• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఆర్గానిక్ ఫార్మింగ్ మేళాను ప్రారంభించిన ఎంపీ

NTR: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన ఆర్గానిక్ రైతోత్సవం, న్యాచురల్ ఫార్మింగ్ మేళాను ఎంపీ కేసినేని చిన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రైతులు రసాయన ఎరువులు వాడకం తగ్గించాలనేది సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని అన్నారు. ఆర్గానిక్ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారా అధిక ఆదాయం, నాణ్యమైన ఆహారం అందుతుందని తెలిపారు.

February 22, 2026 / 02:50 PM IST

రేపు యథావిధిగా రెవెన్యూ క్లినిక్: కలెక్టర్

E.G: రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ‘మీకోసం కార్యక్రమం’ (PGRS), రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల స్థాయిలలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. అలాగే, నమోదైన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

February 22, 2026 / 02:50 PM IST

కాంగ్రెస్ కార్యాలయంపై దాడి పిరికిపంద చర్య

KRNL: దేవనకొండలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో కర్నూలులో కాంగ్రెస్ కార్యాలయంపై జరిగిన దాడిని జిల్లా అధ్యక్షుడు మహేంద్ర నాయుడు తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగం, వాణిజ్య ఒప్పందాలపై ప్రశ్నిస్తే దాడులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. దాడులతో కాంగ్రెస్ శ్రేణులను భయపెట్టలేరని హెచ్చరించారు.

February 22, 2026 / 02:48 PM IST

‘కార్మిక విధానాల కోసం ఐక్యంగా పోరాడాలి’

SKLM: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ నాగమణి పిలుపునిచ్చారు. ఆదివారం నరసన్నపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద సీఐటీయూ విస్తృత సమావేశం జరిగింది. అంగన్వాడి, ఆశా, మధ్యాహ్నభోజనం, వివోఏ, తదితర స్కీం వర్కర్లకు వేతనాలు వెంటనే పెంచాలన్నారు.

February 22, 2026 / 02:44 PM IST

పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన గిద్దలూరు CI

ప్రకాశం: రేపట్నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సీఐ రామకోటయ్య సందర్శించారు. పరీక్ష నిర్వహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీస్ సిబ్బందికి, నిర్వహణ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ప్రజలు గమనించి గుంపులుగా ఉండొద్దని చెప్పారు.

February 22, 2026 / 02:41 PM IST

‘క్యాన్సర్‌‌ను సకాలంలో గుర్తించి చికిత్స పొందాలి’

కృష్ణా: క్యాన్సర్‌‌ను సకాలంలో గుర్తించి చికిత్స పొందాలని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. ఆదివారం చల్లపల్లి మండలం వక్కలగడ్డలో పీఏసీఎస్ చైర్మన్ మల్లుపెద్ది దుర్గామహేష్ ఆధ్వర్యంలో బసవతారకం ఇండో – అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వారిచే ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని వెంకట్రామ్ ప్రారంభించారు.

February 22, 2026 / 02:41 PM IST

వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి

NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా అబుల్ కలాం ఆజాద్ విద్యలో అనేక మార్పులు తీసుకువచ్చి, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని సంకల్పంతో విధులు నిర్వహించారని కొనియాడారు.

February 22, 2026 / 02:41 PM IST

రేపు కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం: కలెక్టర్

కోనసీమ: అమలాపురం కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి నిర్ణీత సమయంలో పరిష్కరించుకోవాలని కోరారు.

February 22, 2026 / 02:40 PM IST

అన్నమయ్య: BED విద్యార్థిని ఆత్మహత్య

అన్నమయ్య: రైల్వే కోడూరులోని రంగనాయకుల పేటలో ఇవాళ B.Ed చదువుతున్న ఆమంచి భార్గవి (24) ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI లక్ష్మీ ప్రసాల్ రెడ్డి తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

February 22, 2026 / 02:33 PM IST

రేపే ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..!

WG: ఆచంట ఎంవీఆర్ జూనియర్ కళాశాల కేంద్రంలో సోమవారం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 270 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా, ఉదయం 9 గంటలకు పరీక్ష మొదలవుతుందని ప్రిన్సిపల్ ఎన్. శ్రీదేవి తెలిపారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో జరుగుతాయని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.

February 22, 2026 / 02:31 PM IST

రూ.42 లక్షల విలువ గల చెక్కులు పంపిణీ

ATP: ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు 29 మంది బాధితులకు రూ.42 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గత ఐదేళ్లలో నిరుపేదలకు ఇటువంటి సాయం అందలేదని, ఇప్పుడు పారదర్శకంగా లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు.

February 22, 2026 / 02:30 PM IST

‘రూ. 203 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలి’

GNTR: రాష్ట్రంలోని 16 సంఘాల ఆధ్వర్యంలో మంగళగిరిలో ‘చేనేత గర్జన’ నిర్వహించారు. ఎన్నికల్లో ఇస్తానన్న రూ. 25 వేల సాయం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీలు అమలు చేయలేదని కార్మికులు మండిపడ్డారు. రూ. 203 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధులు ఇచ్చామని మంత్రి సవిత అబద్ధాలు చెప్తున్నారని, కేంద్రం జీఎస్టీ భారం తగ్గించాలని కోరారు.

February 22, 2026 / 02:29 PM IST

‘చెత్త సేకరణ సమర్థవంతంగా నిర్వహించాలి’

SKLM: గ్రామాల్లో చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని పరిశుద్ధ కార్మికులకు ఎమ్మెల్యే గొoడు శంకర్ సూచించారు. గార మండలం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఆదివారం ట్రై సైకిల్స్, చెత్త డబ్బాలు ఆయన పంపిణీ చేశారు. అధికారులతో కలిసి గార జంక్షన్ వరకు అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయొద్దని కోరారు.

February 22, 2026 / 02:29 PM IST

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: MLA

PLD: వినుకొండ TDP కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు ఆదివారం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారితో ఆయన ముఖాముఖి మాట్లాడి వినతులు స్వీకరించారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాల మంజూరులో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే తన ప్రధాన ధ్యేయమన్నారు.

February 22, 2026 / 02:27 PM IST

వరాహ నదిలో ప్లాస్టిక్ వ్యర్ధాలు ఏరివేత

AKP: ఎస్.రాయవరం మండలం వమ్మవరం వద్ద ఆదివారం సంత్ నిరంకారీ మిషన్ ఆధ్వర్యంలో వరాహ నదిలో ప్లాస్టిక్ వ్యర్ధాలు నాచు తొలగించి శుభ్రం చేశారు. మిషన్ కసింకోట సెక్టార్‌కు చెందిన సంయోజకులు కె చిదంబరావు, నాగరాజు, ప్రచారకులు సత్యవతి, వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వ్యర్ధాలు వల్ల నది జలాలు కలుషితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

February 22, 2026 / 02:25 PM IST