• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఎమ్మెల్యేకు ఉద్యోగుల జేఏసీ వినతిపత్రం

PDPL: NHM జేఏసీ పిలుపుతో “ప్రజాప్రతినిధుల ములాఖాత్” కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావును జేఏసీ ఉద్యోగులు కలిసి వినతి పత్రం అందజేశారు. రెగ్యులరైజేషన్‌తోపాటు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలో కూడా రెగ్యులరైజేషన్ చేపట్టేలా ప్రభుత్వానికి సూచించాలని విజ్ఞప్తి చేశారు.

February 19, 2026 / 06:09 AM IST

ఈ నెల 22 న రామచంద్రపురంలో జాబ్ మేళా

కోనసీమ: ఈ నెల 22న రామచంద్రపురం ఉపాధి భవన్లో మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. 18 నుంచి 27 ఏళ్ల లోపు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ , ఐటిఐ చదివిన అభ్యర్థులకు రూ.18 వేల జీతంతో షిఫ్ట్ టైంలో భోజన, రవాణా సదుపాయం కల్పించే విధంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు.

February 19, 2026 / 05:20 AM IST

సింగరేణి గనులను సందర్శించిన ఆర్టిఐ కమిషనర్లు

పెద్దపల్లి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ కమిషనర్లు పి. వి. శ్రీనివాసరావు, దేశాల భూపాల్, మొహసినా పర్వీన్, బోరెడ్డి అయోధ్య రెడ్డి బుధవారం ఆర్జీ-1 ఏరియాలోని బొగ్గు గనులను సందర్శించారు. వీరికి జి.యం లలిత్ కుమార్ గని పనితీరు, బొగ్గు ఉత్పత్తి విధానాన్ని వివరించారు. సుందిల్ల లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు.

February 19, 2026 / 04:33 AM IST

ఎమ్మెల్యే అబద్ధాల కోరు: కాంగ్రెస్ నేతలు

KMR: ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వైఖరిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విరుచుకుపడ్డాయి. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. కన్న తండ్రిపైనే చేయి చేసుకున్న చరిత్ర ఉన్న MLAకు, షబ్బీర్ అలీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. ఎన్నికల అఫిడవిట్‌లో అబద్ధాలు చెప్పారని, రూ.150 కోట్ల అభివృద్ధిపై ప్రజలను వంచిస్తున్నారని ఆరోపించారు.

February 18, 2026 / 08:24 PM IST

జర్నలిస్టులకు బిగ్ అలర్ట్

TG: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం కొత్త అక్రిడిటేషన్ కార్డులను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అర్హులైన జర్నలిస్టులు HTTP://IPR.TELANGANA.GOV.IN ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఈ నెల 9 నుంచే ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ.. నిరంతరంగా సాగుతుందని సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక తెలిపారు.

February 18, 2026 / 08:14 PM IST

కన్నాయిగూడెంలో రేపు బైక్ ర్యాలీ

MLG: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా రేపు 19 ఉదయం 8:30 గంటలకు పోచమ్మ తల్లి ఆలయం వద్ద నుంచి బైక్ ర్యాలీ ప్రారంభం కానుంది. ర్యాలీ కన్నాయిగూడెం నుంచి దేవాదుల మీదుగా ఏటూరు వరకు సాగనుంది. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు సభ్యులకు, యువతకు పిలుపునిచ్చారు. జై భవాని జై శివాజీ అంటూ.. ర్యాలీ నిర్వహించనున్నారు.

February 18, 2026 / 08:09 PM IST

రేపే చత్రపతి శివాజీ శోభాయాత్ర

CTR: పలమనేరులో ఈనెల 19వ తేదీన ఛత్రపతి శివాజీ శోభాయాత్రను నిర్వహించనున్నట్లు హిందూ సంఘాల సభ్యులు తెలిపారు. ఈ శోభాయాత్ర పలమనేరు లయన్స్ క్లబ్ నుంచి ప్రారంభమై, రెక్కమాను సర్కిల్, జిలాని సర్కిల్, పెట్రోల్ బంక్, యంబీటి రోడ్డు, జవిలి వీధి మీదుగా తిరిగి లయన్స్ క్లబ్ వద్దకు చేరుకుంటుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రతి హిందూ బంధువులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

February 18, 2026 / 08:09 PM IST

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నితనిఖీ చేసిన DMHO

KMR: జిల్లాలోని రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ విద్యా బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని రికార్డులు, స్టోర్ రూమ్, ల్యాబ్ రూమ్ పరిశీలించి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని స్థానిక వైద్యాధికారి డాక్టర్ సురేష్‌కు సూచించారు.

