• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘స్వర్ణ గ్రామం’ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ASR: ప్రజలే మా బలం.. గ్రామాల అభివృద్ధే మా లక్ష్యం అని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మంగళవారం హుకుంపేట(మం) తాడిపుట్టు గ్రామ సచివాలయ (స్వర్ణ గ్రామం) నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాడిపుట్టును ఆదర్శ స్వర్ణ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. స్థానిక సర్పంచ్ సోమెలి సత్యవతి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

February 24, 2026 / 03:12 PM IST

బాపట్ల జిల్లాలో వేగంగా రీ-సర్వే ప్రక్రియ

BPT:  జిల్లాలోని పది గ్రామాల్లో రీ-సర్వే ప్రక్రియ వేగంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం వెల్లడించారు. జిల్లాలో మొత్తం 6,400 పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,287 మంది రైతులకు అందజేశామని తెలిపారు. మిగిలిన పుస్తకాలను కూడా జాప్యం లేకుండా తక్షణమే అర్హులకు అందించాలని అధికారులను ఆదేశించారు.

February 24, 2026 / 03:06 PM IST

రిలే సామూహిక దీక్షలకు మాజీ ఎమ్మెల్యే మద్దతు

ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు మంగళవారం ఐదవ రోజుకు చేరాయి. దీక్షాపరులకు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని చెరువులకు నీళ్లు అందించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని వారు దీక్షాపరులకు హామీ ఇచ్చారు.

February 24, 2026 / 03:00 PM IST

శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి హుండీ లెక్కింపు

NLR: బోగోలు మండలంలోని కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు లెక్కించారు. మంగళవారం ఈ సందర్భంగా కార్యనిర్వాహణ అధికారి రాధాకృష్ణ మాట్లాడుతూ.. మూడు నెలలకు గాను హుండీ ఆదాయం రూ.19,83,056 వచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 03:00 PM IST

కారును తగలబెట్టిన గుర్తు తెలియని దుండగులు

ప్రకాశం: కంభంలో రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన స్కార్పియో కారును మంగళవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు తగలబెట్టారు. కంభంలోని తన నివాసంలో సమయంలో నిద్రిస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగిన విషయాన్ని గుర్తించి మంటలను ఆర్పి వేసినట్లు రాజేశ్వర్ రెడ్డి తెలిపాడు. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి తన ఇంటి ఆవరణలోకి ప్రవేశించి కారును తగలబెట్టారన్నారు.

February 24, 2026 / 03:00 PM IST

పుట్టపర్తిలో సచ్చిదానంద ప్రసాద్‌కు ఘన స్వాగతం

సత్యసాయి: పుట్టపర్తికి చేరుకున్న పీఎంశ్రీ పాఠశాలల కేంద్ర కమిషనర్ సచ్చిదానంద ప్రసాద్‌కు ఘన స్వాగతం లభించింది. ప్రశాంతి నిలయంలోని శాంతిభవన్ అతిథి గృహం వద్ద ఆయనకు జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా జేసీ కేంద్ర కమిషనర్‌కు మొక్కను అందజేసి పర్యావరణ హితంగా స్వాగతం పలికారు.

February 24, 2026 / 03:00 PM IST

‘యుద్ధ ప్రాతిపదికన వైద్యం అందించాలి’

SKLM: డయేరియా వ్యాధి గ్రస్తులకు యుద్ధ ప్రాతిపదికన పూర్తిస్థాయి వైద్యం రాష్ట్ర ప్రభుత్వం అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. చనిపోయిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. డయేరియా ప్రభలిన ప్రాంతాల్లో సీపీఎం బృందం మంగళవారం పర్యటించారు.

February 24, 2026 / 02:51 PM IST

రాజమండ్రిలో కొనసాగుతున్న అంగన్వాడీల రిలే నిరాహార దీక్ష

E.G: రాజమండ్రిలో అంగన్వాడీ హెల్పర్లు, వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్ష శిబిరాన్ని CITU జిల్లా నాయకులు ఎస్.ఎస్ మూర్తి సందర్శించి మాట్లాడారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు, గ్రాడ్యుటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెడికల్ లివ్, మే నేల అంత వేసవి సెలవులు ఇస్తూ GO విడుదల చేయాలన్నారు.

