• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

జింబాబ్వే ఆటతీరుపై ద్రవిడ్ ప్రశంసలు

టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు జింబాబ్వే చేరితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో జింబాబ్వే అద్భుత ప్రదర్శన చేస్తోందని కొనియాడాడు. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించడం అంటే సామాన్యమైన విషయం కాదని పేర్కొన్నాడు. ఫైనల్లో భారత్ vs జింబాబ్వే జట్లు తలపడితే చూడాలని ఉందని ద్రవిడ్ ఆకాంక్షించాడు.

February 22, 2026 / 04:20 PM IST

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

NDL: పగిడ్యాల మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్య గిత్త జయసూర్య ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్ర సిబ్బంది హాజరు పట్టి రిజిస్టర్ పరిశీలించారు. మహిళల ప్రసవాల గురించి అడిగి తెలుసుకున్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బంది ని ఆదేశించారు. ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.

February 22, 2026 / 04:20 PM IST

ప్రొద్దుటూరు తిమ్మయ్య కాలనీలో భారీ చోరీ

KDP: ప్రొద్దుటూరు పట్టణంలోని తిమ్మయ్య కాలనీలో భారీ చోరీ జరిగింది. బాలిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో 35 తులాల బంగారు నగలు, 40 తులాల వెండి ఆభరణాలను దుండగులు అపహరించారు. శనివారం బంధువుల కార్యక్రమానికి కుటుంబంతో కలిసి పెనికలపాడు గ్రామానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం పక్కింటి వారు వాకిలి తెరిచి ఉందని సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులో వచ్చింది.

February 22, 2026 / 04:19 PM IST

ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి వెంకట్ రెడ్డి

NLG: నల్లగొండలోని డాక్టర్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్‌కే హాస్పిటల్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అత్యాధునిక వైద్య సదుపాయాలను ఆయన పరిశీలించారు. సామాన్యులకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రైవేట్ ఆసుపత్రులు ముందుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య పాల్గొన్నారు.

February 22, 2026 / 04:19 PM IST

బస్సు ఢీకొని వ్యవసాయ కూలీ మృతి

NZB: బుస్సాపూర్ గ్రామ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ధోనీ పోశెట్టి (56) అనే వ్యవసాయ కూలీ మృతి చెందారు. నిన్న సాయంత్రం పని ముగించుకుని భైక్‌పై వస్తుండగా, యూ-టర్న్ వద్ద నిర్మల్ నుంచి ఆర్మూర్ వెళ్తున్న బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన పోశెట్టిని ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

February 22, 2026 / 04:18 PM IST

క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధికి విరాళం

AKP: ఎస్ రాయవరం మండలం రేవు పోలవరంలో క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధికి మాజీ సర్పంచ్ చోడిపిల్లి బంగారి రూ.1,11,101 విరాళం ప్రకటించారు. ఈ మేరకు విరాళాన్ని నక్కపల్లి క్యాంపు కార్యాలయంలో ఆదివారం హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా గ్రామ నిర్వాహకులకు అందజేశారు. విరాళం అందజేసిన మాజీ సర్పంచ్‌ను మంత్రి అభినందించారు.

February 22, 2026 / 04:16 PM IST

‘ఇల్లు లేని ప్రతి నీరు పేదలకు ఇల్లు కట్టించి ఇస్తాం’

SRCL: ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించి ఇస్తామని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టించి ఇవ్వడమే తమ లక్ష్యమని MLA అన్నారు.

February 22, 2026 / 04:16 PM IST

రైళ్లలో ఏడీఆర్ఎం ఆకస్మిక తనిఖీలు

విశాఖ నుంచి బయలుదేరే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏడీఆర్ఎం (ఆపరేషన్స్) శ్రీ కె. రామారావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బెడ్ షీట్లు, శుభ్రతను పరిశీలించి ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం సిబ్బంది, సూపర్వైజర్లు, హెల్త్ ఇన్‌స్పెక్టర్లతో నిర్వహించిన కౌన్సెలింగ్లో సేవా ప్రమాణాలు పెంచాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు.

