• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ముగిసిన ప్రవేశ పరీక్షా.. పాఠశాల వద్ద రద్దీ

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని స్థానిక ఏకలవ్య ఆదర్శ పాఠశాలలో ఆదివారం గురుకుల ప్రవేశ పరీక్షా ప్రశాంతంగా ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు తరలిరాగ.. పాఠశాల వద్ద రద్దీ ఏర్పడింది. విద్యార్థులకు అన్ని ఏర్పాట్లతో పరీక్షను నిర్వహించామని సిబ్బంది పేర్కొన్నారు. ఈ మేరుకు పరీక్షా ముగించుకున్న విద్యార్థులు తిరిగి ఇంటి బాట పట్టారు.

February 22, 2026 / 01:18 PM IST

చౌహన్–అచ్చెన్నాయుడు భేటీ

TPT: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయడు, కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ను  మర్యదపూర్వకంగా కలిసారు. మైక్రో ఇరిగేషన్ నిధుల విడుదలపై అచ్చెన్నాయడు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసారు. త్వరితగతిన మిగిలిన రూ.645 కోట్లు కేంద్ర వాటా విడుదల చేయాలని కోరారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో నిధులు విడుదలకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

February 22, 2026 / 01:18 PM IST

బల్కంపేట్‌లో అమ్మవారికి ప్రత్యేక పూజలు

HYD: బల్కంపేట్ రేణుకా ఎల్లమ్మ తల్లిని ఆదివారం సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు. పలు రకాల పుష్పాలు, ఫలాలతో అమ్మవారిని అత్యంత సుందరంగా గర్భగుడిని తీర్చిదిద్దారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించి, దీప ధూప నైవేద్యాలు సమర్పించి, మంగళహారతులు ఇచ్చారు. భక్తజన సందోహంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. దర్శనానికి సుమారు 30 నిమిషాల సమయం పడుతుంది.

February 22, 2026 / 01:17 PM IST

ఈ నెల 24 నుంచి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

VKB: దోమ మండలం మల్లేపల్లిలో ఈ నెల 24, 25న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని ఆలయ కమిటీ తెలిపారు. 24న ధ్వజస్తంభ ప్రతిష్ఠ, ధ్వజారోహణ, ఆంజనేయస్వామి అభిషేకం, గణపతి, నరసింహస్వామి హోమం, మంగళహారతి, ప్రసాద వితరణ, ఊరేగింపు, సుప్రభాతం, అభిషేకం, చండిహోమం నిర్వహించబడతాయి. 25న స్వామివారి కళ్యాణం, మంగళహారతి కార్యక్రమాలు జరగనున్నాయి.

February 22, 2026 / 01:17 PM IST

సదుంలో పర్యటించిన ఎమ్మెల్యే

CTR: సదుంలో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయనను కలిశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారికి ఆయన సూచించారు. పలువురు తమ సమస్యలు విన్నవించగా, పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

February 22, 2026 / 01:16 PM IST

జై బీమ్ పార్టీలో చేరిన ఆంజనేయులు

PPM: విజయనగరం తోటపాలెం ఎస్సీ కాలనీకి చెందిన అంబేద్కర్ వాది, బహుజననాయకులు బోక ఆంజనేయులు ఆదివారం విజయవాడజై భీమ్ రావు భారత్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జై బీమ్ పార్టీలో చేరారు. ఏపీ రాష్ట్ర జై భీమ్ రావు భారత్ పార్టీ వ్యవస్థాపకులు జాడ శ్రావణ్ కుమార్, విజయనగరం జిల్లా ఇంచార్జ్ దుర్గారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.

February 22, 2026 / 01:15 PM IST

సీసీ కెమెరాలు విఫలమై ప్రజలకు ఇబ్బంది

PDPL: మంథని మండలంలోని చిల్లపల్లి గ్రామంలోని సీసీ కెమెరాలు సరిగా పనిచేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర ఘటనలపైనా అవి నిర్ధారణలో సహాయం చేయలేవనే సమస్య తలెత్తింది. ప్రస్తుత పరిస్థితిలో కెమెరాలు నేలవైపు మళ్లీ ఉన్నాయి. స్థానికులు అధికారులు వెంటనే చర్య తీసుకుని కెమెరాలను సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని కోరుతున్నారు.