February 24, 2026 / 02:50 PM IST

‘పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి’

PPM: జిల్లాలో మార్చి 2వ తేదీ నుండి 13 వరకు జరగనున్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ సార్వత్రిక (ఓపెన్ స్కూల్) పరీక్షలకు పక్కా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ డా:ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలన్నారు.

February 24, 2026 / 02:49 PM IST

డ్రైనేజ్ పనులు ప్రారంభించిన ఛైర్ పర్సన్

KRNL: ఆదోని బావాజీ పేట రెండో వార్డ్‌లో రూ. 800,000 విలువైన కొత్త డ్రైనేజ్ పనులు ఇవాళ ప్రారంభించబడ్డాయి. డాక్టర్ వాల్మీకి ఎమ్మెల్యే పార్థసారథి ఆదేశాల మేరకు ఈ పనుల ప్రారంభానికి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఛైర్ పర్సన్ లోకేశ్వరి, మున్సిపల్ కమిషనర్ నయం, ఏఈ, డీఈ, కాంట్రాక్టర్ రఘు, వార్డ్ కౌన్సిలర్ ఏవి సురేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

February 24, 2026 / 02:43 PM IST

పోలీసులకు ‘డీ మొబలైజేషన్’

అనకాపల్లి జిల్లా ఏఆర్ బలగాలకు కైలాసగిరిలో నిర్వహించిన వార్షిక డీ మొబలైజేషన్ మంగళవారం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా మాట్లాడుతూ.. 15 రోజులు పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు నూతన దృక్పథంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.

February 24, 2026 / 02:42 PM IST

‘సర్క్యులర్ ఎకానమీ & గ్రీన్ కంపెనీస్’ కాన్ఫరెన్సు ప్రారంభం

VSP: ఏపీ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు కాన్ఫ‌డ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీస్ ఆధ్వర్యంలో గాదిరాజు ప్యాలెస్‌లో ‘సర్క్యులర్ ఎకానమీ & గ్రీన్ కంపెనీస్’ అంశంపై కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రారంభించారు. పర్యావరణ హితమైన పారిశ్రామిక విధానాల‌ ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించడమే ప్...

February 24, 2026 / 02:42 PM IST

అతిథి అధ్యాపకులకు గుడ్ న్యూస్..!

KDP: యోగివేమన యూనివర్సిటీ పీజీ కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ విభాగ గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం ఈనెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ టి.శ్రీనివాస్ తెలియజేసారు.ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా,సంబంధిత ఒరిజినల్ సర్టిఫి కెట్లు, సర్టిఫికెట్ల జిరాక్స్ నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.

February 24, 2026 / 02:35 PM IST

ఘనంగా రామక్కమ్మ ఆరాధన ఉత్సవాలు

CTR: విజయపురం(మం) కొసలనగరం మీట్టూరు శ్రీ రామక్కమ్మ ఆశ్రమం నందు మంగళవారం 46వ ఆరాధాన ఉత్సవాలు ఆశ్రమ నిర్వాహలు వాసుదేవ స్వామి నిర్వహించారు. ఆంధ్ర, తమిళనాడుకు చెందిన భక్తులు వేల సంఖ్యలో హాజరై అమ్మవారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఉదయం నుంచి దర్శన ఏర్పాట్లు, అన్నదానం ఏర్పాటు చేశారు. కోలాటం, చెక్కభజన, హారికధ, ప్రదర్శించారు.

February 24, 2026 / 02:35 PM IST

సైక్లింగ్ పోటీలను ప్రారంభించిన కలెక్టర్

PLD: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను వెలికితీసేందుకు ప్రతి నెల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా వెల్లడించారు. మంగళవారం నరసరావుపేటలో కోడెల క్రీడా ప్రాంగణంలో జరిగిన జూనియర్ అండర్-18 సైక్లింగ్ (వ్యక్తిగత, మాస్టర్ విభాగాలు) పోటీలను ఆమె జెండా ఊపి ప్రారంభించారు.

February 24, 2026 / 02:35 PM IST