• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాలి’

NDL: తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని YCP మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్‌భూపాల్ రెడ్డి సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. కాటసాని పిటిషన్‌పై CJI ధర్మాసనం విచారణ జరిపింది. కాటసానికి భద్రతపై సెక్యూరిటీ రివ్యూ కమిటీ మరోసారి సమీక్షించాలని ధర్మాసనం సూచించింది. భద్రత అవసరమో, కాదో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

February 24, 2026 / 05:11 PM IST

హిందూపురంలో అభివృద్ధి పనులకు భూమి పూజ

సత్యసాయి: హిందూపురం పట్టణంలోని పలు వార్డుల్లో రోడ్లు, కాలువలు, స్మశాన వాటిక నిర్మాణాలకు మంగళవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌సీ సబ్ ప్లాన్ నిధులతో 8వ వార్డు శ్రీకంఠపురం, 27వ వార్డు అంబేడ్కర్ నగర్, 4వ వార్డు త్యాగరాజ నగర్, 33వ వార్డు మేళాపురం ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్ పాల్గొన్నారు.

February 24, 2026 / 05:10 PM IST

219 మంది ఇంటర్ విద్యార్థులు గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభం అయినట్లు డీఐఈవో ఎం.వినోద్ బాబు తెలిపారు. 34 పరీక్షా కేంద్రాల్లో 12,422 మంది హాజరుకావాల్సి ఉండగా 12,203 విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు. 219 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేసేమని వారు తెలపారు.

February 24, 2026 / 05:10 PM IST

‘చిన్నారి పునర్వికకు పునర్జన్మ ఇవ్వండి’

కోనసీమ: అరుదైన వ్యాధితో బాధపడుతున్న కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన రెండేళ్ల చిన్నారి పునర్వికకు పునర్జన్మ ఇవ్వాలని రామచంద్రపురం మండలం అన్నాయిపేటకు చెందిన చిన్నారులు మంగళవారం విరాళాలు సేకరించారు. చిన్నారికి రూ.16 కోట్లు విలువచేసే ఇంజక్షన్ అవసరమని తెలిసి విరాళాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.20 వేలు సేకరించామన్నారు.

February 24, 2026 / 05:09 PM IST

‘పులివెందుల చరిత్ర రచనకు తవ్వా కృషి అభినందనీయం’

KDP: పులివెందుల చరిత్ర రచనలో డా. తవ్వా వెంకటయ్య చేస్తున్న కృషి అభినందనీయమని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. పులివెందులలో ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన వెంకటయ్య, త్వరలో వెలువరించనున్న చరిత్ర పుస్తకంపై చర్చించారు. పులివెందుల చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా పుస్తకాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

February 24, 2026 / 05:07 PM IST

జీఎంసీ ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు ఉండాలి: కమిషనర్

GNTR: నిర్మాణాలు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతించిన ప్లాన్ ప్రకారమే ఉండాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ మయూర్ అశోక్ హెచ్చరించారు. మంగళవారం శ్యామలానగర్, ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలను ఆయన పరిశీలించారు. పనులు ప్లానింగ్‌కు అనుగుణంగా సాగేలా కార్యదర్శులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

February 24, 2026 / 05:00 PM IST

బాధిత మహిళకు సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ

అనంతపురంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మీదేవికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కును ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ అందజేశారు. ఎల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన ఆమెకు చికిత్స ఖర్చుల నిమిత్తం రూ.50,462 మంజూరయ్యాయి. బాధితురాలి సమస్యను తెలుసుకున్న వెంటనే స్పందించి ఈ ఆర్థిక సాయం అందించినట్లు ఎంపీ తెలిపారు.

