• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేడు గురుకుల ప్రవేశ పరీక్ష

భువనగిరిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో అడ్మిషన్‌తో పాటు 6, 7, 8, 9వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆదివారం ప్రవేశ పరీక్ష జరగనుంది. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.

February 22, 2026 / 06:59 AM IST

హాజరుకానున్న 12,334 మంది విద్యార్థులు: డీఐఈవో

MDK: ఈనెల 25 నుంచి జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి తెలిపారు. మొత్తం విద్యార్థులు-12,334, ఫస్ట్ ఇయర్ జనరల్-5710, ఫస్ట్ ఇయర్ ఒకేషనల్-599, మొత్తం-6309, సెకండ్ ఇయర్ జనరల్–5472, సెకండ్ ఇయర్ ఒకేషనల్-533, మొత్తం-6025, పరీక్ష కేంద్రాలు -28, ఫ్లైయింగ్ స్క్వాడ్-5 ఉన్నట్లు వెల్లడించారు.

February 22, 2026 / 06:58 AM IST

రేపు ప్రజా సమస్యల పరిష్కారవేదిక

KRNL: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు.

February 22, 2026 / 06:56 AM IST

కామారెడ్డిలో కొనసాగుతున్న హైటెన్షన్

TG: కామారెడ్డిలో హైటెన్షన్ కొనసాగుతోంది. కాంగ్రెస్-బీజేపీ సవాళ్ల వివాదం ఇంకా సద్దుమణగలేదు. సోమవారం కలెక్టరేట్‌లో తేల్చుకుందామని MLA సవాల్ విసిరారు. దీంతో MLA KVRపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో BJP రాష్ట్ర నాయకులు కామారెడ్డికి రాకుండా అక్కడ పోలీసులు మోహరించారు. ఇప్పటికే బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు‌ను హౌస్ అరెస్ట్ చేశారు.

February 22, 2026 / 06:55 AM IST

ఘనంగా కొనసాగుతున్న జ్యోతిర్లింగ శివాలయం ఉత్సవాలు

SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని తాంబేలు గుట్టపై జ్యోతిర్లింగ శివాలయ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి స్వామివారికి ప్రత్యేకంగా స్వలాలతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వేద పండితులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

February 22, 2026 / 06:55 AM IST

ఫూలే ఓవర్సీస్‌ పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

TG: మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్‌ విద్యానిధి పథకానికి సంబంధించి ఈ ఏడాది అర్హులైన బీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ తెలిపింది. ఈనెల 23 నుంచి మార్చి 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థి వయస్సు 35 ఏళ్లు నిండకూడదు. డిగ్రీలో తప్పనిసరిగా 60 శాతం మార్కులు ఉండాలి.

February 22, 2026 / 06:55 AM IST

డిగ్రీ పరీక్షల్లో 18 మంది డిబార్

KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరగుతున్న డిగ్రీ 1వ సెమిస్టర్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన 18 మంది విద్యార్థులను శనివారం డిబార్ చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్లు ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. 10,263 మంది విద్యార్థులకు గాను 9,387 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు వెల్లడించారు.

February 22, 2026 / 06:48 AM IST

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా

CTR: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.144 నుంచి రూ.150, మాంసం రూ.209 నుంచి 234 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.238 నుంచి రూ.260 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ.75 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

February 22, 2026 / 06:47 AM IST

రోజు రోజుకు దిగజారుతున్న ప్రయాణికుల సౌకర్యం

BDK: పాల్వంచ RTC బస్ స్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. చెట్ల కింద ప్రయాణికులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన బెంచ్‌లను తొలగించి ఎండలో పడేయడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఎండాకాలంలో ప్రయాణికులు చెట్ల నీడలో వేచి ఉండే సౌకర్యం పూర్తిగా లేకుండా పోయింది. కనీసం టూ వీలర్ కార్లు ఆపడానికి కూడా సౌకర్యం లేదన్నారు.

February 22, 2026 / 06:47 AM IST

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

వనపర్తి: ఘనపురం మండలం సోలిపురం గ్రామానికి చెందిన తరుణ్ అనే యువకుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సోలిపురంలోని బాధిత కుటుంబాన్ని పరమర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని కుటుంబానికి భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 06:46 AM IST

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పెనమలూరు మండలం పోరంకి టీడీపీ కార్యాలయంలో 9 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చులు నిమిత్తం మంజూరైన రూ.7,63,198 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద బడుగు బలహీన వర్గాలు ప్రజలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చంద్రబాబు ఆదుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

February 22, 2026 / 06:44 AM IST

శ్రీశైలం భక్తులకు తప్పిన ప్రమాదం

AP: శ్రీశైలంలో భక్తులకు తృటిలో ప్రమాదం తప్పింది. అక్కడ ఓ వీఐపీ కాటేజీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో భక్తులు బయటకు పరుగులు తీశారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో మంటలార్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

February 22, 2026 / 06:43 AM IST

‘వైసీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలి’

శాసనమండలలో వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామిని అవమానించి అపచారం చేశారని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ విమర్శించారు. ఈ మేరకు అనకాపల్లి పట్టణం గాంధీనగరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు, ఆలయ సంప్రోక్షణ చేశారు. వైసీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

February 22, 2026 / 06:43 AM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

TPT: సైదాపురం నుంచి రాపూరు వెళ్లే దారిలో జగనన్నా లేఅవుట్ సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురై బైకుపై ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడిందా లేదా మరో వాహనం వీరిని ఢీకొట్టిందా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 22, 2026 / 06:43 AM IST

నేడు ఎంపీ కలిశెట్టి పర్యటన వివరాలు

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం ఉదయం 8:30 కు రాష్ట్ర పండుగగా గుర్తింపు పోందిన రాజాం పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవ ప్రారంభ కార్యక్రమంలో పాల్గోననున్నారు. అనంతరం 11కు చీపురుపల్లి శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవానికి హాజరుకానున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు శనివారం ఒక ప్రకటనలో తెలిపాయి.

February 22, 2026 / 06:40 AM IST