• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అనుమానస్పద స్థితిలో ఇంటర్ విద్యార్థి మృతి

ప్రకాశం: గిద్దలూరు మండలం బురుజుపల్లి తాండాకు చెందిన గణేష్ నాయక్ కృష్ణాజిల్లా పెనమలూరులో రైల్వే ట్రాక్‌పై అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. గణేష్ నాయక్ పెనమలూరులోని ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. గణేష్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గిద్దలూరులో గోబీ బండి నడుపుకుంటూ గణేష్ తల్లిదండ్రులు జీవనం సాగిస్తున్నారని స్థానికులు తెలిపారు.

February 24, 2026 / 07:41 AM IST

కనకదుర్గమ్మను దర్శించిన వేలాది భక్తులు

SKLM: చీపురుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని మంగళవారం ఉదయం వేలాది నంది భక్తులు దర్శించారు. అనేక ప్రాంతాల నుంచి వంట పాత్రలతో చేరుకుని అన్నప్రసాదాలు స్వయంగా చేపట్టి స్వీకరిస్తారని స్థానికులు తెలిపారు. ఎంతో అద్భుతంగా అమ్మవారి అలంకరణ అందరిని ఆకట్టుకుంది.

February 24, 2026 / 07:41 AM IST

పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NTR: ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో రూ.20 లక్షల మండల పరిషత్ నిధులతో నిర్మించనున్న త్రాగునీటి పైప్ లైన్ నిర్మాణానికి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కృష్ణానది పరివాహక ప్రాంతం పక్కనే ఉన్నప్పటికీ దాములూరు గ్రామంలో ప్రజల ఇబ్బందులు పడుతున్నారని,వారి సమస్యకు శాశ్వత పరిష్కారంగా పైప్ లైన్ నిర్మిస్తున్నామన్నారు.

February 24, 2026 / 07:40 AM IST

లింగపాలెం మద్యం దుకాణాల్లో తనిఖీలు

ELR: లింగపాలెం మండలంలోని ప్రభుత్వ మద్యం దుకాణాలను సోమవారం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లోని నిల్వలను పరిశీలించడంతో పాటు, ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం సీసాలను స్కాన్ చేసి వివరాలను సరిచూశారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.. వినియోగదారులకు ప్రభుత్వం నిర్ణయించిన MRP ధరలకే మద్యం విక్రయించాలని సూచించారు.

February 24, 2026 / 07:35 AM IST

ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత ఉండాలి: ఎంపీ

కోనసీమ జిల్లా డ్వామా పీడీగా బాధ్యతలు స్వీకరించిన రాంబాబు సోమవారం సాయంత్రం అమలాపురంలో ఎంపీ గంటి హరీశ్ మాధుర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపాధి హామీ పథకంలో పనులు పారదర్శకంగా జరిగేలా చూడాలని ఈ సందర్భంగా ఎంపీ సూచించారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి, ఎక్కడా అక్రమాలకు తావులేకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

February 24, 2026 / 07:35 AM IST

‘సత్ప్రవర్తనతో జీవించాలి’

కడప: ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు శాఖ నిన్న విస్తృత కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులు, చెడు నడత కలిగిన వారికి అవగాహన కల్పించారు. నేరాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, కుటుంబంతో కలిసి గౌరవప్రదమైన జీవనం గడపాలని సూచించారు.

February 24, 2026 / 07:35 AM IST

NSRS నిర్వాసితులకు CPT టెస్ట్ మినహాయింపు

NDL: శ్రీశైలం (NSRS) ప్రాజెక్టు నిర్వాసితుల ప్రత్యేక పునరావాస విధానం కింద నియమితులైన జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్‌లకు CPT టెస్ట్ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇవి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ లేదా కారుణ్య నియామకాలు కాకుండా ప్రత్యేక విధానంలో సోమవారం చేసిన నియామకాలని వెల్లడించింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి మెమో జారీ చేశారు.

