• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

శాసనకోటలో ‘కాఫీ విత్ క్యాడర్’ కార్యక్రమం

సత్యసాయి: పరిగి మండలం శాసనకోటలో మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఆదివారం ‘కాఫీ విత్ క్యాడర్’ నిర్వహించారు. గడపగడపకూ వెళ్లి ప్రజలను పలకరిస్తూ గత జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి అన్యాయం చేస్తోందని విమర్శించారు.

February 22, 2026 / 07:50 PM IST

కదం తొక్కిన శ్రామిక లోకం..!

కడప: ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభలు ఆదివారం ఎరుపెక్కాయి. భారీ ర్యాలీ అనంతరం జరిగిన సభలో రాష్ట్ర నేతలు ఎస్.వెంకటసుబ్బయ్య, చలసాని వెంకటరామారావు పాల్గొన్నారు. ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు, లేబర్ కోడ్ల అమలుపై వారు తీవ్రంగా మండిపడ్డారు. కార్మిక హక్కులు, ఆశా-అంగన్వాడీల కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం పాలకులపై కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని కోరారు.

February 22, 2026 / 07:47 PM IST

సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహణ: కలెక్టర్

కర్నూలు: జిల్లా కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు ఆదివారం కలెక్టర్ సిరి తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో అర్జీలు స్వీకరిస్తామని చెప్పారు. గత ఫిర్యాదుల స్థితిగతుల కోసం ప్రజలు 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు.

February 22, 2026 / 07:47 PM IST

స్వామివారిని దర్శించుకున్న తెగల కమిషన్ సభ్యులు

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ తెగల కమిషన్ సభ్యులు వెంకటప్ప ఆదివారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.

February 22, 2026 / 07:40 PM IST

రుస్తుంబాదలో యాక్సిడెంట్..ఇద్దరికి గాయాలు

WG: నరసాపురం(M)రుస్తుంబాద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. జిన్నూరు చెందిన తాడి జోషి (20), గొట్టుముక్కల శామ్యూల్ రాజు (25) ఇద్దరు యువకులు బైక్‌పై పేరుపాలెం బీచ్ సందర్శించి తిరిగి వస్తున్నట్లు వారు తెలిపారు. రుస్తుంబాద సెవెంత్ డే స్కూల్ సమీపంలో ఓ వ్యాన్ వీరిని బలంగా ఢీకొనగా గాయపడ్డినట్లు స్థానికులు తెలిపారు.

February 22, 2026 / 07:40 PM IST

ఈ నెల 25న మార్కాపురంలో పర్యటించనున్న సీఎం

ప్రకాశం: ఈ నెల 25న మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ముందుగా దోర్నాల మండలం గంటవానిపల్లి ఫీడర్ కెనాల్ శంకుస్థాపన, అనంతరం మార్కాపురం పట్టణంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఉమ్మడి జిల్లా కలెక్టర్ పి. రాజబాబు అధికారులతో సమీక్షించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.

February 22, 2026 / 07:39 PM IST

‘దేశభక్తిని, సేవాభావాన్ని అలవర్చుకోవాలి’

మార్కాపురం బాయ్స్ హై స్కూల్‌లో ఆదివారం స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమ వ్యవస్థాపకులు లార్డ్ బాడెన్ పావెల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చిన్నతనం నుంచే దేశభక్తిని, సేవా భావాన్ని అలవర్చుకోవాలని హెచ్ఎం చంద్రశేఖర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 07:37 PM IST

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఆదివారం సాయంత్రం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. 30మంది లబ్ధిదారులకు రూ. 41,61,456లను చెక్కుల రూపంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

February 22, 2026 / 07:35 PM IST

‘యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి’

ASR: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని స్థానిక ఎస్సై ఎల్.సురేష్ సూచించారు. మండలంలోని తూటంగి గ్రామ పంచాయతీ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. గంజాయి సాగు, రవాణా వంటి అక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని తెలిపారు.

February 22, 2026 / 07:32 PM IST

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

VSP: అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ క్రికెటర్ శేఖర్‌కి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి మంజూరైన రూ.3 లక్షల చెక్కును గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అందజేశారు. ఈ దందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

February 22, 2026 / 07:28 PM IST

‘చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం’

అన్నమయ్య: వీరబల్లి మండలం దిగువరాచపల్లెలో ఆదివారం టీడీపీ పార్టీ గ్రామసభ జరిగింది. ఈ కార్యక్రమానికి రాజంపేట టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. CM చంద్రబాబు నాయకత్వంతోనే పేదల ఆర్థిక ఉన్నతి,రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక వైకాపా కుట్ర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.

February 22, 2026 / 07:27 PM IST

పలు ప్రాంతాలలో విస్తృత తనిఖీలు

PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం, సాలూరు పట్టణ కేంద్రాలలోడాగ్ స్క్వాడ్, బి.డి టీం సిబ్బందితో ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనుమానస్పద వస్తువులను నిశితంగా పరిశీలించారు. ప్రజలను అప్రమత్తంతో పాటు, ఎలాంటి సంఘ విద్రోహ ఘటనలు జరగకుండా ముందుస్తు చర్యలలో భాగంగా విస్తృత తనిఖీలు చేపట్టారు.

February 22, 2026 / 07:26 PM IST

మారేమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే

NDL: నంది కొట్కూరు మండలo, వడ్డెమానులో మారేమ్మ నూతన గుడిప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎమ్మెల్య జయసూర్య, మాండ్ర శివానంద రెడ్డి హాజరయ్యారు. ముందు తల్లి మారేమ్మ ను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ సర్పంచి దామోదర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 07:25 PM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఐ

శ్రీకాకుళంలోని జి.టి.రోడ్డులోని జామియా మసీదులో ఆదివారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో వన్‌ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పైడిపు నాయుడు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని సీఐ తెలిపారు. అలాగే, ముస్లిం భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రశంసనీయమని కొనియాడారు.

February 22, 2026 / 07:24 PM IST

రక్షణ శాఖ మంత్రిని కలిసిన డీసీసీ బ్యాంక్ ఛైర్మన్

KDP: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్‌ను ఆయన నివాసంలో బద్వేల్‌కు చెందిన డీసీసీ బ్యాంక్ ఛైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి శాలువా, పూల బొకే అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగినట్లు ఆయన తెలిపారు.

February 22, 2026 / 07:24 PM IST