• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘సమాజ హితం కోసం ఆలోచన కలిగించేవి రెడ్ బుక్స్’

ఏలూరు సీపీఐ కార్యాలయంలో శనివారం రెడ్ బుక్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ.. సమాజ హితం కోసం ఆలోచన కలిగించేలా సమాజంలో దోపిడీ పీడన నుంచి విముక్తి కలిగించేందుకు ఆలోచన కలిగించే గొప్ప పుస్తకాలు రెడ్ బుక్స్ అని కొనియాడారు. ప్రజల మధ్య అంతరాలు లేని గొప్ప సమాజాన్ని నిర్మించాలన్నారు.

February 21, 2026 / 07:00 PM IST

మార్చి 2న విజయవాడలో అంగన్వాడీల మహాధర్నా

W.G: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల పట్ల వహిస్తున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మార్చి 2న విజయవాడలో సమస్యల పరిష్కారం కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే రాజా రామ్మోహన్ రాయ్ అన్నారు. జిల్లా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశం భీమవరం సీఐటీయూ కార్యాలయంలో జరిగింది.

February 21, 2026 / 07:00 PM IST

కారును ఢీకొన్న కెమికల్ ట్యాంకర్

KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక శ్రీ రంగనాథ స్వామి ఆలయ సమీపంలో శనివారం సాయంత్రం కారును కెమికల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జెంది. ఈ విషయం తెలుసుకున్న ట్రాఫిక్ సీఐ హాజీవల్లి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 21, 2026 / 07:00 PM IST

లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విశేష పూజలు

NLR: రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

February 21, 2026 / 07:00 PM IST

వేంకటేశ్వరుడిని వదిలేయండి.. గోవిందా!

AP: తిరుమల లడ్డూ వ్యవహారం రాష్ట్రంలో చిలికి చిలికి గాలి వానలా మారింది. మీరు తప్పు చేశారంటే.. మీరు తప్పు చేశారని టీడీపీ, వైసీపీ నేతల విమర్శలు తారా స్థాయికి చేరాయి. అయితే ‘లడ్డూ అంటే కేవలం ప్రసాదం కాదు, కోట్ల మంది నమ్మకం. ఈ నమ్మకాన్ని కాపాడటం వదిలేసి, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మంచిది కాదు. ఇప్పటికైనా ఆ వేంకటేశ్వరుడిని రాజకీయాల్లోకి లాగొద్దు’ అని భక్తులు వేడుకుంటున్నారు.

February 21, 2026 / 07:00 PM IST

‘చెత్తరహిత సమాజ స్థాపనకు సహకరించాలి’

VZM: చెత్త రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీడీవో రామకృష్ణ రాజు వెల్లడించారు. స్వచ్ఛాంధ్ర- స్వచ్ఛదివాస్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కొండవెలగాడలో శనివారం ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడానికి ప్రజలు సహకారం అవసరమన్నారు. పరిశుభ్రతతోనే రోగాలకు దూరంగా ఉండొచ్చని చెప్పారు.

February 21, 2026 / 06:59 PM IST

ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి కొత్త టారిఫ్‌లు: వైట్ హౌస్

సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. ప్రపంచ దేశాలపై మళ్లీ 10 శాతం టారిఫ్‌లు విధించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై తాజాగా సంతకం చేశారు. ఈ మేరకు తన ట్రూత్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ టారిఫ్‌లు ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ వెల్లడించింది. ఈ సుంకాలు 150 రోజులపాటు అమలులో ఉంటాయని తెలిపింది.

February 21, 2026 / 06:57 PM IST

జనసేన జిల్లా సమన్వయకర్తగా రవికుమార్

SKLM: జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి పార్లమెంటు నియోజకవర్గాల సభ్యత్వ నమోదు సమన్వయకర్తల పేర్లను శనివారం పార్టీ ప్రకటించింది. ఈ మేరకు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గానికి సుడా ఛైర్మన్ కోరికన రవి కుమార్‌‌ను సభ్యత్వ నమోదు సమన్వయకర్తగా నియమించింది. జిల్లాలో గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో జనసేన పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేస్తామన్నారు.

February 21, 2026 / 06:56 PM IST

వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్

MHBD: దంతాలపల్లి మండలం రామానుజాపురం గ్రామ సర్పంచ్ అక్కిరెడ్డి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మెగా ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ప్రభుత్వవిప్, డోర్నకల్ MLA డా.రాంచందర్ నాయక్ కార్యక్రమానికి అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామస్తుల సౌకర్యార్థం శిబిరాన్ని ఏర్పాటుచేయడం అభినందనీయ విషయమన్నారు. తొర్రూరు ఏఎంసీ ఛైర్మన్ బట్టునాయక్ తదితరులున్నారు.

February 21, 2026 / 06:55 PM IST

అది ఏకసభ్య కమిషన్ కాదు.. టీడీపీ కమిషన్: మల్లాది 

AP: రాష్ట్ర ప్రభుత్వం లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే అది ఏకసభ్య కమిషన్ కాదని.. టీడీపీ కమిషన్ అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయం చేసిందని విమర్శించారు. సీబీఐ రిపోర్టు ఇచ్చిన జగన్‌పై బురద చల్లడం మానుకోలేదని మండిపడ్డారు.

February 21, 2026 / 06:54 PM IST

ఖాదీ అంటే కలెక్షన్లు కాదు సర్వీస్: ఎమ్మెల్యే

KMR: ఖాదీ అంటే కలెక్షన్లు కాదని, సర్వీస్ అనే దిశగా తాను పని చేస్తున్నట్లు MLA కె.వి రమణారెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. తాను లెటర్లు రాస్తే వచ్చిన నిధులను తానే తెచ్చానని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ చెప్పుకుంటూ ఇంచార్జీ మంత్రిని తీసుకువచ్చి ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

February 21, 2026 / 06:52 PM IST

23 నుంచి ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ

MNCL: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం ఈనెల 23 నుంచి నస్పూర్‌లోని మంచిర్యాల కలెక్టరేట్‌లో యధాతధంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించాలని, తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయవచ్చని వెల్లడించారు.

February 21, 2026 / 06:51 PM IST

బస్సులో గుండెపోటుతో ప్రయాణికుడు మృతి

SKLM: శ్రీకాకుళం నుంచి పాలకొండకు వెళ్తున్న బస్సులో శనివారం సాయంత్రం ఓ ప్రయాణికుడు గుండెపోటుతో రావడంతో చింతాడ వద్ద బస్సును నిలుపుదల చేసి 108కి చెప్పండి సమాచారమిచ్చారు. దీంతో 108 చేరుకుని బస్సులో ఉన్న ప్రయాణికుని 108లోకి ఎక్కించే సమయంలో ప్రయాణికుడు మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది .

February 21, 2026 / 06:50 PM IST

సేవాలాల్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే

KMM: వైరా నియోజకవర్గం పాత తండాలోని రైతు వేదికలో శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన జాతి అభ్యున్నతికి సేవాలాల్ మహారాజ్ చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

February 21, 2026 / 06:48 PM IST

సంఘం బస్తీలో గ్యాస్ సిలిండర్ పేలి ఓ ఇంట్లో ప్రమాదం

ASF: కాగజ్ నగర్ సంఘం బస్తీలో శనివారం గ్యాస్ సిలిండర్ పేలి ఓ ఇంట్లో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అక్కడ ఉన్న పలువురికి గాయాలవ్వగా, స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాద తీవ్రతకు ఇంటి సామాగ్రి ధ్వంసమైంది. పేలుడుకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

February 21, 2026 / 06:48 PM IST