• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అప్పుడు అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చా: రేవంత్

TG: తాను పీసీసీ అధ్యక్షుడిని అయ్యే నాటికి పార్టీ పరిస్థితి క్లిష్టంగా ఉండేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీలోనూ కొందరి నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నానని తెలిపారు. నేతలందరినీ కలిసి తన ఆలోచనలు చెప్పి.. అందరినీ ఒప్పించానన్నారు. అందరం కృషి చేయడంతో పార్టీ ఓటింగ్ 2.5 శాతం నుంచి 40 శాతానికి చేరిందన్నారు. 

February 21, 2026 / 04:37 PM IST

వైసీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

GNTR: శాసనమండలిలో వైసీపీ నేతలు ప్రదర్శించిన తీరును సభ్య సమాజం హర్షించదని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి విమర్శించారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో మాట్లాడిన ఆమె, వేంకటేశ్వరస్వామి ఫోటోలు పట్టుకుని, కాళ్లకు షూలు వేసుకుని సభలోకి రావడం అపచారమని మండిపడ్డారు. దేవుడి పట్ల భక్తి లేని ఇలాంటి చర్యలు క్షమించరానివని ఆగ్రహం వ్యక్తం చేశారు.

February 21, 2026 / 04:35 PM IST

మున్సిపల్ కార్యాలయ నూతన భవనం పరిశీలన

నిర్మల్‌లోని మున్సిపల్ కార్యాలయం వెనుక భాగంలో గల భవనాన్ని మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, డీఈ హరిభువన్ కలిసి శనివారం పరిశీలించారు. ప్రస్తుత కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కార్యాలయాన్ని నూతన భవనానికి తరలించాలని నిర్ణయించారు. కొత్త భవనంలో అవసరమైన మరమ్మతులు, మార్పులపై సమీక్షించారు.

February 21, 2026 / 04:35 PM IST

ఆసియా గేమ్స్‌లో దాయాదుల సమరం..?

క్రికెట్ ప్రపంచంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా టీ20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరు వ్యూవర్‌షిప్ రికార్డులను తిరగరాసింది. అయితే, ఈ దాయాది జట్లు మరో కీలక టోర్నీలో తలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఆసియా గేమ్స్‌లో క్రికెట్ కూడా ఉండటంతో, అక్కడ IND-PAK పోరు జరిగే అవకాశం ఉంది.

February 21, 2026 / 04:34 PM IST

YSR ప్రజల మధ్యే ఉన్నారు: రేవంత్

TG: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో YS రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల మధ్య రోజుల తరబడి ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో తొలి నుంచి భిన్నాభిప్రాయాలు వెలువరించే సంస్కృతి, స్వేచ్ఛ ఉందన్నారు. భిన్నాభిప్రాయాలు చెప్పినంత మాత్రాన వారిని వేధించే సంస్కృతి లేదన్నారు.

February 21, 2026 / 04:33 PM IST

సుంకిడి గ్రామంలో పర్యటించిన బోథ్ ఎమ్మెల్యే

ADB: తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించారు. ముందుగా గ్రామంలోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని ప్రజలతో మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు ఉన్నారు.

February 21, 2026 / 04:32 PM IST

తల్లిదండ్రులకు చెంతకు చేర్చిన పట్టణ పోలీసులు

PPM: బొబ్బిలి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఏడాది వయస్సు ఉన్న తన మనవరాలితో పొరపాటున పార్వతీపురం వచ్చారు. అక్కడ అచేతనగా ఉండడంతో అతనిని స్థానికులు వాకబు చేయగా పొంతనలేని సమాధానం చెప్పారు. వెంటనే పట్టణ సీఐ వెంకటరావుకు సమాచారం అందించగా, చిన్నారిని, వృద్ధుని పోలీసు సంరక్షణలో ఉంచి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారికి పాపను సురక్షితంగా అందించారు.

February 21, 2026 / 04:32 PM IST

యష్ ‘టాక్సిక్’లో బిగ్ స‌ర్‌ప్రైజ్‌

కన్నడ స్టార్ యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబోలో ‘టాక్సిక్’ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలో బిగ్ సర్‌ప్రైజ్ ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో యష్ డ్యూయెల్ రోల్‌లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాయా, రూమి అనే పాత్రలతో ఆయన అలరించనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీ 2026 మార్చి 19న విడుదలవుతుంది.

February 21, 2026 / 04:32 PM IST

నర్సరీలను పరిశీలించిన అధికారులు

MNCL: జన్నారం మండలంలోని ప్రభుత్వ నర్సరీలలో మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈజీఎస్ ఏపీవో రవీందర్ తెలిపారు. శనివారం జన్నారం మండలంలోని మహమ్మదాబాద్, రోటిగూడాలలో ఉన్న ప్రభుత్వ నర్సరీలను సందర్శించి నిర్వాహకులకు సూచన చేశారు. వేసవి నేపథ్యంలో మొక్కలకు నీరు పోసి కాపాడాలని ఆయన సూచించారు. ఆ గ్రామాల శివారులలోని అటవీ ప్రాంతాలలో ఉపాధి పనులను పరిశీలించారు.

February 21, 2026 / 04:32 PM IST

పార్టీని బలపదించడమే లక్ష్యం: TPCC చీఫ్

VKB: తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులను రాబోయే ఎన్నికలకు సన్నద్ధం చేయడమే ఈ శిక్షణ శిబిరం లక్ష్మని TPPC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో శిక్షణ కేంద్రానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొంటారని పేర్కొన్నారు.

February 21, 2026 / 04:32 PM IST

‘అతడు’ రీ-రిలీజ్..ఎప్పుడంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన క్లాసిక్ మూవీ ‘అతడు’ రీ-రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 28న ఈ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా రీ-రిలీజ్ హక్కులను డిస్ట్రిబ్యూటర్లు 40 లక్షలకు దక్కించుకున్నారట. అద్భుతమైన డైలాగ్స్, ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాతో అలరించిన ఈ చిత్రం మరోసారి వెండితెరపై ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది.

February 21, 2026 / 04:32 PM IST

‘ప్రసూతి ఆసుపత్రిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం’

TPT: తిరుపతి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది గర్భిణీలు మరియు వారి కుటుంబ సభ్యులకు పరిశుభ్రత, మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కల్పించారు. మరుగుదొడ్ల వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు.

February 21, 2026 / 04:31 PM IST

దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ శిక్షణా

JN: జనగామ బీజేపీ ఆఫీసులో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్ హాజరై మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ సమన్వయంతో కష్టపడి పని చేయాలని అన్నారు. బీజేపీ జిల్లా నేతలు పాల్గొన్నారు.

February 21, 2026 / 04:31 PM IST

పట్టణ అభివృద్ధికి దాతలు సహకారం మరువలేనిది: ఎమ్మెల్యే

W.G: భీమవరం పట్టణ అభివృద్ధిలో దాతల సహకారం పాత్రల ఎంతో ఉందని, వారి సహాయ సహకారాలు మరువలేనివని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం-తాడేరు రోడ్డులో విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన పంచారామ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ ముఖ ద్వారం ఆర్చ్‌ను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్, సిబ్బంది పాల్గొన్నారు.

February 21, 2026 / 04:30 PM IST

మహిళలపై వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం

KDP: టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వెంకటేశ్వర స్వామిని కూడా నీచ రాజకీయాలకు వైసీపీ వాడుకుంటోందని ఆరోపించారు. మహిళలను కించపరిచే విధంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ హయాంలో భూతులు మాట్లాడిన వారికే మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని భూపేష్ రెడ్డి అన్నారు.

February 21, 2026 / 04:30 PM IST