• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కబడ్డీ సీనియర్ నేషనల్స్‌కు తేజ ఎంపిక

VSP: 72వ సీనియర్ నేషనల్ కబడ్డీ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ గంగవరం ప్రాంతానికి చెందిన నోళ్లు తేజ ఎంపికయ్యాడు. ఈ పోటీలు ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు గుజరాత్‌లోని వడోదరలో జరగనున్నాయి. గంగవరం గ్రామానికి చెందిన కనకరావు కుమారుడు తేజ ప్రస్తుతం అదానీ ఫౌండేషన్‌లో స్పోర్ట్స్ కోచ్‌గా పనిచేస్తున్నాడు.

February 21, 2026 / 07:49 PM IST

రంజాన్ ఏర్పాట్లపై మున్సిపల్ ఛైర్మన్ కు వినతి

RR: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా షాద్ నగర్ పట్టణంలో తగిన ఏర్పాట్లు చేయాలని మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బాబర్ అలీ ఖాన్ మున్సిపల్ ఛైర్మన్ బస్వంను కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో వారిని కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. మసీదుల వద్ద వీధి దీపాల ఏర్పాటు, మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు.

February 21, 2026 / 07:48 PM IST

HYD గచ్చిబౌలి స్టేడియంలో హాకీ వరల్డ్ కప్

HYD: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో మార్చి 8 నుంచి 14 వరకు జరిగే FIH హాకీ వరల్డ్ కప్ 2026 క్వాలిఫైయర్స్ కోసం భారత మహిళల సీనియర్ హాకీ జట్టు కీలక పోరాటానికి సిద్ధమైంది. ఈ టోర్నీలో విజయం సాధిస్తేనే వరల్డ్ కప్‌కు అర్హత లభిస్తుంది. వేగవంతమైన దాడులు, కట్టుదిట్టమైన రక్షణ, పెనాల్టీ కార్నర్ మార్పిడి జట్టు విజయానికి ప్రధానంగా మారనున్నాయి.

February 21, 2026 / 07:48 PM IST

‘దోపిడీకి వ్యతిరేకంగా శ్రామికులంతా ఐక్యంగా పోరాడాలి’

ప్రకాశం: కార్మికుల, కష్టజీవుల దోపిడీకి వ్యతిరేకంగా శ్రామికులంతా ఐకమత్యంతో పోరాడాలని సీపీఎం నాయకులు ఊసా వెంకటేశ్వర్లు అన్నారు. చంద్రశేఖరపురం సీపీఎం పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన రెడ్ బుక్స్ డే కారుక్రమంలో భాగంగా చదువుదాం సమాజాన్ని మార్చుదాం అనే అంశం గురించి చర్చించారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికులు, కష్ట జీవులను దోచుకోవడం నేటికీ కొనసాగుతుందన్నారు.

February 21, 2026 / 07:48 PM IST

‘దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి’

BDK: కొత్తగూడెం కార్పొరేషన్ రామవరంలోని షాపుల యజమానులు తమ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని 2 టౌన్ సీఐ డి. ప్రతాప్ ఇవాళ సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాల నియంత్రణకు తోడ్పాటు అందుతుందని, ఏదైనా ఘటన జరిగినప్పుడు నిందితులను త్వరగా గుర్తించేందుకు ఆధారాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.

February 21, 2026 / 07:47 PM IST

ఆర్బీఎస్‌కే సిబ్బందికి సీపీఆర్‌పై శిక్షణ

SRPT: అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన వారి ప్రాణాలను కాపాడడంలో సీపీఆర్ (CPR) కీలకమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. శనివారం ఐడీఓసీలో తొమ్మిది ఆర్బీఎస్‌కే బృందాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిమిషానికి 100-120 సార్లు ఛాతీపై ఒత్తిడి కలిగించడం ద్వారా రక్త ప్రసరణను పునరుద్ధరించవచ్చని ఆయన వివరించారు.

February 21, 2026 / 07:47 PM IST

రేపటి నుంచే కళ్యాణోత్సవం ప్రారంభం

NLG: చండూరు పట్టణంలోని శ్రీ మార్కండేశ్వర స్వామి దేవాలయంలో రేపటి నుంచి శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పూజా కార్యక్రమాలు, ధ్వజారోహణ నిర్వహించనున్నారు. అనంతరం 50 జతల ఎద్దుల శకటంపై చేనేత మగ్గంతో పట్టు వస్త్రాల నేసే కార్యక్రమం, ఊరేగింపు జరుగనున్నాయి.