February 22, 2026 / 04:15 PM IST

నరసింహారెడ్డికి అన్నమయ్య పోలీసుల ఘన నివాళి

అన్నమయ్య: రాయచోటి పోలీస్ కార్యాలయంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ యం. వెంకటాద్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశభక్తి, ధైర్యసాహసాలను స్మరించుకున్నారు. నేటి తరానికి ఆయన జీవితం స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

February 22, 2026 / 04:14 PM IST

‘ఉయ్యాల ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకం’

VZM: జిల్లా పోలీసు కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆదివారం ఘన నివాళులు అర్పించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన తొలి యోధుల్లో ఒకరైన ఆయన ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకమని తెలిపారు.

February 22, 2026 / 04:13 PM IST

పొన్నలూరులో అగ్ని ప్రమాదం

ప్రకాశం: పొన్నలూరులో ఆదివారం పొగాకు బ్యారన్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ. 5 లక్షల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పొగాకు బ్యారన్ మొద్దుగొట్టంపై కర్ర జారి పడటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే సమయానికి పూర్తిగా దగ్ధమైంది. బ్యారన్ యజమానులు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

February 22, 2026 / 04:13 PM IST

ఆదోనిలో 99వకు చేరుకున్న దీక్షలు

KRNL: ఆదోని జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో సాగుతున్న ఉద్యమ దీక్షలు ఆదివారానికి 99వ రోజుకు చేరుకున్నాయి. ‘మేము సైతం’ అంటూ మాలదాసరి (హరిదాసుల) మాల మహానాడు నాయకులు, సభ్యులు రిలే నిరాహార దీక్షలో ఉన్నారు.కార్యక్రమంలో జేఏసీ నాయకులు రఘురామయ్య, అశోక్, నంద రెడ్డి, కృష్ణమూర్తి, కమతం వెంకటేశ్, గోపాల ఆచారి, కోదండ, గంగపుత్ర సంఘం ప్రకాష్, దస్తగిరి నాయుడు, పాల్గొన్నారు.

February 22, 2026 / 04:13 PM IST

నో హెల్మెట్ – నో పెట్రోల్.. యాదాద్రి కలెక్టర్ ఆదేశం

భువనగిరి జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు కలెక్టర్ హనుమంతరావు కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చారు. ఇకపై హెల్మెట్ లేని బైక్లకు పెట్రోల్ పోయకూడదని బంక్ యాజమాన్యాలను ఆదేశించారు. ప్రతి బంక్ వద్ద హెల్మెట్ ఆవశ్యకతపై అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు.

February 22, 2026 / 04:13 PM IST

7 ఫిల్మ్‌ఫేర్స్‌తో సాయి పల్లవి అరుదైన రికార్డు

టాలెంటెడ్ నటి సాయి పల్లవి తన ఖాతాలో మరో అరుదైన రికార్డును వేసుకుంది. తాజాగా జరిగిన 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ‘అమరన్’ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డును అందుకుంది. దీంతో ఆమె కెరీర్‌లో మొత్తం 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు చేరాయి. ప్రేమమ్, ఫిదా, శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ, గార్గి, విరాటపర్వం, అమరన్ సినిమాలతో ఆమె ఈ ఘనత సాధించింది.

February 22, 2026 / 04:13 PM IST

మార్చి 3 నాగులమ్మ జాతర.. సీతక్కకు ఆహ్వానం

TG: ములుగు జిల్లా మండపేటలోని రాజుపేట-లక్ష్మీ నర్సాపూర్‌లో 2026 మార్చి 3 నుంచి 7 వరకు జరిగే శ్రీ నాగులమ్మ మహాజాతరకు ప్రభుత్వ సహకారం ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. మంత్రి సీతక్కను కలిసిన ఆలయ అధికారులు కలిసి.. నాగదేవత జాతరకు రావాలంటూ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించి ప్రసాదం అందించారు.

February 22, 2026 / 04:10 PM IST