February 24, 2026 / 07:32 AM IST

డిగ్రీ పరీక్షల్లో 12 మంది విద్యార్థులు డిబార్

ATP: అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న మొదటి సెమిస్టర్ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న 12 మంది విద్యార్థులను డిబార్ చేసినట్లు పరీక్షల విభాగం సంచాలకుడు ఆచార్య జీవీ రమణ తెలిపారు. అనంతపురంలోని శ్రీచైతన్య కళాశాలలో ముగ్గురు, ఎస్ఎల్ఎన్ కళాశాలలో ఆరుగురు విద్యార్థులు పట్టుబడ్డారు.

February 24, 2026 / 07:23 AM IST

‘అక్రమ కట్టడాలపై GIS నిఘా’

కర్నూలులో పట్టణ ప్రణాళిక అధికారులు, సెక్రటరీలతో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో అనుమతులు లేకుండా నిర్మించిన అనధికార కట్టడాలపై భౌగోళిక సమాచార వ్యవస్థ (GIS) ఆధారంగా ఉక్కుపాదం మోపాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ప్రతి సచివాలయ పరిధిలో GIS డేటా ఆధారంగా అక్రమ నిర్మాణాలను గుర్తించి అకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు.

February 24, 2026 / 07:21 AM IST

మార్చి 1న ఉచిత వైద్య శిబిరం

శ్రీకాకుళం పట్టణం సంతోషిమాత ఆలయ సమీపంలో మార్చి 1న ఉదయం 8 గంటల నుంచి ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్టు లిటిల్ మాస్టర్స్ తల్లీ పిల్లల ఆస్పత్రి ప్రతినిధులు డాక్టర్ అన్వేష్, డాక్టర్ వాసంతి తెలిపారు. షుగర్, బీపీ పరీక్షలతో పాటు మందులు ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 24, 2026 / 07:20 AM IST

మహిళల భద్రతకు భరోసా “శక్తి” యాప్

ATP: మహిళల భద్రతకు భరోసా అయిన “శక్తి” యాప్ పై విస్తృతంగా శక్తి బృందాలు అవగాహన కల్పించాయి. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మహిళలు, బాలికల భద్రతే లక్ష్యంగా “శక్తి” యాప్ పై సోమవారం సాయంత్రం, వివిధ విద్యాసంస్థలు, ఆర్టీసీ బస్టాండ్లు, తదితర ప్రజా ప్రదేశాల్లో మహిళలకు, మరియు విద్యార్థినిలకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు.

February 24, 2026 / 07:20 AM IST

BPS-LRS సద్వినియోగం కోరిన మంత్రి

కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు BPS-LRS స్కీంలను తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి టీజీ భరత్ సోమవారం పిలుపునిచ్చారు. పర్మిషన్ లేకుండా నిర్మించిన భవనాలు, అక్రమ లే-అవుట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. BPSకు మార్చి 11 వరకు, LRSకు ఏప్రిల్ 23 వరకు గడువు ఉందన్నారు.

February 24, 2026 / 07:18 AM IST

సింగపూర్ భక్తుల సంగీత విభావరి

SS: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో చైనీస్ నూతన సంవత్సర వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి నిర్వహించిన సాంప్రదాయ ఊరేగింపు, బియ్యం ఆశీర్వచన కార్యక్రమం భక్తులను ఆకట్టుకున్నాయి. సింగపూర్ భక్తులు ప్రదర్శించిన సంగీత విభావరి ఆధ్యాత్మిక అనుభూతిని పంచింది. గ్లోబల్ కౌన్సిల్ ఛైర్మన్ చక్రవర్తి, సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ పాల్గొన్నారు.

February 24, 2026 / 07:14 AM IST

ఇంటర్ పరీక్షకు 39 మంది గైర్హాజరు

ELR: బుట్టాయగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 152 మంది అభ్యర్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 113 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అలాగే 39 మంది పరీక్షకు హాజరు కాలేదని అధికారులు పేర్కొన్నారు.

February 24, 2026 / 07:10 AM IST

వాట్సాప్ సేవలపై అవగాహన పెంచాలి: కలెక్టర్

అన్నమయ్య: మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ నిశాంత్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వాట్సాప్ ద్వారా అందించే సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, భూసేకరణ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులను నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు.

February 24, 2026 / 07:09 AM IST