అన్నమయ్య: జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగంపై డ్రోన్లతో నిఘాను మరింత పటిష్టం చేసి, జీరో టోలరెన్స్ విధానంతో కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. కూల్ లిప్ అనే నికోటిన్ పదార్థాన్ని పాఠశాలలు, కళాశాలల్లో నిషేధించాలని సూచించారు. ఎన్జీవోల సమన్వయంతో డి-అడిక్షన్ కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. జిల్లా ఎస్పీ పాల్గొన్నారు.
NDL: మహానంది దేవస్థానానికి గత 27 రోజుల్లో రూ. 25,05,573 ఆదాయం వచ్చినట్లు EO కాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లా దేవాదాయశాఖ అధికారి మోహన్ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. మహానందీశ్వర స్వామి, కామేశ్వరీదేవి, సీతా కోదండ రామాలయాల హుండీల్లో రూ.34,64,108 వసూలవగా, గో సంరక్షణ నిధికి రూ.16,825, అన్నదాన హుండీకి రూ.24,640తో పాటు 2 USA డాలర్లు వచ్చాయి.
KDP: సిద్ధవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారి కనుమలోపల్లి సమీపాన వెలసిన శ్రీ మానసా దేవి అమ్మవారికి శుక్రవారం కడప పట్టణానికి చెందిన నారాయణ,రవికుమార్ కుటుంబ సభ్యులు రూ. 2 లక్షలు విలువైన తొడుగులు సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమ్మవారి విగ్రహ ప్రతిష్ట రోజు తొడుగులు సమర్పిస్తామని మొక్కుకున్నామన్నారు. అందుకు ఇవాళ అమ్మవారికి మొక్కులు చెల్లించామన్నారు.
తూ.గో: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో శనివారం ‘శాస్త్రజగతి-వికసిత భారత మహిళా ఉత్ప్రేరక జాగృతి’ అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. శుక్రవారం వర్సిటీలో దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఆమె ఆవిష్కరించారు. చార్టెడ్ అకౌంటెంట్ వి.వి.ఎస్. నారాయణ హాజరవుతారని వీసీ వెల్లడించారు.
NLR: బుచ్చి(M) రెడ్డిపాలెం గ్రామంలోని శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని బీజేపీ రూరల్ మండల ఉపాధ్యక్షులు పెంచలకృష్ణ ఆ పార్టీ నేతతో కలిసి ఎంపీడీవోకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. రహదారికి లోతట్టు ప్రాంతంలో శ్మశాన వాటిక ఉండడంతో చుట్టుపక్కల పొలాల నుంచి నీరు ఊరుతూ అంత్యక్రియలకు ఇబ్బందిగా ఉందన్నారు. శ్మశాన వాటికలో గ్రావెల్‌తో చదును చేయాలన్నారు.
PPM: జిల్లా పోలీసు శాఖలో ఎఎస్ఐగా పనిచేస్తూ ఇటీవల ఆనారోగ్యంతో మృతిచెందిన ఆర్.ఆదినారాయణ కుటుంబానికి ఎస్.బి.ఐ శాలరీ ప్యాకేజ్ కింద రూ.10 లక్షల చెక్కును ఆయన సతీమణికి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి శుక్రవారం అందజేశారు. జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పి.ఎస్.పిని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ, ఎ.ఆర్.డీఎస్పీ పాల్గొన్నారు.
AKP: స్కూల్ పిల్లలను తీసుకు వెళుతున్న బస్సులు, ఆటోలను శుక్రవారం ఎలమంచిలిలో మోటర్ వెహికల్ ఇన్స్‌స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. రికార్డులు లేనివారికి అపరాధ రుసుము విధించినట్లు ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి శనివారం ఉ. 7 గంటలకు నరసన్నపేట M కోమర్తి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీలో పాల్గొంటారు. అనంతరం ఉ. 8 కు నరసన్నపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చెత్త సేకరణ కోసం రిక్షా సైకిళ్లను పంపిణీ చేస్తారు అని ఎమ్మెల్యే కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
VSP: మార్చి 3న సంభవించనున్న చంద్రగ్రహణం పురస్కరించుకుని విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు మూసివేస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది. గ్రహణం కారణంగా మధ్యాహ్నం పంచామృతాభిషేకం ముగిసిన తర్వాత దర్శనాలు నిలిపివేస్తారు. తిరిగి రాత్రి గ్రహణానంతరం సంప్రోక్షణ నిర్వహించి దర్శనాలకు అనుమతిస్తారు.
VZM: జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద శనివారం 2,69,748 మందికి రూ.114.83 కోట్లు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని రావివలస గ్రామ సచివాలయ పరిధిలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో 36,903 మందికి రూ.15.80 కోట్లు, చీపురుపల్లి మండలంలో 8,431 మందికి రూ.3.56 కోట్లు, రావివలస గ్రామంలో 387 మందికి రూ.16 లక్షలు అందజేయనున్నారు.
ప్రకాశం: బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత అని మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ తెలిపారు. శుక్రవారం కనిగిరిలో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలను అరికట్టేందుకు సమాజంలో విస్తృత అవగాహన అవసరమని, గ్రామాలను బాల్య వివాహ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడంలో అంగన్వాడీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలన్నారు.
CTR: పుంగనూరు మండలం షుగర్ ఫ్యాక్టరీ సమీపాన వెంకట్ రెడ్డి యాదవ్ మామిడి తోటలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఒకసారిగా మాటలు చెలరేగడంతో స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి ఆర్పేశారు. ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు.
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గత నవంబర్‌లో నిర్వహించిన ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 3వ సెమిస్టర్ ఫలితాలను పరీక్షల నియంత్రణ అధికారి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. రీవాల్యుయేషన్ కోరుకునే అభ్యర్థులు మార్చి 9లోపు రూ.1,860 చెల్లించాలని, పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ఆయన సూచించారు.
SKLM: ప్రభుత్వం ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. శుక్రవారం నరసన్నపేట మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద ఈ మేరకు వారు ధర్నా నిర్వహించారు. సభ్యులు శ్రీధర్ రావు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్ సమస్యలు తీర్చాలని అన్నారు.
VZM: వీటి అగ్రహారం ప్రభుత్వ ITI కళాశాలలోని నైపుణ్య కేంద్రం నందు జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సుకు 3 నెలలు శిక్షణ కొరకు ధరఖాస్తులు కోరడమైనదని ITI ప్రిన్సిపల్ టి.వి గిరి తెలిపారు.18 నుంచి 35 ఏళ్లలోపు ఉండి, ఇంటర్ చదివిన వారు అర్హులన్నారు. అభ్యర్ధులు మార్చి 5వ తేదీలోపు https://forms.gle/vkUYDKj9DZyaHY2T8 లింక్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.