రక్కన పాలిటెక్నిక్ భవన నిర్మాణ పనులను ఇవాళ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధానమంత్రి నెహ్రూ ఆధ్వర్యంలో నిర్మించిన పాలిటెక్నిక్ కళాశాల భవనం మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రూ. 22 కోట్లతో నిధులు కేటాయించి నూతన భవనాలు ఏర్పాటు సంతోషంగా ఉండని ఆయన అన్నారు.

February 21, 2026 / 08:20 PM IST

స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రారంభించిన ఎంపీడీవో

ATP: పామిడి పంచాయతీ నందు శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛంద- స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛరథం వాహనమును ఎంపీడీవో తేజోష్ణ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటిలో నిలువ ఉంచిన డ్రై వెస్ట్ ( ప్లాస్టిక్, పేపర్, తదితర) వస్తువులను ఇవ్వడం ద్వారా వారికి నిత్యవసర సరుకులైన బియ్యం, కందిపప్పు అందజేస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 21, 2026 / 08:20 PM IST

గ్రామస్తులకు రూ. 50 వేలు అందజేసిన ఎమ్మెల్సీ

RR: కొందుర్గు మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామంలో 25- 27వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామస్తులు ఆర్థిక సహాయం కోరగా వెంటనే స్పందించి విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమానికి MLC రూ. 50 వేలు అందజేశారు.దేవాలయాల అభివృద్ధికి సహాయ సహకారాలు ఉంటాయన్నారు.

February 21, 2026 / 08:20 PM IST

బీజేవైఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి

SKLM: బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ధన్నాన మదన్ నేతృత్వంలో శ్రీకాకుళంలోని అరసవిల్లి జంక్షన్‌లో ఇందిరా భవన్ వద్ద బీజేపీ నాయకులు శనివారం సాయంత్రం నిరసన చేపట్టారు. న్యూఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ ఏఐ సదస్సులో కాంగ్రెస్ యూత్ వింగ్ సభ్యుల ప్రవర్తనను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధ్యక్షులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

February 21, 2026 / 08:19 PM IST

T20 WC సూపర్-8: రేపు భారత్ vs సౌతాఫ్రికా

సూపర్-8లో భాగంగా భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య రేపు కీలక పోరు జరగనుంది. 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని సౌతాఫ్రికా భావిస్తోంది. మరోవైపు భారత్ తన విజయాల పరంపరను కొనసాగించాలని పట్టుదలతో ఉంది. కాగా, T20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్‌తో సఫారీలు 7 సార్లు తలపడగా.. 5 సార్లు టీమిండియానే విజయం సాధించింది.

February 21, 2026 / 08:19 PM IST

చిత్తూరు ఎమ్మెల్యే రేపు పర్యటన షెడ్యూల్

CTR: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం పుత్తూరు రోడ్డులో మెడికల్ కోడింగ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభం, పీవీపీఎన్ కళాశాలలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం, ఆఫీస్ బస్టాండ్ వద్ద పార్టీ భవన భూమిపూజ, రాజీవ్ కాలనీలో సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

February 21, 2026 / 08:17 PM IST

సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

HNK: నగరంలోని గిరిజన భవన్‌లో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా సేవాలాల్ చిత్రపటం వద్ద MLA కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పించారు.

February 21, 2026 / 08:17 PM IST