• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మీడియా వారికి అక్రెడిటేషన్ కార్డుల అందజేత

TPT: కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ బుధవారం మీడియా ప్రతినిధులకు అక్రెడిటేషన్ కార్డులను అందజేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన జర్నలిజం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరేలా చూడాలన్నారు.

February 25, 2026 / 05:17 PM IST

గ్రామాభివృద్ధికి సమిష్టి కృషి

PLD: మాచవరంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. గ్రామాల అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని ఎంపీపీ అంజమ్మ కోరారు. వర్షాలతో ఈ ఏడాది వ్యవసాయం లాభసాటిగా సాగిందని స్పెషల్ ఆఫీసర్ కృష్ణదేవరాయలు తెలిపారు. కుక్కలు, కోతుల బెడదను అరికట్టాలని ఎంపీడీవో విష్ణు చిరంజీవి సూచించారు. అలాగే రూ.1.20కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

February 25, 2026 / 05:15 PM IST

మొక్కల పెంపకంపై విద్యార్థులకు అవగాహన

AKP: కోటవురట్ల ప్రభుత్వ హైస్కూల్లో 6, 7, 8వ తరగతుల విద్యార్థులకు బుధవారం ఫ్రీ ఒకేషనల్ విజిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా మండలంలో గొట్టివాడ గ్రామంలో అటవీ శాఖ నర్సరీని సందర్శించారు. మొక్కల పెంపకంపై వారికి అవగాహన కల్పించారు. అనంతరం రాజుపేటలో పామాయిల్ మొక్కల పెంపకం గురించి వివరించారు. కైలాసపట్నంలో లక్క బొమ్మల తయారీ గురించి తెలుసుకున్నారు.

February 25, 2026 / 05:12 PM IST

డ్రగ్స్‌పై అవగాహన ర్యాలీలో పాల్గొన్న సినీ హీరో సుమన్

NTR: నందిగామలో డ్రగ్స్ పై అవగాహన సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సినీ హీరో సుమన్ హాజరై డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో 30వ రోజుకు చేరిన ఈ ర్యాలీ జాతరను తలపించింది. డీజే సౌండ్స్‌తో సాగిన ర్యాలీలో పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

February 25, 2026 / 05:07 PM IST

‘అంగన్వాడీల వేతనం పెంచాలి’

AKP: వేతనాలు పెంచాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. బుధవారం ఎలమంచిలి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. మే నెలలో వేసవి సెలవులు ఇవ్వాలన్నారు.

February 25, 2026 / 05:02 PM IST

ఏఎంసీ భవన ఆధునీకరణకు నిధులు

SKLM: రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో కోటబొమ్మాళి వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనం ఆధునికీకరణకు నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలానే చీపుర్లుపాడు వద్ద మార్కెట్ యార్డు ,సంబంధిత మౌలిక వసతుల అభివృద్ధికి మంజూరు చేశారు. మొత్తం 3 కోట్ల 20 లక్షల రూపాయలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

February 25, 2026 / 05:02 PM IST

అన్న సమారాధనలో పాల్గొన్న వైసీపీ నేత

విజయనగరంలోని నందివీధిలో వెలసిన శ్రీ పైడితల్లమ్మ వారి (గద్ది) 12వ వార్షిక మహోత్సవాలు ఇవాళ అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఈ మహోత్సవాల్లో నెల్లిమర్ల నియోజవర్గ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ నాయుడు పాల్గొన్నారు..అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన చేతులు మీదగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.

February 25, 2026 / 05:01 PM IST

అసెంబ్లీ సమావేశాలను వీక్షించిన విద్యార్థులు

కృష్ణా: పెనమలూరు (M) తాడిగడప జిల్లా పరిషత్ హై విద్యార్థులు బుధవారం అసెంబ్లీ సమావేశాలను వీక్షించారు. చట్ట సభల్లో చట్టాలను రూపొందించడం, అమలు పరచడం, సమస్యలపై ఎమ్మెల్యేలు చర్చించే తీరును స్వయంగా వీక్షించడంత విద్యార్థులు అనుభూతి చెంది తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బోదే ప్రసాద్ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.

February 25, 2026 / 05:00 PM IST

కలెక్టర్‌ను కలిసిన వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు

W.G: కలెక్టర్ నాగరాణిని భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తల బృందం బుధవారం మర్యాదపూర్వకంగా కలిసింది. పెదఅమిరం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో డా. మానస, డా. జాగృతి రోహిత్, డా. రాఘవేంద్ర, డా. సతీష్ చవాన్ పాల్గొన్నారు. భవిష్యత్తులో జిల్లాలో వరి సాగుపై రైతులకు మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టే అంశంపై చర్చించారు.

February 25, 2026 / 04:59 PM IST

కేబినెట్ విస్తరణలో బాలకృష్ణకు ఛాన్స్?

సత్యసాయి: రాష్ట్ర కేబినెట్ విస్తరణపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు కీలక శాఖ ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు సమాచారం. పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకుంటారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

February 25, 2026 / 04:55 PM IST

‘రూ.1లక్షను వెంటనే చెల్లించాలి’

ASR: పీఎం జన్ మన్ ఇళ్ల నిర్మాణాలకు పెంచిన రూ.1లక్షను వెంటనే లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాలని సీపీఎం అరకు మండల కార్యదర్శి రామారావు, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు దశరథ్ కోరారు. బుధవారం బస్కి పంచాయతీలో పర్యటించారు. గృహ నిర్మాణ లబ్ధిదారులతో నిరసన తెలిపారు. పెంచిన రూ.1లక్ష చెల్లించాలని కోరుతూ ఈనెల 27న నిర్వహించనున్న ఛలో ఐటీడీఏ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.

February 25, 2026 / 04:54 PM IST

సోలార్ సమస్యలు ఉన్నాయా.. ఈ నెంబర్‌కు 1912కు తెలపండి

ATP: సోలార్ విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాల్ సెంటర్‌లో సోలార్ విద్యుత్ సమస్యలను సైతం ఫిర్యాదు చేసే స్కౌకర్యాన్ని నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులను నిర్దిష్ట గడువులోపు పరిష్కరిస్తామన్నారు.

February 25, 2026 / 04:52 PM IST

దుద్యాలలో ఘనంగా రామాలయ భూమి పూజ

అన్నమయ్య: సంబేపల్లి(మం) దుద్యాల గ్రామంలోని కొండ కింద పల్లెలో నూతన రామాలయ నిర్మాణానికి బుధవారం భూమి పూజ ఘనంగా జరిగింది. TDP నేత మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. రాయచోటి నియోజకవర్గంలో 39 ఆలయాల కోసం టీటీడీ శ్రీవాణి ట్రస్టు రూ. 6.7 కోట్లు మంజూరు చేసిందని, అందులో భాగంగా ఈ రామాలయానికి రూ.10 లక్షలు కేటాయించినట్లు ఆయన తెలిపారు.

February 25, 2026 / 04:50 PM IST

‘కార్యకర్తల క్షేమానికి ఉద్యమి సభ్యత్వ నమోదు కీలకం’

ELR: పార్టీ బలోపేతానికి, కార్యకర్తల క్షేమానికి ఉద్యమి సభ్యత్వ నమోదు కీలకమని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. బుధవారం ఉంగుటూరు శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో భీమడోలు మండలానికి సంబంధించి ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భీమడోలు మండలానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 25, 2026 / 04:46 PM IST

ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి’

ATP: గుత్తిలోని ఏపీ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో కొత్తగా ప్రవేశం కోసం 6, 7, 8 తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ స్వాతి బుధవారం ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 24న ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు.

February 25, 2026 / 04:45 PM IST