February 24, 2026 / 05:00 PM IST

సూర్యలంక బీచ్‌లో పర్యాటకుల అవస్థలు

BPT: సూర్యలంక బీచ్‌కు వచ్చే పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. విలువైన వస్తువులు దాచుకునేందుకు లాకర్ రూమ్ ఉన్నా అధికారులు దానిని ఇంకా తెరవలేదు. పంచాయతీ అధికారులు వేలం నిర్వహించకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో పర్యాటకులు తమ సామాన్లను ఇసుకలోనే ఉంచాల్సి వస్తోంది. కొన్నిసార్లు వస్తువులు చోరీకి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

February 24, 2026 / 05:00 PM IST

ఆర్టీసీ ప్రైవేటీకరణపై ఎన్ఎంయూ ధర్నా

PLD: వినుకొండ ఆర్టీసీ డిపో వద్ద ఎన్ఎంయూ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా జరిగింది. 12 డిపోలను ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులకు అప్పగించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. సంస్థే సొంతంగా బస్సులను కొనుగోలు చేసి, తమ సిబ్బందితో నడపాలని నేతలు శ్రీనివాసరావు, సౌభాగ్యరాజు డిమాండ్ చేశారు. విలువైన ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ పరం చేయొద్దన్నారు.

February 24, 2026 / 05:00 PM IST

కోమరోలు మండలంలో రేపు పవర్ కట్

ప్రకాశం: కొమరోలు మండలంలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏ.ఈ శ్రీనివాసులు తెలిపారు. నూతన విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా మండలంలోని చింతలపల్లి సబ్ స్టేషన్ పరిధిలో గ్రామాలకు బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు.ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని కోరారు.

February 24, 2026 / 05:00 PM IST

అసెంబ్లీలో గళ మెత్తిన ఎమ్మెల్యే

కృష్ణా: అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు రాష్ట్రంలో వెటర్నరీ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి మండలానికి పశువైద్యశాల ఏర్పాటు చేసి తగిన డాక్టర్లను నియమించాలని అన్నారు. గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న NTR కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రహరీ దుస్థితిలో ఉందని, నిధులు కేటాయించి ఆధునీకరించాలని కోరారు.

February 24, 2026 / 04:58 PM IST

విద్యార్థులకు కనకమహాలక్ష్మి దర్శనం

VZM: గరివిడి మండలం శ్రీరామ్ నగర్‌లోని ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌లో ఉన్న సుమారు 95 మంది బధిర విద్యార్థులకు చీపురుపల్లి DSP రాఘవులు ఆధ్వర్యంలో కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం మంగళవారం కల్పించారు. దర్శనం అనంతరం ప్రసాదాలు అందించి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని వారికి సూచించారు. విద్యార్థులను సురక్షితంగా తిరిగి సెంటర్‌కు చేర్చారు.

February 24, 2026 / 04:51 PM IST

ఆర్టీసీ బస్టాండ్లలో దుకాణాల వేలం.. రేపే ఆఖరు తేదీ

సత్యసాయి జిల్లాలోని పలు ఆర్టీసీ బస్టాండ్లలో ఖాళీగా ఉన్న దుకాణాలను టెండర్ ద్వారా కేటాయించనున్నారు. ఆసక్తి గల వ్యాపారస్తులు రేపు ఆయా డిపోలకు వెళ్లి టెండర్ ఫారాలను తీసుకోవచ్చు. టెండర్ దరఖాస్తులు సమర్పించడానికి కూడా రేపే చివరి రోజు అని అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన బస్టాండ్లలోని ఖాళీ గదులు నుంచి స్టాళ్ల వరకు ఈ వేలంలో పాల్గొనవచ్చు.

February 24, 2026 / 04:50 PM IST

డయేరియా పై ఇంఛార్జ్ మంత్రి ఆరా..!

SKLM: జిల్లాలో నమోదైన డయేరియా కేసులపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. మంగళవారం అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పలువురు బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని మంత్రికి వివరించారు.

February 24, 2026 / 04:47 PM IST

మార్చి 9న ANU గ్రౌండ్స్‌లో అగ్నివీర్ ర్యాలీ

GNTR: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానుందని గుంటూరు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మంగళవారం తెలిపారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) గ్రౌండ్స్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులకు ఈ ఎంపికలు జరుగుతాయని ఆయన వివరించారు. కావున అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 24, 2026 / 04:45 PM IST