• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేడు నాయుడుపేటలో పవర్ కట్

TPT: నాయుడుపేట పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ శివశంకర్ తెలిపారు. మరమ్మతుల నేపథ్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు బీఎంఆర్ నగర్, బాలాజీనగర్, బోపయ్యకాలనీ, అగ్రహారం, ఆవనిహోమ్స్, కాళహస్తి రోడ్డు, పెట్రోల్ బంక్, రాజగోపాలపురం, బస్టాండ్, శ్రీరామ్ నగర్, జూవ్వలపాలెం, అశోక్ నగర్‌లో సరఫరా ఉండదని, ఈ మేరకు ప్రజలు తమకు సహకరించాలని కోరారు.

February 22, 2026 / 07:10 AM IST

‘గ్రామీణ యువతకు స్వయం ఉపాధి శిక్షణ’

PDPL: జిల్లాలోని గ్రామీణ యువతకు RSETI పెద్దపల్లి ఆధ్వర్యంలో వివిధ విభాగాలలో స్వయం ఉపాధి శిక్షణ అందిస్తున్నట్లు డైరెక్టర్ రాకేష్ తెలిపారు. మగ్గం వర్క్, క్రియేటివ్ జువెలరీ, బ్యూటీ పార్లర్, ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ, సీసీ కెమెరా సర్వీస్, కార్ డ్రైవింగ్, ఫాస్ట్ ఫుడ్ స్టాల్, మొదలగు కోర్సులలో శిక్షణ పొందుటకు సంస్థలో, 9392221907 నంబర్‌లను సంప్రదించాలని తెలిపారు.

February 22, 2026 / 07:07 AM IST

ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి: ప్రిన్సిపాల్

BHPL: బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 5 నుంచి 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం ఆదివారం నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని లింగాల MJP ప్రిన్సిపల్ జి. విజయ తెలిపారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అనుకూలంగా సౌకర్యాలు కల్పించినట్లు, పరీక్షా హాల్‌లు, తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర అవసరాలు సిద్ధం చేశామని వెల్లడించారు.

February 22, 2026 / 07:06 AM IST

టెక్కలిలో ఒడిశా దొంగ అరెస్ట్

SKLM: ద్విచక్రవాహనాలు, బంగారు ఆభరణాల చోరీలకు పాల్పడుతున్న ఒడిశాకు చెందిన దొంగను టెక్కలి పోలీసులు అరెస్టు చేశారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ డి. లక్ష్మణరావు మీడియా సమావేశం నిర్వహించారు. టెక్కలి జగతి మెట్ట కూడలిలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా పట్టుబడి నట్లు చెప్పారు. నిందితుడి నుంచి 10 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

February 22, 2026 / 07:06 AM IST

దుబాయిలో యువకుడి మృతి.. ఎమ్మెల్యేను ఆశ్రయించిన కుటుంబం

JN: మాన్సింగ్ తండాకు చెందిన భూక్య శ్రీను ఉపాధి కోసం దుబాయికి వెళ్లి అక్కడ మృతి చెందాడు. బాధితుడి బంధువులు, స్థానిక నాయకులు జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిను కలిసి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేలా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, మృతదేహం త్వరగా చేరేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు

February 22, 2026 / 07:06 AM IST

పులిగుండు కొండపైన సినిమా షూటింగ్

CTR: టాలీవుడ్ లెజెండ్ కృష్ణ మనవడు దివంగత రమేశ్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం షూటింగ్ శనివారం పెనుమూరు మండలం పులిగుండు వద్ద జరిగింది. సీనియర్ నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందూ పుణ్యక్షేత్రాల నేపథ్యంలో భక్తి, భావోద్వేగాలతో సాగనుంది. ఘట్టమనేని వారసుడి తొలి చిత్రం కావడంతో సనిమా రంగంలో ఆసక్తి నెలకొంది.

February 22, 2026 / 07:06 AM IST

పోరుమామిళ్ల కవికి విజయవాడలో సత్కారం

KDP: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్న తెలుగు మహాసభల్లో పోరుమామిళ్లకు చెందిన కవి బొల్లు రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాష ప్రాముఖ్యతను గురించి పలువురు ప్రసంగించారు. అనంతరం తెలుగు, సాంస్కృతిక అకాడమీ AP ఛైర్మన్ విల్సన్ చేతుల మీదుగా ఆయనకు మెమెంటో అందించి సత్కరించారు.

