సత్యసాయి: RDT సంస్థను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్సీ జన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ దాసగానపల్లి కుల్లాయప్ప పేర్కొన్నారు. బత్తలపల్లి మండలంలో జరిగిన కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ ఇంఛార్జ్ సాకే వినయ్ కుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాకే కుళ్లాయప్పతో కలిసి ఆయన మాట్లాడారు. ఆ సంస్థ పేదలకు అందిస్తున్న సేవలు అమోఘమని కొనియాడారు.
SKLMఫ ఏళ్ల తరబడి సాగుతున్న కేసులకు జాతీయ లోక్ అదాలత్ ఉత్తమ పరిష్కార మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. శ్రీకాకుళం న్యాయసేవా సదన్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మార్చి 14న వివిధ బెంచీల్లో లోక్ అదాలత్ నిర్వహించనుస్నట్లు పేర్కొన్నారు. ఆదాలత్‌లో కేసుల రాజీకి ఇరువర్గాలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు .
CTR: నగరి మున్సిపాలిటీ దళితవాడలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతుండగా పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో సీఐ మల్లికార్జునరావు దాడులు చేసి,పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.36,900 స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
W.G: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడాపోటీలలో క్రికెట్ ఆడుతుండగా రన్ చేస్తూ కింద పడిపోయిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు రిస్ట్ ఎముక శస్త్ర చికిత్స విజయవంతం అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చికిత్స తరువాత కోలుకుంటున్నారు. హైదరాబాద్ AIG ఆసుపత్రిలో ఆయనకు గురువారం శస్త్ర చికిత్స జరిగింది.
ELR: ఏపీ వడ్డీల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి గురువారం ఏలూరులో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం 100 మంది సాధక్ (వాలంటీర్)లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
SKLM: విజయవాడలోని శాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఏపీ అసెంబ్లీ క్రీడా మహోత్సవం ఆట విడుపు’ 2వ రోజు పోటీల్లో మంత్రి అచ్చెన్నాయుడు గురువారం పాల్గొన్నారు. ఈ మేరకు మంత్రి బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతూ, మైదానంలో సందడి చేశారు. స్టేడియం మొత్తం క్రీడా స్ఫూర్తితో కళకళలాడింది. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం అని మంత్రి తెలిపారు.
NLR: నమ్మకంగా ఉంటూనే నగదుతో ఉడాయించిన ఘటన మనుబోలు మండలంలో చోటుచేసుకుంది. వెంకన్నపాలెంలోని ఇండియన్ పెట్రోల్ బంకులో మేనేజర్ కమ్ క్యాషియర్‌గా పనిచేస్తున్న కొలనుకుదురుకు చెందిన కుమార్ బంకులోని రూ.4 లక్షల నగదుతో పరారయ్యాడు. ఏడాదిగా పనిచేస్తున్న అతడు నగదుతో కనిపించకుండా పోవడంతో యజమాని రాజశేఖర్ రెడ్డి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
CTR: కుప్పం ఇన్‌ఛార్జ్ ఆర్డీవోగా విజయలక్ష్మి నియమితులయ్యారు. 2018 గ్రూప్-1కు సంబంధించిన అధికారులను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అప్రాధాన్య పోస్టుల్లో నియమించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో కుప్పం RDO శ్రీనివాసరాజు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో KRC డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మికి ఇన్‌ఛార్జ్ ఆర్డీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ATP: గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని పలు కిరాణా దుకాణాలపై మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి శుక్రవారం రెండో రోజు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు దుకాణంలో నిలవాల్సిన భారీ మొత్తంలో ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం గోకుల్ కిరాణా స్టోర్ యజమానికి రూ.10000 జరిమానా విధించారు.
BPT: సంతమాగులూరు మండలం ఏల్చూరులో శనివారం మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, విద్యార్థులకు సైకిళ్లు అందజేయనున్నారు. అనంతరం అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వార్షికోత్సవాన్ని ప్రారంభిస్తారని ఆయన కార్యవర్గం తెలిపింది. శింగరకొండపాలెంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని Calculation, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.
VZM: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో విజయనగరం రాజీవ్ ఇండోర్ స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న 7వ రాష్ట్ర స్థాయి పారా బాడ్మింటన్ పోటీలు గురువారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరత్ ఖాదర్ వలి బాబా పుణ్యక్షేత్రం ధర్మకర్త డా.ఖలీల్ బాబు హాజరయ్యారు. విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్స్ అందజేశారు.
అన్నమయ్య: రాజంపేట మండలం బోయినపల్లి వద్ద శుక్రవారం పందిని తప్పించబోయి లారీ ఢీకొని ఆటో డ్రైవర్ అక్కడకక్కడే మృతి చెందాడు. మృతుడు వెలగచర్ల నాగేంద్రబాబు(30)గా స్థానికులు గుర్తించారు.ఈ మేరకు మన్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం ఏఎన్ఆర్ కమ్మపల్లిలో ఓ వ్యక్తి చనిపోయిన తన తల్లిదండ్రులపై ప్రేమచాటుకుంటున్నాడు. గ్రామానికి చెందిన హరి తండ్రి వెంకటరత్నం ఆచారి 2008లో, తల్లి లలితమ్మ 2012లో చనిపోయారు. గతంలోనే తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా శుక్రవారం ఉదయం ఆ పక్కనే తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అభిషేకాలు నిర్వహించారు.
CTR: నిండ్ర మండలంలోని పాదిరి దళితవాడ నందు రాధా రుక్మిణి శ్రీకృష్ణ దేవాలయం కుంభాభిషేకం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరి నియోజవర్గం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ వారు ఘనంగా స్వాగతం పలికారు . అనంతరం స్వామి వారిని దర్శించుకుని, ఆయనకు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కృష్ణ: మచిలీపట్నం పోర్ట్‌కు రైల్వే అనుసంధానం మరింత వేగంగా పూర్తయ్యేలా అవసరమైన ప్రతిపాదనలను తక్షణమే సమర్పించాలని కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓడరేవు రాకపోకలకు ఉపయోగపడే రైల్వే ఓవర్, అండర్‌బ్రిడ్జిల నిర్మాణంపై స్పష్టమైన అంచనాలతో నివేదికలు ఇవ్వాలని సూచించారు.