• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జమ్మలమడుగులో డ్రగ్స్ వ్యతిరేక పోస్టర్ ఆవిష్కరణ

KDP: మాదకద్రవ్యాల నిర్మూలనకు అవగాహన పెంపొందించే లక్ష్యంతో డ్రగ్స్ అంతం, డివైఎఫ్ఐ పంతం, మాదకద్రవ్యాలను అరికడదాం – మంచి సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో రూపొందించిన పోస్టర్‌ను శుక్రవారం జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 03:58 PM IST

స్వచ్ఛ గ్రామం దిశగా అధికారుల చర్యలు

అన్నమయ్య: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాయచోటి మండలం కాటిమాయకుంట గ్రామపంచాయతీలో స్వచ్ఛ రథం వెహికల్ ప్రారంభోత్సవం శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్లాస్టిక్, పొడి చెత్త కొనుగోలు చేసి, చెత్త అందజేసిన వారికి బహుమతులు అందించనున్నట్లు ఎంపీడీవో పరిపూర్ణ అరుంధతి తెలిపారు.

February 20, 2026 / 03:56 PM IST

‘సీపీఐ జిల్లాస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలి’

KRNL: మంత్రాలయంలో మార్చి 1,2,3 తారీఖులలో జరిగే సీపీఐ జిల్లాస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సహాయ కార్యదర్శి మునెప్ప పిలుపునిచ్చారు. శుక్రవారం మంత్రాలయంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హిందూ ముస్లింల మధ్య ఘర్షణ పెట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు.

February 20, 2026 / 03:53 PM IST

6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

NDL: మహానంది మండలం తిమ్మాపురం ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మణరావు తెలిపారు. ఈ నెల 23న ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 12వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 03:52 PM IST

బ్రాహ్మణచెరువులో ఫ్రైడే -డ్రై డే కార్యక్రమం

W.G: పెనుగొండ మండలం బ్రాహ్మణచెరువు గ్రామంలో శుక్రవారం ‘ఫ్రైడే డ్రైడే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎన్ఎం లక్ష్మీ, మేల్ అసిస్టెంట్ నాగ భూషణం, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి నిల్వ ఉన్న నీటిని, వ్యర్థాలను తొలగించాలని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. దోమల వ్యాప్తి ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

February 20, 2026 / 03:52 PM IST

రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

KRNL: రాష్ట్ర సచివాలయంలో ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులతో సెన్సస్-2027 నిర్వహణపై శుక్రవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో చేపట్టాల్సిన ప్రాథమిక ఏర్పాట్లు, శిక్షణ, తదితర అంశాలపై ఆమె అధికారులతో చర్చించారు. జిల్లాలో జనాభా గణనను విజయవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.

February 20, 2026 / 03:50 PM IST

‘సమస్యల పరిష్కారమే లక్ష్యం’

అనకాపల్లి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జనసేన నియోజకవర్గం సమన్వయకర్త బీమరశెట్టి రాంకీ తెలిపారు. శుక్రవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో సమస్యలపై వినతులు స్వీకరించారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఓ పక్క సంక్షేమం మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.

February 20, 2026 / 03:48 PM IST

కడపలో వైసీపీ పత్రికా సమావేశం నిర్వహణ

కడప నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర పాలనపై పార్టీ నేతలు పత్రికా సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, ఇతర నేతలు సమావేశంలో పాల్గొన్నారు. కడపకు విచ్చేసిన శైలజానాథ్‌ను పార్టీ నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, డివిజన్ ఇంఛార్జ్‌లు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.

February 20, 2026 / 03:47 PM IST

అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

ATP: తాడిపత్రిలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, MLA అశ్మిత్ రెడ్డి భూమిపూజ చేశారు. ఆంజనేయస్వామి మాన్యం వెనుక రూ.4.50 కోట్లతో నిర్మించే సోలార్ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. అలాగే అర్జాస్ స్టీల్ ప్లాంట్ ఎదురుగా మురుగునీరు శుద్ధి చేసే ప్లాంట్, జేసీ పార్క్ ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్ పనులకు శ్రీకారం చుట్టారు.

February 20, 2026 / 03:45 PM IST

‘విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’

కృష్ణా: నందివాడ మండలం తమ్మిరిశ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బాల్య వివాహాల నివారణ గురించి ఎస్సై సుబ్రహ్మణ్యం ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. విద్యార్థి దశనుంచే చట్టాలు, సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకోవచ్చని తెలిపారు. అపరిచిత వ్యక్తులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

February 20, 2026 / 03:45 PM IST

చిత్తూరు నగర మేయర్ స్వగృహప్రవేశ కార్యక్రమం

చిత్తూరు నగర మేయర్ S. అముద వారి నూతన స్వగృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్‌కు ఎమ్మెల్యే పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మేయర్ ఎమ్మెల్యే, ముఖ్య నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక TDP నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

February 20, 2026 / 03:42 PM IST

లారీ ఢీకొని యువకుడు మృతి

కడప: ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్డు సినీ హబ్‌కు వెళ్లే మలుపులో లారీ ఢీకొని మైదుకూరు మండలం, ఏటూరు గ్రామానికి చెందిన జీవరత్నం అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడు ద్విచక్ర వాహనంపై వస్తుండగా లారీ ఢీ కొందని స్థానికులు తెలపారు.

February 20, 2026 / 03:41 PM IST

విషగుళికలు సేవించి యువకుడి ఆత్మ హత్య

KDP: సిద్ధవటం మండలం పొన్నవోలు గ్రామంలోని మామిడి శివారెడ్డి తోటలో కాపలాదారుగా ఉన్న యానికుల గణేష్(19 ) మతిస్థిమితం, అనారోగ్యంతో బుధవారం విషగుళికలు సేవించాడు. బందువులు సిద్ధవటం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లుగా ధృవీకరించారు. తండ్రి యాణికుల రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై హారిక తెలిపారు.

February 20, 2026 / 03:39 PM IST

‘దళిత వాడల్లో స్మశాన వాటికలకు నిధులివ్వండి’

కృష్ణా: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పామర్రు ఎమ్మెల్యే, ఎస్సీ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ వర్ల కుమార్ రాజా కీలక విజ్ఞప్తి చేశారు. దళిత వాడలు, మైనారిటీ ప్రాంతాల్లో స్మశాన వాటికలు, కబరస్థాన్ల ఏర్పాటుకు బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే దళితులకు పూర్తి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

February 20, 2026 / 03:37 PM IST

రైతులకు, కోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం

ASR: జీ.మాడుగుల మండలంలోని వంజరి, గెమ్మెలి గ్రామాల్లో శుక్రవారం గిరిజన రైతులకు కోళ్ల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. పశు వైద్యాధికారిణి రాగిణి, శాస్త్రవేత్త శ్రీహరి పాల్గొని, పౌల్ట్రీ ద్వారా అదనపు ఆదాయం పొందే మార్గాలను వివరించారు. అనంతరం ఒక్కో రైతుకు 15 కోళ్ల చొప్పున పంపిణీ చేశారు. బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

February 20, 2026 / 03:37 PM IST