February 18, 2026 / 07:56 PM IST

వరుస డకౌట్స్.. అభిషేక్ చెత్త రికార్డులు

నెదర్లాండ్స్‌పై డకౌట్‌తో అభిషేక్ శర్మ చెత్త రికార్డులు మూటగట్టుకున్నాడు. T20 WCలో విండీస్ ప్లేయర్ ఆండ్రీ ఫ్లెచర్(2009) తర్వాత వరుసగా 3 సార్లు డకౌట్ అయిన 2వ ఆటగాడిగా నిలిచాడు. అలాగే క్రిస్ శ్రీకాంత్(1996 వన్డే WC) తర్వాత ఒకే ICC టోర్నీలో అత్యధికంగా 3 సార్లు డకౌట్ అయిన భారత్ 2వ ప్లేయర్‌గానూ అవతరించాడు. కాగా ఈ టోర్నీలో అభి ఆడిన 3 మ్యాచుల్లోనూ డకౌట్ అయ్యాడు.

February 18, 2026 / 07:53 PM IST

నమీబియాపై తడబడుతున్న భారత బ్యాటర్లు

నమీబియాతో జరుగుతున్న నామమాత్రపు మ్యాచులో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. దీంతో టీమిండియా 69 పరుగులకే ముగ్గురు టాపార్డర్ బ్యాటర్లను కోల్పోయింది. తొలుత అభిషేక్(0) డకౌట్ కాగా.. ఆ తర్వాత ఇషాన్(18), తిలక్(31) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. 10 ఓవర్ల ఆట ముగిసేసరికి భారత్ స్కోర్ 74/3 కాగా.. క్రీజులో సూర్య(22), దూబే(2) ఉన్నారు. నెదర్లాండ్స్ బౌలర్ ఆర్యన్ 2 వికెట్లు పడగొట్టాడు.

February 18, 2026 / 07:53 PM IST

‘సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం’

KMM: తహసీల్దార్ ఉషా శారదను ఎర్రుపాలెం సర్పంచ్ నండ్రు అశ్వని, ఆత్మ కమిటీ డైరెక్టర్ కంచర్ల వెంకట నరసయ్య బుధవారం గ్రామ రెవెన్యూ సంబంధిత సమస్యలపై చర్చించారు. భూసంబంధిత పెండింగ్ దరఖాస్తులు, పట్టాదారుల నమోదు, రికార్డుల సవరణ అంశాలను ప్రస్తావించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

February 18, 2026 / 07:49 PM IST

“బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం దరఖాస్తుల ఆహ్వానం”

BHPL: జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ ఉన్నత పాఠశాలల నుంచి 2026-27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఇందిరా ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత గల అభ్యర్థులు మార్చి 25వ తేదీ లోపు జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

February 18, 2026 / 07:47 PM IST

15 రోజుల్లో డెత్‌క్లెయిమ్‌ సెటిల్‌మెంట్..

ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ సులభతర విధానాన్ని పరిచయం చేసింది. డెత్‌ క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ కోసం ఆన్‌లైన్‌ సదుపాయాన్ని తీసుకొచ్చింది. బ్యాంకు ఖాతాదారులు మరణించిన సందర్భాల్లో కుటుంబసభ్యులు, వారి వారసులు బ్యాంకును సందర్శించకుండానే ఈ డెత్‌క్లెయిమ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

February 18, 2026 / 07:46 PM IST

సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం

HYD: డా. బీ.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇరిగేషన్ & సివిల్ సప్లైస్ శాఖలపై ప్రీ-బడ్జెట్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాధాన్య కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, ఆహార భద్రతకార్డు, ఉచిత సన్న బియ్యం పథకం, తదితర వాటిపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

February 18, 2026 / 07:46 PM IST

మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధి ప్రధాన లక్ష్యం

MDCL: మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య, క్రీడా, మౌలిక సదుపాయాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. బుధవారం మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మాను చౌదరిని కలిసి నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వినతి పత్రాలను సమర్పించారు.

February 18, 2026 / 07:42 PM IST