• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పులివెందులలో ఆరుగురు అరెస్ట్: DSP

KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక ఎస్సీ హాస్టల్ వెనుకవైపు ఉన్న కంపచెట్లలో శుక్రవారం జూద స్థావరాలపై దాడులు చేసినట్లు డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. సిబ్బందితో దాడులు చేసి ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. వీరి నుంచి రూ.40,150ల నగదుతోపాటు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

February 21, 2026 / 06:28 AM IST

పోలీస్‌‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో గోపీచంద్ (29) అనే యువకుడు అదృశ్యమయ్యాడు. చాపవారి వీధికి చెందిన ఇతడు గొట్టుముక్కల రోడ్డులోని ఒక షాపులో పనిచేస్తున్నాడు. ఈ నెల 17న పనికి వెళ్లిన గోపీచంద్ తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన భార్య నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ విశ్వనాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

February 21, 2026 / 06:27 AM IST

‘వారినే కొనసాగిస్తారా?.. కొత్త వారికి అవకాశం ఇస్తారా?’

NZB: జిల్లా నుంచి రాష్ట్ర ఛైర్మన్లుగా ప్రస్తుతం ఉన్న వారినే కొనసాగిస్తారా? లేక కొత్త వారికి అవకాశమిస్తారా? అన్న చర్చ జిల్లాలో జరుగుతోంది. కాగా, జిల్లా నుంచి ఈరవత్రి అనిల్ కుమార్-మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, మానాల మోహన్ రెడ్డి-సహకార యూనియన్, అన్వేష్ రెడ్డి-విత్తనాభివృద్ధి సంస్థ, తాహేర్ బిన్ హమ్దన్-ఉర్దూ అకాడమీకి రాష్ట్ర ఛైర్మన్లుగా కొనసాగుతున్నరు.

February 21, 2026 / 06:27 AM IST

‘స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి’

WNP: త్వరలో జరగబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి అరవిందస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వనపర్తి అదనపు కలెక్టర్ కీమ్యా నాయకు వినతిపత్రం అందజేశారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలంటే స్థానిక సంస్థల్లో సముచిత రిజర్వేషన్లు అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.

February 21, 2026 / 06:26 AM IST

అనంతగిరిలో కాంగ్రెస్ భారీ కసరత్తు

TG: ఇవాళ్టి నుంచి వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో 10 రోజుల పాటు కాంగ్రెస్ శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయి. AP, TG డీసీసీ అధ్యక్షులు పాల్గొనే ఈ శిబిరంలో భాగంగా నేతలు 11 గ్రామాల్లో బస చేస్తారు. మదన్‌పల్లిలో ఉపాధి పనుల్లో రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్, షర్మిల పాల్గొంటారు. ముగింపు కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు.

February 21, 2026 / 06:26 AM IST

వదినపై హత్యాయత్నం చేసిన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

BPT: కారంచేడు మండల పరిధిలోని దగ్గుబాడుకు చెందిన నాయుడు శ్రీరామమూర్తికి, ఆస్తి వివాదంలో తన వదినపై హత్యాయత్నం చేసిన కేసులో శుక్రవారం ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ. 500 జరిమానా విధించింది. ఈ కేసులో పకడ్బందీగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన ఎస్సై ఖాదర్ భాషా, పీపీ శ్రీనివాసరెడ్డి, పీసీ బాల శంకర్‌లను ఉన్నతాధికారులు అభినందించారు.

February 21, 2026 / 06:26 AM IST

మహిళా విద్యతోనే నవసమాజ నిర్మాణం: ఎమ్మెల్యే

GDWL: మహిళా విద్య, రాజ్యాంగ అవగాహనతోనే ఉన్నతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం గద్వాలలో జన విజ్ఞాన వేదిక (JUU) ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఆడపిల్లల చదువు ఆవశ్యకత’ పోస్టర్, ‘బాలల కోసం భారత రాజ్యాంగం’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

