• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అన్ని వర్గాల ప్రజలు ఉన్నత పదవులు చేపట్టాలి: ఎమ్మెల్యే

BDK: అశ్వరావుపేట మున్సిపాలిటీ లో గెలుపొందిన కౌన్సిలర్ల కు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సన్మాన సభ ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు పాల్గొని నూతన కౌన్సిలర్ల కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న కాలంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.

February 22, 2026 / 08:43 PM IST

వైసీపీపై మంత్రి మండిపల్లి తీవ్ర ఆరోపణలు

AP: పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన ఘనత వైసీపీదేనని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఎద్దేవా చేశారు. పరకామణి కేసులో నిందితుడితో జగన్ రాజీపడ్డారని తెలిపారు. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, సేవా టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. శ్రీవారి తలనీలాల అక్రమ రవాణాకు పాల్పడిన ఘనత కూడా వైసీపీ నేతలదేనని మండిపడ్డారు.

February 22, 2026 / 08:43 PM IST

ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక స్వర్గం

ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక ప్రియులకు ఆకర్షణీయమైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. WGL జిల్లాలో వేయి స్తంభాల గుడి, ఓరుగల్లు కోట, భద్రకాళి దేవాలయం; MLG జిల్లాలో రామప్ప దేవాలయం, లక్నవరం, బోగోత జలపాతం; BHPL జిల్లాలో కోటగుళ్ళు, పాండవుల గుట్ట, కాలేశ్వరం ఆలయం వంటి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు పర్యాటకులు తరలివస్తున్నారు. మరి మీరు ఎప్పుడైనా వెళ్లారా?. కామెంట్ చేయండి.

February 22, 2026 / 08:43 PM IST

‘మహిళ సాధికారిక కొరకు కాంగ్రెస్ పెద్దపీట వేస్తుంది’

BDK: అంగన్వాడీ, డ్వాక్రా సంఘాల కార్యకలాపాల కోసం రూ. 50 లక్షలతో నూతనంగా కమ్యూనిటీ హాల్ భవనాన్ని నిర్మిస్తామని కార్పొరేటర్ హరిహరన్ హామీ ఇచ్చారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని 55వ డివిజన్ కార్పొరేటర్ హరిహరన్ పేర్కొన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని డ్వాక్రా మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

February 22, 2026 / 08:43 PM IST

బాల్య వివాహాలపై అవగాహన

PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి, శక్తి టీం నోడల్ అధికారి ఏఎస్పీ మనీషా రెడ్డి ఆదేశాల ప్రకారం పాలకొండ సచివాలయం మహిళ పోలీసు, బాల్య వివాహం నిరోధంపై మైనర్ బాలిక తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. బాల్యవివాహాలు చట్టప్రకారం నిర్వహించాలని సూచించారు. చిన్న వయస్సులో వివాహాలు చేస్తే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. అలాగే చదువుపై దృష్టి సారించాలన్నారు.

February 22, 2026 / 08:41 PM IST

జవాన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

SKLM: నరసన్నపేట చిక్కాలవలసకి చెందిన ఆర్మీ జవాన్ అమృత్ కుమార్ విధి నిర్వహణలో ఉండగానే గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆదివారం జవాన్ పార్థివదేహానికి ఎమ్మెల్యే రమణమూర్తి నివాళులర్పించి,కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. దేశానికి సేవ చేసిన ఈ వీరజవాన్ త్యాగాన్ని ఎప్పటికీ మరువలేము అని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామన్నారు.

February 22, 2026 / 08:41 PM IST

ఆ గ్రామంలో పెళ్లి కట్నకానుకలు నిషేధం

ADB: నార్నూర్ మండలంలోని ఖైర్డాట్వ గ్రామంలో ఆదివారం గ్రామస్థులు కలిసి పెళ్లి కట్నకానుకను నిషేధిస్తూ తీర్మానించారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వధువు మడావి పూర్ణబాయి పెళ్లి కోసం 100 కుటుంబాలు కలిసి రూ. 26,551 నగదు పొదుపు చేసి అందజేయడంతో వారు ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ మడావి నరాంజి రావు, జంగు, మోతిరాం, గోవిందరావు ఉన్నారు.

February 22, 2026 / 08:40 PM IST

గోవా గవర్నర్‌తో మంత్రి భేటీ

VZM: గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయనగరం పట్టణంలోని అశోక్ బంగ్లాలో ఆదివారం సాయంత్రం గవర్నర్‌తో మంత్రి శ్రీనివాస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించి పలు అంశాలపై ఇద్దరు చర్చించారు.

February 22, 2026 / 08:39 PM IST

’22 నుంచి ప్రజావాణి మళ్లీ ప్రారంభం’

GDWL: పురపాలక ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ నెల 22 నుంచి ‘ప్రజావాణి’ కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఎన్నికల కారణంగా తాత్కాలికంగా నిలిపిన కార్యక్రమం పునఃప్రారంభమవడంతో ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించుకోవచ్చన్నారు. అధికారులు ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

February 22, 2026 / 08:39 PM IST

ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్లాటినం జూబ్లీ సన్నాహాలు

WGL: వరంగల్ పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు EV శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. కళాశాల 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మార్చి 29న ప్లాటినం జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గల పూర్వ విద్యార్థులు త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.

February 22, 2026 / 08:38 PM IST

హిందూపూర్‌లో బాలిక ఆత్మహత్య

NRPT: కృష్ణ మండలం హిందూపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమె పెద్దనాన్న ఆంజనేయులు వద్ద నివసిస్తోంది. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు SI నవీద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

February 22, 2026 / 08:38 PM IST

పరిశోధన పత్రాన్ని ఢిల్లీలో సమర్పించిన అధ్యాపకుడు

RR: విద్యలో సాంకేతిక ప్రభావాన్ని, దాని ప్రయోజనాలను సూచిస్తూ ఢిల్లీలోని అంతర్జాతీయ సెమినార్‌లో పరిశోధన పత్రాన్ని SDNR పట్టణానికి చెందిన అర్థశాస్త్ర అసిస్టెంట్ ప్రొ. డాక్టర్ సామ రవీందర్ రెడ్డి సమర్పించారు. వారు మాట్లాడుతూ.. రాబోయే కాలంలో విద్యావ్యవస్థ మొత్తం సాంకేతికతపై ఆధారపడుతుందని, కాబట్టి విద్యార్థులు ఈ దిశగా తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

February 22, 2026 / 08:37 PM IST

రేపు యధావిధిగా ఏలూరులో పీజీఆర్ఎస్

ఏలూరు: కలెక్టరేట్ కార్యాలయంలో మరియు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం యధావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నమన్నారు.

February 22, 2026 / 08:36 PM IST

రేపు రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

KMR: బీర్కూర్ మండలం బైరాపూర్ శ్రీ రేణుక ఎల్లమ్మ-జమదగ్ని మహర్షి కళ్యాణ మహోత్సవాలకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఈ వేడుకలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం ఉదయం అమ్మవారి కళ్యాణం, మంగళవారం భక్తిశ్రద్ధలతో బోనాల ఊరేగింపు, బుధవారం భక్తులకు సామూహిక భోజన కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.

February 22, 2026 / 08:36 PM IST

మల్లారంలో కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

HNK: భీమదేవరపల్లి (M) మల్లారంలో ఇవాళ 11 కేవీ విద్యుత్ వైరు అకస్మాత్తుగా తెగి ఇతర వైర్ల పై పడటంతో షాక్‌కు గురై వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇంటి వద్ద పిండి మిషన్ నడుపుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

February 22, 2026 / 08:36 PM IST