February 22, 2026 / 07:05 AM IST

నగరంలో చికెన్ ధర ఎంతంటే.!

HYD: నగరంలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 206 నుంచి రూ. 230 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 234 నుంచి రూ. 260 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 5 వరకు తగ్గిందని విక్రయదారులు తెలిపారు.

February 22, 2026 / 07:05 AM IST

మసీదును సందర్శించిన ఎంపీ కేశినేని చిన్ని

NTR: జగ్గయ్యపేట మండలం మహమ్మద్ పేటలోని మసీదును ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్‌తో కలిసి ఎంపీ కేసినేని చిన్ని నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు పలు సమస్యలు గురించి ఎంపీ కేశినేని దృష్టికి తీసుకువెళ్లారు. ఒక్కొక్కటిగా అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ఎంపీ ముస్లిం పెద్దలకు హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

February 22, 2026 / 07:05 AM IST

నేడు మంత్రి పొంగులేటి పర్యటన వివరాలు

KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఏదులాపురం మున్సిపాలిటీలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయ ఇంచార్జి తంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. పర్యటనలో భాగంగా మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సభ్యుల సన్మాన కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. అనంతరం సత్య నారాయణపురంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నారు.

February 22, 2026 / 07:05 AM IST

గుప్త నిధుల పేరిట భారీ మోసం

MBNR: గుప్తనిధులు ఉన్నాయని నమ్మించి రూ.40 లక్షలు వసూలు చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ముందుగా పాతిపెట్టిన లక్ష్మీదేవి విగ్రహాన్ని తవ్వి, కోట్ల రూపాయల విలువ ఉందని నమ్మించి బాధితుడిని మోసం చేసినట్లు వివరించారు. ఈ కేసులో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చేపట్టామన్నారు.

February 22, 2026 / 07:04 AM IST

కారు బోల్తా… నలుగురికి గాయాలు

WGL: రాయపర్తి మండల కేంద్రంలో కారు అదుపుతప్పి బోల్తా పడటంతో నలుగురు యువకులు గాయపడ్డారు. జేతురాం తండా పంచాయతీ పరిధిలోని విద్యానగర్ తండాకు చెందిన వారు హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా నేడు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. రాయపర్తి నుంచి తండాకు వెళ్తుండగా కారు రహదారి పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

February 22, 2026 / 07:04 AM IST

హాస్టల్ విద్యార్థి మిస్సింగ్.. కేసు నమోదు

KKD: పిఠాపురం ఎస్సీ బాలుర హాస్టల్లో చదువుతున్న దాసరి పార్ధు శనివారం ఉదయం హాస్టల్ నుంచి RRBHR ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాడు. సాయంత్రమైనా హాస్టల్‌కు తిరిగి రాకపోవడంతో వార్డెన్ చుట్టు పక్కలా వెతికినా కనిపించ లేదు. పార్ధు సొంతూరు గొల్లప్రోలులోని రంగప్ప చెరువు అని సమాచారం. బాలుడికి 13 ఏళ్లు ఉంటాయాని, పాఠశాల యూనిఫామ్ వేసుకున్నాడని తెలిపారు.

February 22, 2026 / 07:03 AM IST

ఆస్పరి సీఐ కీలక సూచనలు

KRNL: ఆస్పరి మండల ప్రజలకు CI ఏ. గంగాధర్ పలు సూచనలు చేశారు. పక్క మండలాల్లో చైన్ స్నాచింగ్, దొంగతనాలు జరుగుతున్నాయని, ఈ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానస్పద వ్యక్తులపై దృష్టి పెట్టి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మహిళలు, వృద్ధులు ముఖ్యంగా చైన్లు ధరించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎటువంటి సమాచారం కోసమైనా 9121101159కు సంప్రదించాలన్నారు.

February 22, 2026 / 07:03 AM IST

నేడు మెగా జాబ్ మేళా

కోనసీమ: సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రామచంద్రపురం ఉపాధి భవన్‌లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి సుభాష్ కార్యాలయం తెలిపింది. 10వ తరగతి నుంచి డిప్లమా వరకు చదివిన 18-27 ఏళ్ల యువత అర్హులు. నిరుద్యోగ యువతకు ఇది ఒక గొప్ప అవకాశమని, పెద్ద ఎత్తున పాల్గొనాలని అధికారులు కోరారు. ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు.

February 22, 2026 / 07:00 AM IST