February 21, 2026 / 06:26 AM IST

గోదావరిలో దూకి ఆత్మహత్య.. మహిళ వివరాలు లభ్యం

NZB: నవీపేట్ మండలం బాసర గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న మహిళ వివరాలను నవీపేట్ ఎస్సై శ్రీకాంత్ వెల్లడించారు. నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలోని కాక్టైలి గ్రామానికి చెందిన అనసూయా దిలీప్ మోతెవాడ (23)గా నిర్ధారించారు. ఆమె దిలీప్ మోతెవాడ భార్యగా గుర్తించారు. వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

February 21, 2026 / 06:26 AM IST

‘ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వవద్దు’

AKP: లీజు పేరుతో ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వవద్దని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిబ్బంది శుక్రవారం ధర్నా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఎస్.డబ్ల్యూ.ఎస్. జిల్లా కార్యదర్శి పరమేశ్వర రావు మాట్లాడుతూ డిపోల మూసివేత చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

February 21, 2026 / 06:25 AM IST

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

HNK: జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ఏయే దశల్లో ఉన్నాయో కలెక్టర్ స్నేహ శబరీష్ అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించగా.. మార్క్ అవుట్ అయినవి ఎన్ని, ఇండ్లు మంజూరై ఇంకా పనులు మొదలు కాని వాటి వివరాలు ఆయా శాఖల అధికారులు, ఎంపీడీవోలు కలెక్టర్‌కు వివరించారు. పనుల ఆలస్యానికి కారణాలను తెలుసుకున్నారు.

February 21, 2026 / 06:25 AM IST

6వ తరగతులు ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

AKP: మునగపాక మండలం పాటిపల్లి ఏపీ మోడల్ స్కూల్‌లో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 24 నుంచి మార్చి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓసీ, బీసీ, EWS వారు రూ.200, ఎస్సీ ఎస్టీ, PHC చెందినవారు రూ.125 దరఖాస్తు ఫీజుతో చెల్లించాలన్నారు.

February 21, 2026 / 06:24 AM IST

‘ఈనెల 22న “థింకింగ్ డే” నిర్వహించాలి’

ADB: స్కౌట్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు ‘బెడెన్ పావెల్’ దంపతుల జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనెల 22న ‘థింకింగ్ డే’ కార్యక్రమాన్ని నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి, భారత్ స్కౌట్అండ్ గైడ్స్ జిల్లా చీఫ్ కమీషనర్, ఏసీఎల్.బీ ఎస్. రాజేశ్వర్ తెలిపారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఘనంగా నిర్వహించేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు చర్యలు తీసుకోవాలన్నారు.

February 21, 2026 / 06:23 AM IST

అక్రమంగా ఇసుక రవణా.. ట్రాక్టర్ల సీజ్

KNR: కరీంనగర్ పట్టణంలోని బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. నారాయణరావుపల్లికి చెందిన కన్నం రమేష్, దుర్షేడ్‌కు చెందిన చేను రాజులను అరెస్టు చేసి, యజమానులపై కేసులు నమోదు చేశారు. నిందితులను తహశీల్దార్ ఎదుట హాజరుపరిచి రూ. లక్షకు బైండోవర్ చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

February 21, 2026 / 06:22 AM IST

నేడు వినుకొండలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 12:40 గంటలకు వినుకొండకు చేరుకుంటారు. పట్టణంలోని ఎన్నెస్పీ మైదానంలో నిర్వహించే స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. స్వచ్ఛరథాలను ప్రారంభించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. మధ్యాహ్నం 3:05 గంటలకు టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు.

February 21, 2026 / 06:22 AM IST

జాతీయ స్థాయికి వాలీబాల్ ప్లేయర్ తలకొండపల్లి వాసి

RR: తలకొండపల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అజయ్ అనే విద్యార్థి సబ్ జూనియర్ U16 వాలీబాల్ గేమ్స్‌లో జాతీయస్థాయికి సెలెక్ట్ అయినట్లు పీడీ పాండు తెలిపారు. వారం రోజుల నుంచి నిజామాబాద్ జిల్లాలోని నేషనల్ క్యాంపులో అజయ్ పాల్గొని ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ నెల 23 నుంచి కలకత్తాలో జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

February 21, 2026 / 06:19 AM IST