February 22, 2026 / 01:15 PM IST

విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆడే గజేందర్

ADB: బోథ్ మండలంలోని కౌట గ్రామంలో పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాల్లో దేవాలయాలు ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రాలుగా నిలుస్తాయని, గ్రామ ఐక్యతకు ఇవి ప్రతీకలని అన్నారు.

February 22, 2026 / 01:15 PM IST

భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ

SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. అర్చక స్వాములు, వేద పండితులు తెల్లవారుజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అందరిని చల్లగా చూడు రాజన్నా, భీమన్నా అంటూ భక్తజనం వేడుకుంటున్నారు. రాజన్నకు ఇష్టమైన కోడె మొక్కులను చెల్లించుకుంటున్నారు.

February 22, 2026 / 01:15 PM IST

ఉచిత కంటి వైద్య శిబిరం!

MDK: శివంపేట మం. దంతాన్‌పల్లిలో సర్పంచ్ మమత ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వృద్ధులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. నిపుణులైన వైద్యులు ఉచితంగా సలహాలు అందించి, అవసరమైన వారికిపై వైద్యం కోసం రిఫరల్ సేవలు సూచించారు.

February 22, 2026 / 01:15 PM IST

ఉయ్యాలవాడకు ఘన నివాళులు

CTR: తొలితరం స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని జిల్లా సాయుధ దళం కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఏఆర్ అడిషనల్ ఎస్పీ దేవదాస్ పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాయలసీమలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఉయ్యాలవాడ అందరికీ ఆదర్శమని వెల్లడించారు.

February 22, 2026 / 01:14 PM IST

పర్యాటకుల రాకతో కళకళలాడిన హంసలదీవి బీచ్

కృష్ణా: కోడూరు మండలం హంసలదీవి బీచ్‌కు ఆదివారం విజయవాడ, బాపట్ల, గుంటూరు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు కుటుంబ సమేతంగా విచ్చేసి సముద్ర స్నానాలు చేస్తూ సరదాగా గడిపారు. పర్యాటకుల తాకిడితో బీచ్ కళకళలాడింది. పర్యాటకులు స్నానాలు చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై పాలకాయతిప్ప మెరైన్ పోలీసులు సూచనలు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గస్తీ నిర్వహించారు.

February 22, 2026 / 01:13 PM IST

‘బీజేపీ మతపర సమస్యలు సృష్టించాలని చూస్తోంది’

TG: శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా బీజేపీ వ్యవహరిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ‘మతపర సమస్యలు సృష్టించాలని చూస్తోంది. అలా ఎవరు చేసినా అరెస్టులు తప్పవు. శాంతిభద్రతల దృష్ట్యా నేను కామారెడ్డికి వెళ్లలేదు. సంబంధంలేని అంశంపై బండి సంజయ్ మాట్లాడుతున్నారు. సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యను.. జటిలం చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు.

February 22, 2026 / 01:13 PM IST

గంజహళ్లి ఉరుసుకు కట్టుదిట్టమైన బందోబస్తు

KRNL: గోనేగండ్ల మం. గంజహళ్లి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీశ్రీ సద్గురు బడేసాహెబ్ ఉరుసు సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇవాళ DSPభార్గవి, CI చంద్రబాబు, ఎమ్మిగనూరు టౌన్ CI శ్రీనివాసులు సిబ్బందితో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. దర్గా పరిసరాల్లో విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, భద్రతా దృష్ట్యా 146మంది సిబ్బంది పాల్గొంటారు.

February 22, 2026 / 01:13 PM IST

జాతరలో పాప మృతి బాధాకరం: కవిత

TG: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో కుల వివక్షతో పేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పాప మరణించడం అమానుషమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. పాప కుటుంబంతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పాప మృతికి కారణమైన వారిపై BNS 316, BNS 316(3), జువెనైల్ జస్టిస్ యాక్ట్ 75 ప్రకారం కేసులు పెట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

February 22, 2026 / 01:13 PM IST