• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మాజీ మంత్రి కాకాణికి మరోసారి నోటీసులు

NLR: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 24న రూరల్ డీఎస్పీ ఆఫీస్‌లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా విచారణ వాయిదా పడింది. కాగా గుమ్మలదిన్నెలో బాలిక మృతిపై నిరాధార ఆరోపణలు చేసిన కేసులో ఆయనను విచారించనున్నారు.

February 21, 2026 / 07:47 AM IST

బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించిన విద్యార్థులు

కడప: నగరంలోని SKR, SKR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు శుక్రవారం సీ.పీ బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించారు. అక్కడి పుస్తకాలను, తామ్రపత్రాన్ని, తాళపత్ర గ్రంధాలను, రాత పత్రాలను చూసి తెలుసుకున్నారు. సహాయ పరిశోధకులు బూతిపూరి గోపాలకృష్ణ వాటి గురించి వివరించారు. కళాశాల అధ్యాపకులు డా. ఎం గురు మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

February 21, 2026 / 07:46 AM IST

శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న విదేశీయులు

TPT: శ్రీకాళహస్తీశ్వరున్ని శుక్రవారం జర్మనీ, రష్యా దేశానికి చెందిన సుమారు 200 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు కల్పించారు. విదేశీయులు సాంప్రదాయ దుస్తులలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయంలోని శిలా నైపుణ్యాలను పరిశీలించి నిర్మాణ శైలికి మంత్రముగ్ధులయ్యారు. ఆలయాన్ని సందర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు.

February 21, 2026 / 07:44 AM IST

కన్నులపండువగా పైడితల్లి అమ్మవారి నేత్రోత్సవం

VZM: పొలిపల్లి పైడితల్లి అమ్మవారికి నేత్రోత్సవం శుక్రవారం కన్నులపండువగా నిర్వహించారు. ఈ ప్రక్రియ దశాబ్దాలుగా ఆనవాయితిగా జరుగుతుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం వంశ పారంపర్య ధర్మకర్తలు, వాకచర్ల కుటుంబీకులు మంగళవాయిద్యాలతో ఆలయానికి చేరుకొని పసుపు, కుంకుమలు, పట్టువస్త్రాలు సమర్పించారు.

February 21, 2026 / 07:38 AM IST

జాతీయ రహదారి నిర్మాణంలో ఫ్లైఓవర్ కావాలని వినతిపత్రం

KKD: జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎంపీ సానా సతీష్ ఢిల్లీలో ఎన్‌హెచ్ఐఐ ఛైర్మన్ సంతోశ్ కుమార్ యాదవన్‌ను కలిసి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. రామవరం-తాళ్లూరు మధ్య బైపాస్ నిర్మాణం వల్ల రైతుల భూములు పోతున్నాయని, దానికి బదులు ఎలివేటెడ్ ఫ్లైఓవర్లు నిర్మించాలని కోరారు.రైతుల ప్రయోజనాలను దృష్ట్యా జాతీయ రహదారి అలైన్మెంటు పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు.

February 21, 2026 / 07:38 AM IST

నియోజకవర్గ సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎం: MLA

PPM: ఏపీ సీఎం చంద్రబాబును నిన్న అమరావతిలో పాలకొండ MLA నిమ్మక జయకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాటి శాశ్వత పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారని తెలిపారు.

February 21, 2026 / 07:35 AM IST

‘ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’

అల్లూరి: స్మార్ట్ ఫోన్లు ఉన్నవారు ఆన్‌లైన్ మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని కొయ్యూరు మండలం మంప ఎస్సై శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. శుక్రవారం రేవళ్లలో పర్యటించారు. గ్రామస్థులతో సమావేశమయ్యారు. సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు. యూపీఐ, స్కాలర్షిప్‌ పేరుతో నేరగాళ్లు వల వేస్తున్నారన్నారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులు, మెసేజ్‌లపై క్లిక్ చేయవద్దన్నారు.

