• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

RR: కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో శ్రీ మహాలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. జాతర సందర్భంగా వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు స్వామి దర్శనం కోసం తరలివస్తున్నారు. ఈ సందర్భంగా లే మామిడి గ్రామానికి చెందిన పలువురు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

February 20, 2026 / 07:00 PM IST

జగన్‌తో కలిసి ప్రయాణించిన శింగనమల నేతలు

ATP: YSR కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి శింగనమల మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆలూరు సాంబశివారెడ్డి విజయవాడ నుంచి బెంగళూరుకు విమానంలో ప్రయాణించారు. పార్టీ కార్యక్రమాలతో పాటు వ్యక్తిగత పర్యటనలో భాగంగా వీరు వెళ్లినట్లు తెలుస్తోంది. విమాన ప్రయాణంలో నియోజకవర్గ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై జగన్ చర్చించినట్లు సమాచారం.

February 20, 2026 / 07:00 PM IST

ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా ఎదగాలి: MLA

NLR: బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో మెప్మా సహకారంతో సారీ రోలింగ్ షాపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి షాపును ఓపెన్ చేశారు. పొదుపులో వచ్చే రుణాలతో మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రుణాలను అందజేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్క మహిళ ఆర్థికంగా ఎదగాలన్నారు.

February 20, 2026 / 07:00 PM IST

బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు

NGKL: జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారిని అవమానించిన బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని మిత్రమండలి వెల్దండ ఎస్సై కురుమూర్తికి ఫిర్యాదు చేసింది. అజిలాపూర్ గ్రామానికి చెందిన సిద్దమోని రమేష్ గౌడ్, బుచ్చిబాబులపై చట్టపరమైన చర్యలు కోరారు. మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు మట్ట పరమేష్ గౌడ్, యాదగిరి, శివ, రాజు తదితరులు వినతిపత్రం అందజేశారు.

February 20, 2026 / 06:59 PM IST

రేగోడ్‌ KGBVని సందర్శించిన డీఈవో

MDK: రేగోడ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న DEO విజయ వెంటనే పాఠశాలను సందర్శించారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సహకారంతో విద్యార్థులకు తగిన చికిత్స అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.

February 20, 2026 / 06:59 PM IST

అనంతారంలో అభివృద్ధి పనుల ప్రారంభం

SRD: అనంతారంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని సర్పంచ్ కొమ్ము శ్రీనివాస్ తెలిపారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలకు రూ.20 లక్షలతో ప్రహరీ గోడ నిర్మాణం ప్రారంభించారు. గ్రామంలో సీసీ రోడ్లకు రూ.10 లక్షలు కేటాయించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 06:57 PM IST

ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి: ఆరోగ్య నిపుణులు

షుగర్, ఊబకాయం వంటి రోగాలు దరిచేరవద్దంటే కొన్ని అన్‌హెల్తీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ‘వైట్ బ్రెడ్, బియ్యం, పాస్తా వంటి పండి పదార్థాల వాడకం తగ్గించాలి. కూల్ డ్రింక్స్, ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్, ఎనర్జీ డ్రింక్స్ జోలికి వెళ్లొద్దు. స్వీట్లు, కేక్, చాక్లెట్లతో పాటు మద్యానికి దూరంగా ఉండాలి. చిరుతిళ్లు, చిప్స్ తినొద్దు’ అని చెప్పారు.

February 20, 2026 / 06:56 PM IST

పేకాట శిబిరంపై దాడి.. నలుగురు అరెస్ట్

కృష్ణా: గుడూరు పరిధిలోని చిట్టిగూడూరు గ్రామ శివారులో ఎస్సై దివ్య ప్రకాష్ తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.16,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 20, 2026 / 06:55 PM IST

రేపు కోయిలకుంట్లలో పర్యటించనున్న మంత్రి

NDL: రేపు కోయిలకుంట్ల పట్టణంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు ఇవాళ వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి తెలిపారు. కోయిలకుంట్ల పట్టణంలో ఉదయం 10 గంటలకు ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం స్వర్ణాంధ్ర, స్వచంద్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారని ఆయన అన్నారు.

February 20, 2026 / 06:55 PM IST

‘మనమిత్ర వాట్సప్ గవర్నెస్‌పై విస్తృత అవగాహన కల్పించాలి’

కర్నూలు: రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చేపట్టిన మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

February 20, 2026 / 06:54 PM IST

ఆదర్శపాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

SKLM: ఆదర్శపాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO ఏ. రవి బాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఉన్న13 ఆదర్శ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 6వ తరగతిలో ప్రవేశం కొరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఆయా మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లోనే ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్షలు జరుగుతాయిన్నారు. https://www.cse.ap.gov.in/apmలో చూడవచ్చని తెలిపారు.

February 20, 2026 / 06:52 PM IST

‘పరీక్షల నిర్వహణలో CS, DOలదే ముఖ్య పాత్ర’

NZB: పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు (CS), డిపార్ట్మెంటల్ అధికారులదే(DO) ముఖ్య పాత్ర అని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి (DIEO) రవికుమార్ అన్నారు. శుక్రవారం ఖిల్లా జూనియర్ కళాశాలలో CS, DOలతో నిర్వహించిన సమీక్షలో DIEO మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఇంటర్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.

February 20, 2026 / 06:51 PM IST

కంభంలో పరిశుభ్రత పనుల పరిశీలన

ప్రకాశం: మార్కాపురం డీఎల్డీవో బాలునాయక్ కంభం పట్టణంలోని తర్లుపాడు రోడ్డుపై జరుగుతున్న చెత్త తొలగింపు పనులను శుక్రవారం పరిశీలించారు. రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి, పట్టణంలో పరిశుభ్రతను మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పాల్గొన్నారు.

February 20, 2026 / 06:50 PM IST

‘రాజకీయ కక్షతోనే బాల్క సుమన్‌పై కేసు నమోదు’

SDPT: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్‌ సమంజసం కాదని ఉప సర్పంచ్‌ల ఫోరం బెజ్జంకి మండల అధ్యక్షుడు దీటి బాలనర్సు అన్నారు. రాజకీయ కక్షతోనే కేసులు నమోదు చేసి దూర ప్రాంత జైలుకు తరలించారని ఆరోపించారు. క్యాతన్‌పల్లి ఛైర్మన్ ఎన్నికను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని విమర్శించారు. ప్రజా తీర్పును గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరారు.

February 20, 2026 / 06:50 PM IST

చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో పల్లకి సేవ

NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో వెలిసి ఉన్న చౌడేశ్వరిదేవి అమ్మవారి ఆలయంలో ఇవాళ పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేక పూలమాలలతో అలంకరించారు. నందవరం గ్రామంలో చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపు చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.

February 20, 2026 / 06:48 PM IST