చిత్తూరు న్యూ రాజీవ్ కాలనీలో దివంగత TDP నాయకురాలు దుర్గ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొని ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అనుబంధ కమిటీల సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ప్రకాశం: కొండేపిలోని బీసీ కాలనీలో ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండేపి సీఐ సోమశేఖర్, వారి సిబ్బందితో కాలనీలోని ప్రతి ఇంటిని, అనుమానిత వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 28 ద్విచక్ర వాహనాలను, 5 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 33 వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కృష్ణా: తోట్లవల్లూరులో తెలుగు యువత ఆధ్వర్యంలో ప్రజల సమస్యలపై ప్రత్యేక కార్యక్రమం ఆదివారం జరిగింది. తోట్లవల్లూరు గ్రామ తెలుగు యువత అధ్యక్షుడు బొడ్డు నితీష్ నేతృత్వంలో గ్రామస్థుల నుంచి సూచనలు, సమస్యలు స్వీకరించారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, ఉపాధి వంటి అంశాలపై ప్రజలు తమ విన్నపాలు తెలిపారు.
PLD: ఏపీలో కాంగ్రెస్ ఆఫీసులపై ఏబీవీపీ దాడులను సత్తెనపల్లి పార్టీ పట్టణ అధ్యక్షుడు జ్ఞాన్ రాజ్ పాల్ ఖండించారు. ఆఫీసుల్లో ఫర్నిచర్ ధ్వంసం చేయడం అనాగరికమన్నారు. ఢిల్లీ ఏఐ సదస్సులో మోడీ ప్రభుత్వ తీరును నిరసిస్తే ఆంధ్రాలో దాడులకు దిగుతారా అని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డితో కలిసి కొత్త వెల్లంటి, పాత వెల్లంటి గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన త్రీ ఫేజ్ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ప్రారంభించారు. సీఎం చంద్రబాబు సహకారంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నామని, విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
కోనసీమ: రామచంద్రపురం రూరల్ మండలం వెంకటాయపాలెం గ్రామంలో ఇటీవల అకాల మరణం చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు తోట రాము సోదరుడు తోట సత్యనారాయణ కుటుంబాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఆయన మరణం కుటుంబానికి మాత్రమే కాకుండా ఈ ప్రాంతానికి కూడా తీరని లోటు అని అన్నారు.
కృష్ణా: మచిలీపట్నం బైపాస్ రోడ్డులోని వాసవి భవన్‌లో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి డా. కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో APSRTC ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోశయ్య సేవలను వారు కొనియాడారు.
శ్రీకాకుళంలోని బలగమెట్టు సమీపంలో మున్సిపల్ కమిషనర్ కూర్మారావు ఆధ్వర్యంలో ఆదివారం “హ్యాపీ సండే” కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. నగరాభివృద్ధి, ప్రజల ఆరోగ్యం కోసం శ్రమిస్తున్న మున్సిపల్ అధికారుల మానసిక ప్రశాంతత కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు.
GNTR: మంగళగిరి మెయిన్ బజార్‌లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రద్దీ వేళల్లో భారీ సరుకు రవాణా వాహనాలు తిరగడమే ప్రధాన కారణం. గాలిగోపురం నుంచి మిద్దె సెంటర్ వరకు రోడ్లపై వాహనాలు అడ్డదిడ్డంగా నిలుపుతున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దీ లేని సమయాల్లోనే సరుకు రవాణాకు అనుమతించాలని కోరుతున్నారు.
GNTR: ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు GMC కమిషనర్ కె. మయూర్ అశోక్ వెల్లడించారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలు హాజరై తమ సమస్యలను తెలియజేసి పరిష్కారం పొందాలని సూచించారు.
WG: మొగల్తూరు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పేరుపాలెం బీచ్‌కు ఆదివారం పర్యాటకులు భారీగా తరలివచ్చారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సందర్శకులు కుటుంబ సభ్యులతో కలిసి సముద్ర స్నానాలు చేస్తూ ఇసుక తిన్నెలపై సరదాగా గడిపారు. తీరంలోని ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
E.G: నల్లజర్ల మండలం పోతవరంలో ఏర్పాటు చేయనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ & వాటర్ ట్యాంకులను గోపాలపురం MLA మద్దిపాటి వెంకటరాజు ఆదివారం శంకుస్థాపన చేశారు. విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా గ్రామ ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు అందేలా కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. జల జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రజలకు శాశ్వతంగా మంచినీరు అందించనున్నట్లు చెప్పారు.
అన్నమయ్య: మదనపల్లి కలెక్టరేట్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన రావు, నరసింహారెడ్డి జీవితం యువతకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తొలి సాయుధ పోరాట యోధుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు.అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
KRNL: ప్రజల్లో ఆరోగ్యం,ఆనందాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం హ్యాపీ సండే కార్యక్రమాన్ని పునఃప్రారంభించినట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. ఆదివారం కొండారెడ్డి బురుజు వద్దనున్న పార్కులో తొలి హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా, చెస్, కబడ్డీ, సంగీత, నృత్య ప్రదర్శనలు నిర్వహించి ఉద్యవన సందర్శకుల్లో ఉత్సాహాన్ని నింపారు.
NDL: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి త్యాగం యువతకు స్ఫూర్తిదాయకమని, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని జిల్లా రెవెన్యూ అధికారి డి. రాము నాయక్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతి కార్యక్రమ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.