• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సోమశిల జలాశయం తాజా నీటి మట్టం వివరాలు

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. శనివారం ఉదయం 6 గంటల నాటికి జలాశయంలో 67.226 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయానికి 908 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయంలో 262 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది.

February 21, 2026 / 08:13 AM IST

మత సామరస్యం.. మసీదుకు ఆర్థిక సాయం

RR: నందిగామ మండలం అప్పారెడ్డిగూడలో కాంగ్రెస్ నాయకుడు మాణిక్యం మత సామరస్యాన్ని చాటుకున్నారు. రంజాన్ పండుగ పురస్కరించుకుని మసీదు అభివృద్ధి కోసం ఆయన రూ. 30,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. సర్పంచ్ చేతుల మీదుగా ఈ మొత్తాన్ని మైనార్టీ కమిటీకి అందించారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెబుతూ, భవిష్యత్తులోనూ తన వంతు సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.

February 21, 2026 / 08:11 AM IST

భక్తి మార్గంలో పయనించాలి: మున్సిపల్ ఛైర్మన్

ADB: ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో పయనించాలని మున్సిపల్ ఛైర్మన్ బండారి అనుష అన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పల్లకి ఊరేగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు మున్సిపల్ నూతన ఛైర్మన్‌గా ఎన్నికైన ఆమెను సంఘం ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

February 21, 2026 / 08:11 AM IST

కబడ్డీ జట్టుకు కోచ్‌గా పండు రాథోడ్

NZB: మక్తల్‌లో ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్వహించనున్న ‘సీఎం-కప్’ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు కోచ్‌గా పండు రాథోడ్ నియమితులయ్యారు. పండు రాథోడ్ ప్రస్తుతం కాకతీయ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో జిల్లా జట్టు రాణించేలా ఆయన శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పండు రాథోడ్‌ను పాఠశాల యాజమాన్యం అభినందించినారు.

February 21, 2026 / 08:10 AM IST

‘జిల్లాలో పంట కొనుగోలు చేస్తాం’

KDP: రైతులు దళారుల చేతిలో మోసపోకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించాలని జాయింట్ కలెక్టర్ నిధి మీనా సూచించారు. జిల్లాలో 80,103 హెక్టార్లలో శనగ పంట సాగు చేశారన్నారు. 15 కొనుగోలు కేంద్రాల ద్వారా 18,532 మెట్రిక్ టన్నులు పంట కొనుగోలు చేస్తామన్నారు. రైతులు రైతు సేవా కేంద్రంలో పేర్లను నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.

February 21, 2026 / 08:08 AM IST

ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సాయం

SRCL: చందుర్తి మండలం బండపల్లి గ్రామ సర్పంచ్ కట్కామ్ మల్లేశం సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గ్రామంలో ఆడపిల్లల పెళ్లి జరిగితే రూ. 5016ల ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు గ్రామంలో ఇద్దరు ఆడపిల్లల పెళ్లిలకు రూ. 5016ల చొప్పున ఆర్థిక సహాయాన్ని శుక్రవారం రాత్రి అందజేశారు.

February 21, 2026 / 08:07 AM IST

ర్యాగింగ్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

CTR: జిల్లా ఎస్పీ, నగరి DSP ఆదేశాల మేరకు నిండ్రలోని బాలికల జూనియర్ కాలేజీలో ర్యాగింగ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నగరి రూరల్ సీఐ భాస్కర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుపై ప్రభావం చూపే ర్యాగింగు కళాశాలల్లో స్థానం లేదన్నారు. ర్యాగింగ్ జరగకుండా పూర్తిగా నిషేధించినట్టు తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.

February 21, 2026 / 08:07 AM IST

‘రెండేళ్లుగా నిరాశ.. ఈసారైనా సాధించాలి’

VKB: గడిచిన రెండు విద్యా సంవత్సరాల్లో పదో తరగతి ఫలితాల్లో వికాబాదాబ్ జిల్లా రాష్ట్రస్థాయిలో అట్టడుగున నిలిచింది. గతేడాది 73.97 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇది రాష్ట్ర సగటు కంటే చాలా తక్కువ. ఈసారి ఎలాగైనా మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యాశాఖ అధికారులు పట్టుదలతో ఉన్నారు. అందుకోసం ఈ ఏడాది ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నారు.