February 21, 2026 / 07:34 AM IST

గుడివాడలో విస్తృతంగా పర్యటించిన కమీషనర్

కృష్ణా: గుడివాడ పురపాలక కమిషనర్ ఎస్. మనోహర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, ఏఈ, శానిటరీ ఇన్‌స్పెక్టర్, సచివాలయ సిబ్బందితో కలిసి కర్మికానగర్, సాయినగర్, చెంచుపేట ప్రాంతాలలో పర్యటించారు. శనివారం ఉదయం స్థానిక ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థను సమీక్షించి, లీకేజీలు ఉంటే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

February 21, 2026 / 07:34 AM IST

కనిగిరిలో యదేచ్చగా భూముల కబ్జా’

మార్కాపురం జిల్లా కనిగిరిలో దళితుల భూమిని రాత్రిపూట ఫినిషింగ్ రాళ్లతో అక్రమంగా కబ్జా చేశారని స్థానిక దళితులు ఆరోపిస్తున్నారు. ఈ భూ-కబ్జాపై ల్యాండ్ గ్రాబింగ్, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీస్, రెవెన్యూ శాఖలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

February 21, 2026 / 07:32 AM IST

పరవాడలో షటిల్ బ్యాట్మెంటన్ పోటీలు ప్రారంభం

AKP: పరవాడ మండలం తానాం గ్రామంలో శుక్రవారం రాత్రి షటిల్ బ్యాట్మెంటన్ పోటీలను మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. గ్రామంలో పరదేశిమాంబ జాతర సందర్భంగా పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులకు తగిన ప్రోత్సహం అందించినందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

February 21, 2026 / 07:32 AM IST

అరకు ఎన్టీఆర్ జంక్షన్ వద్ద స్పెషల్ డ్రైవ్

అల్లూరి: శుక్రవారం రాత్రి అరకు ఎన్టీఆర్ జంక్షన్ వద్ద రోడ్ అవేర్నెస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని సీఐ ఎల్.హిమగిరి తెలిపారు. వాహన తనిఖీలు నిర్వహించారు. కొంతమంది నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు గురై, ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయన్నారు. క్షేమంగా గమ్య స్థానాలకు చేరేందుకు డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు.

February 21, 2026 / 07:31 AM IST

ELR: వ్యభిచార గృహంపై పోలీసుల ఆకస్మిక దాడి

ELR: ద్వారకతిరుమల మండలం గొల్లగూడెంలో నిర్వహిస్తున్న వ్యభిచారం గృహంపై ఎస్సై సుధీర్ తన సిబ్బందితో కలిసి శుక్రవారం ఆకస్మిక దాడులు చేశారు. ఎస్సై మాట్లాడుతూ.. పంచవ నాగమణి, భర్త సునీల్ గృహంలోనే విటులను రప్పించి అసాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని వచ్చిన సమాచారంతో ఇద్దరూ విటులను, ఒక బాధితురాలను అదుపులోకి తీసుకున్నామన్నారు.

February 21, 2026 / 07:28 AM IST

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే

NTR: గత రెండు నెలల క్రితం టీడీపీ సీనియర్ కార్యకర్త ఇప్పిలి రాంబాబు గుండెపోటుతో మరణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా ఆయన కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయంగా రూ.10,000 / చెక్కును నిన్న అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఏ అవసరం వచ్చిన తమను సంప్రదించాలని రాంబాబు కుటుంబ సభ్యులను కోరారు.

February 21, 2026 / 07:27 AM IST

సైబర్ నేరాలపై గూడూరులో అవగాహన

KRNL: గూడూరు నగర పంచాయతీ SC కాలనీలో SI రాజ కుళ్లాయప్ప సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, IVRS కాల్స్, నకిలీ రుణాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని, అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. అనుమానిత కాల్స్ విషయంలో జాగ్రత్త వహించాలని కోరారు.

February 21, 2026 / 07:26 AM IST

అంజలి అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాలు: డీఎస్పి

అన్నమయ్య: ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న కులవర్ధన్ తల్లి అంజలిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ మహేంద్ర శుక్రవారం తెలిపారు. కేసు అత్యంత దారుణంగా జరిగినదని, మైనర్ బాలికను పరిగణనలోకి తీసుకోకుండా అగంతకుడు కులవర్ధన్ బాలికను హత్యకు గురిచేశాడని పేర్కొన్నారు. చట్టం తన పని తానే చేస్తుందన్నారు.

February 21, 2026 / 07:26 AM IST