SDPT: రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన పి.సతీశ్ ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఇంటర్ కాలేజ్ నెట్‌బాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీలు మార్చి 9 నుంచి 13 వరకు సేజ్ యూనివర్సిటీ మధ్య ప్రదేశ్‌లో జరగనున్నాయి.
GNTR: గుంటూరు నగరంలో ఆదివారం నాన్‌వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ. 190 కాగా, స్కిన్‌తో రూ. 170కి విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ. 960 వద్ద కొనసాగుతోంది. ఇక చేపల విషయానికొస్తే కొరమేను రూ. 420, బొచ్చ రూ. 230, రాగండి రూ. 170 ధర పలుకుతున్నాయి. ప్రాంతాలను బట్టి ఈ రేట్లలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.
పశ్చిమోత్తానాసనం (కూర్చుని ముందుకు వంగే ఆసనం) వెన్నెముకను సాగదీయడం, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ ఆసనం పొత్తికడుపు అవయవాలను (కాలేయం, మూత్రపిండాలు, పేగులు) మసాజ్ చేస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడి, మలబద్ధకం తగ్గుతుంది. క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గి, మంచి నిద్ర పడుతుంది. వెన్నునొప్పి ఉన్నవారు ఈ ఆసనాన్ని నిపుణుల పర్యవేక్షణలో చేయాలి.
VKB: జిల్లాలో ఈరోజు చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి. బ్రాయిలర్ చికెన్ కిలో రూ. 280-320 వరకు విక్రయిస్తుండగా, స్కిన్‌లెస్ చికెన్ రూ.320కు పైగా ఉంది. డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గడం వల్లే ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ధరల పెరుగుదలతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
NZB: జిల్లా గంగా-జమునా తెహజీబ్‌కు ప్రతీక అని, అన్ని మతాల వారు సోదరభావంతో ఉండాలని CP సాయి చైతన్య కోరారు. రాబోయే ఉగాది, హోలీ, రంజాన్ పండుగలను ప్రతీ ఒక్కరూ శాంతి యుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. శాంతి భద్రతలో పోలీసులకు సహకరించాలని సూచించారు.
సత్యసాయి: ధర్మవరం టూటౌన్ పరిధిలో భార్యను చంపేందుకు కుట్ర పన్నిన భర్త దాశరథి, అతని స్నేహితుడు మన్సూర్‌పై కేసు నమోదైంది. తన భర్తకు, మన్సూర్‌కు మధ్య అనైతిక సంబంధం ఉందని, ఈ విషయం బయటపెట్టినందుకు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు తులసి ఫిర్యాదు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రెడ్డెప్ప శనివారం తెలిపారు.
కృష్ణా: మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి కొల్లు రవీంద్ర నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బయో మెడికల్ వ్యర్థాల ట్రాకింగ్ వ్యవస్థను పరిశీలించారు. అనంతరం డాక్టర్లు ఆస్పత్రి సిబ్బందితో సమావేశమై ఆస్పత్రిలో ఉన్న ఎక్విప్‌మెంట్ పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని, అవసరమైన పరికరాలను తక్షణమే ఏర్పాటు చేస్తామని భరోసా తెలిపారు.
SKLM: పలాస కాశీబుగ్గ పట్టణంలో సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న నలుగురి వ్యక్తులు పట్టుబడినట్లు సీఐ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
TPT: అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల మాపింగ్ శాతాన్ని పెంచాలని నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి ఎన్.మార్య సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం ఆమె సమావేశం నిర్వహించారు. 2025 జాబితాను 2002 జాబితాతో సరిపోల్చే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించిన కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా దర్యాప్తు చేయాలని ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులపై దాడులు ఒక ఫ్యాషన్‌లా మారిపోవడం అత్యంత ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు.
ATP: పామిడి మండలంలోని ఓ తండాకు చెందిన సెటానాయక్ అనే వ్యక్తిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మూడవ తరగతి చదువుతున్న చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
NRPT: ఈ నెల 25వ తేదీ నుంచి జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని PDSU నాయకుడు శ్రీహరి యాదవ్ కోరారు. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరిచూసుకోవాలని, సెంటర్లలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఏఎన్ఎం ఉండాలని, పరీక్ష సమయానికి అనుకూలంగా RTC బస్సులను నడిపించాలని కోరారు.
సూర్యాపేట జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ.200 నుంచి రూ. 250 మధ్య ఉండగా, స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ.260 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. గత వారాలతో పోలిస్తే ఇది రూ.10–15 వరకు పెరిగింది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చుని స్థానికులు తెలుపారు.
NRML: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని కుబీర్ SI కృష్ణారెడ్డి హెచ్చరించారు. మండల పరిధిలోని సిర్పెల్లి రహదారిపై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైతే, వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు.
ELR: బుట్టాయిగూడెం మండలం నందాపురంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి దాటుతున్న పాయల సుబ్బారావు (60) అనే వ్యక్తిని వేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. మద్యం మత్తులో ఉన్న కారు వేగంతో వాహనాన్ని నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో సుబ్బారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.