February 21, 2026 / 08:06 AM IST

వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ PHCలను ఏర్పాటు

MNCL: లక్షెట్టిపేట మండల కేంద్రంలో గల 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఆసుపత్రి వార్డులు, ల్యాబ్, రిజిస్టర్లు, మందుల నిల్వలు, పరిశీలించారు. ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ PHCలను ఏర్పాటు చేసిందన్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించి ప్రజల సంక్షేమం కొరకు చర్యలు తీసుకుంటుందన్నారు.

February 21, 2026 / 08:06 AM IST

విశాఖలో రేషన్ డిపోలు పెంచండి: ఎమ్మెల్యే

VSP: విశాఖలో రేషన్ డిపోలను పెంచాలని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రస్తుతం 442 డిపోలు ఉన్నాయని మరో 43 డిపోలు కేసుల్లో ఉండడం వల్ల పనిచేయడం లేదన్నారు. 25 లక్షల జనాభా ఉన్న విశాఖలో ప్రతి 1000 మందికి ఒక రేషన్ డిపో ఉండాలని నిబంధన ఉందని దీనిని అమలు చేయాలని ఆయన సూచించారు.

February 21, 2026 / 08:05 AM IST

వైభవంగా ఊంజల్ సేవ

అనకాపల్లి పట్టణం గవరపాలెం గౌరీ పంచాయతన ఆలయంలో శుక్రవారం రాత్రి గౌరీ పరమేశ్వరుల ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు గోపాలకృష్ణశర్మ, సూర్యనారాయణ శాస్త్రి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఆలపించిన భక్తి కీర్తనలు ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు కే సన్యాసిరావు కార్యదర్శి రామ సత్యనారాయణ పాల్గొన్నారు.

February 21, 2026 / 08:05 AM IST

స్వచ్ఛ రథానికి జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే

VZM: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి వారి ఆరోగ్యాలను మెరుగుపరిచేందుకు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలానికి ఒక స్వచ్ఛ రథం కేటాయించిందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. అందులో భాగంగా కొత్తవలస మండలానికి కేటాయించిన స్వచ్ఛ రథాన్ని ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మతో కలిసి ఆమె శనివారం జెండా ఊపి ప్రారంభించారు. జెడ్పీ సీఈవో, డీపీవో, పీఏసీఎస్ అధ్యక్షులు ఉన్నారు.

February 21, 2026 / 08:05 AM IST

‘నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్’

NRML: జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, బైంసా మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయని జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. వెంటనే వసూలు చేసేందుకు సోమవారం నుంచి నెల రోజులపాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు పేర్కొన్నారు. పన్నులు చెల్లించని వారికి నోటీసులు అందించి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

February 21, 2026 / 08:04 AM IST

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లకు నేటికి 13 ఏళ్లు

HYD: దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్లు జరిగి నేటికి 13 ఏళ్లు. 2013 FEB 21న జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. ఈ కేసులో NIA కోర్టు దోషులకు మరణశిక్ష విధించినప్పటికీ, న్యాయపరమైన కారణాలతో ఇప్పటికీ అమలు కాలేదు. తమకు ఇంకా పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

February 21, 2026 / 08:04 AM IST

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

BDK: అక్రమ సంబంధం బయటపడిందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాచలంలో కలకలం రేపింది. లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచెలకకు చెందిన రమేశ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా, మైలవరానికి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని భద్రాచలంలో నివసిస్తున్నాడు. దీంతో ఇంట్లో ఈ విషయం తెలిసిందని ఆత్మహత్య చేసుకున్నడు.

February 21, 2026 / 08:01 AM IST