• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో సచివాలయంకు రోడ్డుకు ఆదివారం కురుపాం MLA తోయక జగదీశ్వరి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పనకు అతిపెద్ద పీట వేస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు.

March 8, 2026 / 07:21 PM IST

కనిగిరి రిజర్వాయర్ అభివృద్ధికి సీఎం అనుమతి

NLR: కనిగిరి రిజర్వాయర్ అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలుల విషయంపై జిల్లా కలెక్టర్‌తో మాట్లాడడం జరిగిందన్నారు. ఎక్కడ ఇటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. డెల్టా ప్రాంతమైన కోవూరుకు మంచి రోజులు వస్తున్నాయి అన్నారు.

March 8, 2026 / 07:20 PM IST

‘డోన్‌ను కర్నూలులో కలపాలి’

KRNL: నంద్యాలలో డీసీసీ అధ్యక్షుడు మద్దిలేటి సీఎం చంద్రబాబును డోన్‌ను కర్నూలులో కలపాలని కోరారు. డోన్ నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో కలుపుతామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని అన్నారు. డోన్ నుంచి నంద్యాలకు వెళ్లాలంటే ఎక్కువ వ్యయం, ప్రయాసాలు ఎదురవుతున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బేడ బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చి ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆయన కోరారు.

March 8, 2026 / 07:20 PM IST

‘పేద మహిళలకు ఉచిత వైద్యం అందించాలి’

TPT: ఉమెన్స్ డే సంధర్భంగా మహిళా సమాఖ్య తిరుపతి నగర సమితి ఆధ్వర్యంలో తిరుపతి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో సుమారు 200 మందికి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి ఎన్. మంజుల మాట్లాడుతూ.. పేద మహిళలకు ప్రైవేట్ వైద్యశాలల్లో ఉచిత వైద్యం అందించాలని కోరారు. మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా శాంతియుత సమాజం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

March 8, 2026 / 07:18 PM IST

నూతన ఏజీపీకి ఘనంగా సన్మానం

కృష్ణా: అవనిగడ్డ నూతన ఏజీపీ బొప్పన వెంకట సుబ్రహ్మణ్యేశ్వర రావును మండలి అభిమానులు సత్కరించారు. ఆదివారం స్వర్గీయ ఎంవీ కృష్ణారావు విగ్రహం వద్ధ అయనను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. డీసీ వైస్ ఛైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్, సొసైటీ ఛైర్మన్ యలవర్తి చిన్నా, గాంధీ క్షేత్రం కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు, టీసీ రవీంద్ర, బడే సుబ్బారావు, డేగల రాఘవ పాల్గొన్నారు.

March 8, 2026 / 07:11 PM IST

వెంకటాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభం

అన్నమయ్య: గాలివీడు మండలం పందికుంట గ్రామం వెంకటాపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు.

March 8, 2026 / 07:10 PM IST

షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామక చట్టంపై అవగాహన

ASR: ముంచంగిపుట్టు(మం) జఫ్ఫార్ గ్రామంలో షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామక చట్టం ప్రాముఖ్యతపై ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు ఆదివారం అవగాహన కల్పించారు. ఆదివాసీ చట్టాలు, ఆదివాసి సత్యాగ్రహ యాత్ర గురించి జేఏసీ అల్లూరి జిల్లా ఛైర్మన్ రామారావు దొర గ్రామ, గ్రామాన వివరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో JAC నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

March 8, 2026 / 07:06 PM IST

రాష్ట్ర స్థాయి యాదవ మహాసభలో ఎన్నికలు

TPT: విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి యాదవ మహాసభలో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి కొత్త కమిటీని ఎన్నుకున్నారు. నియోజకవర్గ అధ్యక్షుడిగా కునాటి రమణయ్య యాదవ్ ఎన్నిక కాగా, నియోజకవర్గ కార్యదర్శిగా జనార్దన్ యాదవ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నాయకులు వారిని అభినందిస్తూ యాదవ సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

March 8, 2026 / 07:03 PM IST

మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించిన MLA అదితి

VZM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీడీపీ పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో విశేష సేవలందిస్తున్న మహిళలను ఆమె సన్మానించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి అందరికి పంచారు.

March 8, 2026 / 07:03 PM IST

లక్కరాజుగార్లపాడులో ఆలయాల శంకుస్థాపన

PLD: సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు గ్రామంలో శ్రీ పంచ పట్టాభి రామస్వామి, శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాల శంకుస్థాపన మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని శంకుస్థాపన కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు.

March 8, 2026 / 07:00 PM IST

తోటచర్లలో వ్యవసాయ సహకార గోదామును ప్రారంభం

NTR: పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో రూ.75 లక్షల వ్యయంతో నిర్మించారు. ఈ గోదామును ఆదివారం కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం, జగ్గయ్యపేట ఎమ్మెల్యే తాతయ్య కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు మాట్లాడుతూ.. రైతులకు పంటలను సురక్షితంగా నిల్వ చేసుకునే సౌకర్యం కల్పించేందుకు ఈ గోదాం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

March 8, 2026 / 07:00 PM IST

‘ఆర్డీటీ కోసం ఎంతటి పోరాటాలకైనా సిద్ధం’

సత్యసాయి: ఆర్డీటీని కాపాడుకోవడానికి ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని ఆర్డీటీ అఖిలపక్ష కమిటీ కన్వీనర్ సాకే హరి తెలిపారు. ఆదివారం బత్తలపల్లి కేంద్రంలోని ఆర్డీటీ వ్యవస్థాపకుడు విన్సెంట్ ఫెర్రర్ ఘాట్‌ను సందర్శించి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల గుండెల్లో ఆర్డీటీ శాశ్వతంగా నిలిచిపోయిందని కొనియాడారు.

March 8, 2026 / 07:00 PM IST

మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానం

నఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కనిగిరి పోలీస్ స్టేషన్‌లో సేవలందిస్తున్న మహిళా హోమ్ గార్డ్, స్వీపర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కనిగిరి సీఐ శ్రీనివాసరావు శాలువా కప్పి వారికి బహుమతులు అందజేశారు. మహిళల సేవలను అభినందిస్తూ వారి కృషిని కొనియాడారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

March 8, 2026 / 07:00 PM IST

BJYM జిల్లా కార్యదర్శిగా టీవీఎస్ అఖిల్ నాయుడు

బీజేపీ యువమోర్చా (BJYM) అనంతపురం జిల్లా కార్యదర్శిగా గుంతకల్లుకు చెందిన ఆడిటర్ టీవీఎస్ అఖిల్ నాయుడు నియమితులయ్యారు. BJYM రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కోనకొండ్ల రాజేష్ ఆమోదం మేరకు జిల్లా యువమోర్చా అధ్యక్షులు శివతేజేశ్వరరెడ్డి ఈ నియామకాన్ని ప్రకటించారు. పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

March 8, 2026 / 07:00 PM IST

మహిళా జాబ్ మేళాలో 64 మంది ఎంపిక

కోనసీమ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రామచంద్రపురం టౌన్ హాల్‌లో నిర్వహించిన మహిళల జాబ్ మేళాలో వివిధ కంపెనీలకు 64 మంది ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కోసం ఎదురుచూసే వారు రామచంద్రపురంలో ఉన్న ఉపాధి కార్యాలయంలో తమ అప్లికేషన్ అందిస్తే వారి అర్హతను బట్టి అవకాశాలను తెలియజేస్తామని తెలిపారు.

March 8, 2026 / 07:00 PM IST