• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘అడవుల చుట్టూ ఎకో-సెన్సిటివ్ జోన్ తప్పనిసరి’

KDP: ప్రతి రక్షిత అడవి, వన్యప్రాణి కేంద్రం చుట్టూ 1KM మేర ఎకో-సెన్సిటివ్ జోన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం ప్రొద్దుటూరు, బద్వేలు అటవీ ప్రాంతాల మాస్టర్ ప్లాన్‌పై DFO వినీత్ కుమార్‌తో కలిసి కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. అటవీ సంపదను, వన్యప్రాణులను రక్షించేందుకు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.

February 25, 2026 / 06:00 AM IST

జిల్లాలో పెరగనున్న ఎండలు

ATP: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయ్ శంకర్ బాబు, నారాయణస్వామి తెలిపారు. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. గాలిలో తేమ మధ్యాహ్నం సమయానికి 35 శాతానికి పడిపోతుందని, ఆగ్నేయ దిశ నుంచి గంటకు 5కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు.

February 25, 2026 / 06:00 AM IST

రొయ్యల చెరువులో మృతదేహం లభ్యం

E.G: నిడదవోలు మండలం సమిశ్రగూడెంలోని రొయ్యల చెరువులో మంగళవారం ఒక మృతదేహం లభ్యమైంది. మృతుడిని వెస్ట్ బెంగాల్‌కు చెందిన మోతీ పరదార్‌గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న సమిశ్రగూడెం SI సుందర్ బాలాజీ రావు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

February 25, 2026 / 06:00 AM IST

పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్

KKD: జిల్లాలోని అన్ని పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ షాన్మోహన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి మున్సిపల్ కమిషనర్లతో పారిశుద్ధ్యం, మంచినీరు, వీధిలైట్ల నిర్వహణ, అన్న క్యాంటీన్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిషనర్లు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ సుపరిపాలన అందించాలని ఆదేశించారు.

February 25, 2026 / 06:00 AM IST

పొట్టు లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం

NDL: కొలిమిగుండ్ల మండలం నందిపాడు సమీపంలో షార్ట్ సర్క్యూట్ వల్ల పొట్టు లోడుతో వెళ్తున్న లారీలో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. మంగళవారం మధ్యాహ్నం మంటలు వ్యాపించగా పోలీసులు, రాంకో ఫైర్ సిబ్బంది సహాయంతో స్థానికులు మంటలను ఆర్పివేశారు. తిరిగి రాత్రి 8 గంటల సమయంలో అక్కడే ఉన్న పొట్టు లారీలో మళ్లీ మంటలు వ్యాపించాయి. దీంతో లారీ పూర్తిగా దగ్ధమైంది.

February 25, 2026 / 06:00 AM IST

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

NLR: జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షల కేంద్రాలను మంగళవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా తనిఖీ చేశారు. నగరంలోని డీకే డబ్ల్యూ కళాశాలలో విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తున్నారో పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షలను నిర్వహించాలని ఇన్విజిలేటర్లకు ఆయన సూచించారు.

February 25, 2026 / 06:00 AM IST

గొల్లపల్లి రిజర్వాయర్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు

సత్యసాయి: గొల్లపల్లి రిజర్వాయర్‌ను ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు జిల్లా పర్యాటక అధికారి నరసయ్య బృందం క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేపట్టింది. రిజర్వాయర్‌లో పర్యాటకులను ఆకర్షించేందుకు బోటింగ్ కేంద్రం ఏర్పాటుపై అధికారులు చర్చించారు. పర్యాటకుల బస కోసం అత్యాధునిక రిసార్టులు, గదుల నిర్మాణానికి అనువైన స్థలాలను ఈ సందర్భంగా గుర్తించారు.

February 25, 2026 / 06:00 AM IST

జిల్లా జైలును తనిఖీ చేసిన ‘బోర్డ్ ఆఫ్ విజిటర్స్’

KRNL: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన బోర్డ్ ఆఫ్ విజిటర్స్ బృందం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ.కబర్ధి నేతృత్వంలో మంగళవారం స్థానిక జిల్లా కారాగారాన్ని సందర్శించింది. ఈ బృందం జైలులోని వసతులు, ఖైదీల యోగక్షేమాలను స్వయంగా పరిశీలించింది. జైలు కిచెన్ను సందర్శించిన అధికారులు, ఖైదీలకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేసింది.

February 25, 2026 / 06:00 AM IST

విత్తన ప్రాసెసింగ్ యూనిట్ తనిఖీ

AKP: కోటవురట్ల మండలం తంగేడు గ్రామంలో విత్తన ప్రాసెసింగ్ యూనిట్ ను జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యమైన విత్తనాలు తయారు చేయాలని సూచించారు. తయారుచేసిన విత్తనాలను మెంటలేషన్ చక్కగా ఉన్న ప్రదేశంలో నిల్వ చేయాలన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలన్నారు. మండల వ్యవసాయ అధికారిణి సరోజిని పాల్గొన్నారు.

February 25, 2026 / 05:52 AM IST

‘పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి’

TPT: పదవ తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 01 వరకు నిర్వహించబడతాయి. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 31,334 మంది విద్యార్థులు 179 కేంద్రాల్లో పరీక్షలకు హాజరవుతారు. ప్రశ్నపత్రాల రవాణాకు కట్టుదిట్టమైన భద్రత, కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు, సెక్షన్ 144 అమలు చేయాలని సూచించారు.

February 25, 2026 / 05:46 AM IST

టీడీపీ అంటేనే ఒక సమిష్టి కుటుంబం: ఎమ్మెల్యే

కోనసీమ: టీడీపీ అంటే ఒక పార్టీ మాత్రమే కాదని, ఇదొక సమిష్టి కుటుంబమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. మంగళవారం మానవవనరుల శాఖామంత్రి, యువ నాయకులు నారా లోకేష్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన డిన్నర్ ఆత్మీయ సమావేశం ఈ అంశాన్ని మరోసారి రుజువు చేసిందని ఆయన పేర్కొన్నారు.

February 25, 2026 / 05:36 AM IST

మంగళగిరిలో వైభవంగా హనుమంత వాహన సేవ

GNTR: మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సుందరంగా అలంకరించిన ఉత్సవ మూర్తులతో మాడవీధుల నుంచి మిద్దె సెంటర్ వరకు గ్రామోత్సవం వైభవంగా సాగింది. ఈ వాహన సేవను దర్శించుకుంటే భక్తులకు సద్బుద్ధి, అభయం కలుగుతాయని ప్రధాన అర్చకులు తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గోన్నారు.

February 25, 2026 / 05:35 AM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

CTR: పలమనేరు పెద్ద చెరువు కట్టపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. రెండు బైకులు ఢీ కొట్టిన ఘటనలో మండిపేట కోటూరుకు చెందిన లక్ష్మీ పతి, మాదిగ బండకు చెందిన హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు హుటాహుటిన పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

February 25, 2026 / 05:34 AM IST

నల్లమాడలో జూదరుల అరెస్ట్

సత్యసాయి: నల్లమాడ మండల పరిధిలోని రెడ్డిపల్లి ప్రాంతంలో జూదం ఆడుతున్న ఐదుగురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 4,800 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. రహస్య సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి జూద స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించినట్లు పేర్కొన్నారు.

February 25, 2026 / 05:30 AM IST

జిల్లా అభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశం

ATP: జిల్లా అభివృద్ధి పనులపై మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పురోగతి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజాప్రతినిధులు అధికారులతో చర్చించారు. నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని, పనుల్లో నాణ్యత పాటించాలని మంత్రులు ఆదేశించారు.

February 25, 2026 / 05:30 AM IST