February 21, 2026 / 07:46 PM IST

పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్న.. గోరికొత్తపల్లి నేతలు

BHPL: రేగొండ(M) కొడవటంచలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం ఇవాళ ఘనంగా నిర్వహించారు. MLA గండ్ర సత్యనారాయణ రావు ఆహ్వానం మేరకు గోరికొత్తపల్లి మండల నాయకులు హాజరై అన్నదానం వడ్డించి సహకరించారు. ఈ కార్యక్రమంలో మండల ఇంఛార్జ్ ఓం ప్రకాష్, NSUI మండల అధ్యక్షుడు రంజిత్, మాజీ వార్డు మెంబర్ కుమార్, నాలుగో వార్డు మెంబర్ అనిల్ పాల్గొన్నారు.

February 21, 2026 / 07:45 PM IST

‘స్కూళ్లకు ముక్కిన బియ్యం ఇస్తే జైలుకే’

NLG: పాఠశాలల మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యతలేని, ముక్కిపోయిన బియ్యం సరఫరా చేస్తే గిడ్డంగులపై కఠిన చర్యలు తప్పవని పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్ హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు తినడానికి అనర్హమైన బియ్యం పంపితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

February 21, 2026 / 07:45 PM IST

డిగ్రీ 5వ సెమిస్టర్ ఫలితాలు విడుదల

SKLM: ఎచ్చెర్లలో ఉన్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ 5వ సెమిస్టర్ ఫలితాలు విడుదలైనట్లు యూజీ పరీక్షల విభాగం డీన్ ఎం. అనురాధ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీబీ, సీఏ. బీబీఏ, బీటెక్ పరీక్షలు సంబంధించి రిజల్ట్ యూనివర్సిటీ నోటీస్ బోర్డులు ఏర్పాటు చేస్తామని, వర్సిటీ వెబ్‌సైట్ ఫలితాలను విద్యార్థులు చూడవచ్చని తెలిపారు.

February 21, 2026 / 07:44 PM IST

బీజేపీ ఎంపీ ఈటల గృహ నిర్బంధం

TG: మేడ్చల్ జిల్లాలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. కామారెడ్డి పర్యటనకు వెళ్లకుండా ఈటలను అడ్డుకున్నారు. ఏసీపీతో సహా ఈటల రాజేందర్ నివాసం వద్ద పోలీసులు మోహరించారు. కాగా, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిమీద దాడి నేపథ్యంలో.. పరామర్శకు వెళ్లేందుకు ఈటల సిద్ధమయ్యారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశాలున్నాయని ఈటలను అడ్డుకున్నారు.

February 21, 2026 / 07:44 PM IST

‘కిల్లర్’ టీజర్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి

‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఫేమ్ జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం ‘కిల్లర్’. ఈ సినిమాతో ఆమె వెండితెరపై హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తాజాగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశాడు. ఈ సినిమాకు పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. Sci-Fi థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జ్యోతి ఐదు పాత్రలలో నటిస్తుండటం విశేషం.

February 21, 2026 / 07:44 PM IST

రైతులకు ప్రకృతి వ్యవసాయం పై అవగాహన

MDK: హవేలీ ఘనపూర్ మండలం ఫరీద్ పూర్ గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై మండల వ్యవసాయ అధికారి బాల్ రెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలని అధికంగా ఎరువులు పురుగు మందులు వాడడం వల్ల నేల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. భూమి సారం తగ్గుతుందని తద్వారా పంట దిగుబడులు తగ్గుతున్నాయని అన్నారు.

February 21, 2026 / 07:43 PM IST

పొదిలిలో కార్డెన్ సెర్చ్ నిర్వహణ

ప్రకాశం: కనిగిరి డీఎస్పీ ఆదేశాల మేరకు, పొదిలి పట్టణంలోని చిన్నచెరువు ప్రాంతంలో శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో రికార్డులు లేని 3 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వాహనాలపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

February 21, 2026 / 07:43 PM IST

పొదిలిలో కార్డన్ సెర్చ్ నిర్వహణ

ప్రకాశం: కనిగిరి డీఎస్పీ ఆదేశాల మేరకు, పొదిలి పట్టణంలోని చిన్నచెరువు ప్రాంతంలో శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో రికార్డులు లేని 3 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వాహనాలపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

February 21, 2026 / 07:43 PM IST